Podharillu Serial Today January 6th: ఎట్టకేలకు మహా మహాలక్ష్మీ నిలయం నుంచి బయటపడిందా.? ఇంట్లో నుంచి వచ్చే ముందు మహా ఏం చేసింది..?
Podharillu Serial Today Episode January 6th: చక్రిసాయంతో మహా ఇంట్లో నుంచి అడుగుబయటపెడుతుంది. చివరిసారి తనవాళ్లు అందరినీ వదిలిపెట్టి వచ్చేందుకు ఎంతో బాధపడుతుంది.

Podharillu Serial Today Episode: మహావాళ్ల అమ్మానాన్న, అన్న గుడికి వెళ్లడంతో ఇంట్లో నుంచి పారిపోవడానికి ఇదే సరైన సమయమని భావించిన మహా...ఇంట్లోకి వెళ్లి బట్టలన్నీ సర్దుకుంటుంది.అప్పుడే అక్కడికి వచ్చిన హారిక...మహాకు టీ తీసుకొచ్చి ఇస్తుంది. ఆమెఇంట్లోనుంచి వెళ్లిపోవడానికి రెడీ అవుతుందని తెలియక...సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తుంటుంది. భూ।షణ్‌ను మనం ఒకవైపు నుంచే చూస్తున్నామనుకుంటా అని అంటుంది.అతను మంచివాడే కానీ...కొంచెం ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నాడు అంతేనని అంటుంది. మరోవైపు మహాకు వాళ్ల వదిన ఎక్కడ సూటికేసు చూస్తుందేమోనని భయపడిపోతుంది. ఏదీ మన చేతుల్లో లేదని నువ్వు ఎలాంటి విషయాల గురించి ఆలోచించవద్దని హితవుపలుకుతుంది.మనం ఇద్దరం ఎన్ని మాట్లాడుకున్నా....జరిగేది జరిగితీరుతుంది కదా వెళ్లి పనులు చూసుకో వదినా అంటూ మహా తనని పింపించేస్తుంది.
చీకటిపడటంతో నిహారిక తన కూతురు నిద్రపుచ్చే పనిలో ఉంటుంది. ఇంతలో మహా పారిపోవడానికి చక్రి అంతా సిద్ధం చేస్తాడు. మహాకు ఫోన్ చేసి బ్యాగ్ తెచ్చి ఇవ్వాలని చెబుతాడు. సిటీ నుంచి కారు తెప్పిస్తున్నాని..అది ఇంకా రాలేదు కాబట్టి ఈలోగా మీరు లగేజీ తీసుకొచ్చి ఇస్తే...నేను చాటుగా ఓ దగ్గర పెడతానని అంటాడు. ఆ తర్వాత మీరు ఒక్కరే ఈజీగా బయటకు రావొచ్చని చెబుతాడు. దీంతో ఎవరూ చూడకుండా మహా తన సూటకేసు తీసుకొని బయటకు వచ్చి చక్రికి అందజేస్తుంది.
రాత్రి 12 గంటలకు రెడీగా ఉంటాను మీరు బయటకు వచ్చి ఒకసారి ఫోన్ చేస్తే సరిపోతుందని చెబుతాడు. ఇంతలో గుడి నుంచి వచ్చిన ప్రతాప్, ఆది,లలిత మహాను పిలిచి పూజ బాగా జరిగిందని చెబుతారు. అలాగే కల్యాణమండపానికి వెళ్లి ఏర్పాట్లు అన్నీ చూసి వచ్చామని గొప్పగా చెబుతుంటారు. అల్లుడిగారికి కూడా కల్యాణ మండపం చూపించామని అతనికి చాలా నచ్చిందని చెబుతారు. అలాగే నిన్న త్వరగా నిద్రపోమ్మని చెప్పారంటే...అతనికీ నీపై ఎంతో ప్రేమ ఉందని చెబుతారు. ప్రతాప్ మహాకు సారీ చెప్పి వెళ్లి అందరూ పడుకుంటారు.మహా కూడా తన రూమ్‌లోకి వెళ్లిపోతుంది.
ఇంతలో చక్రి ఫోన్ చేసి కారుతో రెడీగా ఉన్నానని చెప్పి ఫోన్ చేస్తాడు. మహా సరేనని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వాళ్లనాన్న పడుకున్నాడో లేదోనని వెళ్లి చూసి అక్కడ చాలాసేపు ఏడుస్తుంది. తొలిసారి గడపదాటి బయటకు వెళ్లిపోతున్నందుకు చాలా బాధపడుతుంది. వాళ్ల నాన్న ఫొటోపట్టుకుని చాలా బాధపడుతుంది. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే...నాన్న అనుకున్నట్లే ప్రేమించిన వాడితో లేచిపోయాననే అనుకుంటారని మహా బాధపడుతుంది.కాబట్టి నేను ఎందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతున్నానో కారణం వీళ్లకు తెలియాలి అని అనుకుంటుంది. అందుకే మహా ఓ లెటర్ రాసి టేబుల్‌పై పెట్టి వెళ్లిపోతుంది. ఎవరూ చూడకుండా గడపదాటి బయటకు వస్తుంది. ఇంటి ముందు ఉన్న మహాలక్ష్మీ నిలయం అనే పేరు చూసి చాలా బాధపడుతుంది.





















