అన్వేషించండి

Chinni Serial Today March 12th: చిన్ని ప్రజెంటేషన్ చెడగొట్టిన మ్యాడీ....అయినా తొలి మీటింగ్‌లోనే 20 కోట్ల ఢీల్‌ చిన్ని ఎలా ఓకే చేయించింది...?

Chinni Serial Today Episode March 12th:చిన్ని ప్రజెంటేషన్ చెడగొట్టిన మ్యాడీ....అయినా తొలి మీటింగ్‌లోనే 20 కోట్ల ఢీల్‌ చిన్ని ఎలా ఓకే చేయించింది...?

Chinni Serial Today Episode: చిన్నిని ఆఫీసు నుంచి పంపించేయడానికి కుట్రలు పన్నిన మ్యాడీ...సాయంత్రం జరిగే క్లయింట్‌ మీటింగ్‌లో ఢీల్‌ ఓకే చేయిస్తేనే ఉద్యోగంలో ఉంచుతానని చెప్పడంతో చిన్ని చాలా కష్టపడి డ్రాయింగ్‌లు వేస్తుంది. కనీసం భోజనానికి కూడా పోకుండా  అక్కడే ఉండి పనిచేస్తుండటం మ్యాడీ చూస్తాడు. ఇది ఏదైనా అనుకున్నదంతే సాధించేవరకు వదిలిపెట్టదని అనుకుంటాడు. ఇలాగే వదిలేస్తే సాయంత్రం మీటింగ్‌లో తన కాన్సెప్ట్‌తో క్లయింట్‌ను ఒప్పించినా  ఒప్పిస్తుందని అనుకుంటాడు. 

చిన్ని కష్టపడి వేస్తున్న డ్రాయింగ్ చూడటానికి ఆమె దగ్గరకు వెళ్తాడు. అది చూసి షాక్‌ తింటాడు. ఇది క్లయింట్ చూస్తే ఖచ్చితంగా ఢీల్ ఓకే చేస్తాడని అనుకుంటాడు. దీంతో ఆమె దగ్గరకు వెళ్లి ఏంటి భోజనానికి కూడా వెళ్లకుండా కష్టపడుతున్నట్లు ఉన్నావు అని అడుగుతాడు. తప్పదు కదా మీరు నాకు పరీక్ష పెట్టారు కదా అని చిన్ని అంటుంది. ఇంత తక్కువ సమయంలో ప్రజెంటేషన్ ఇవ్వాలంటే కష్టపడాల్సిందే కదా అని అంటుంది. సరేనంటూ వెళ్లబోతూ చేయి తగిలించి పెయింట్ ఆమె గీసే డ్రాయింగ్‌ మీద పడేట్లు చేస్తాడు. దీంతో అప్పటి వరకు కష్టపడి వేసిన డ్రాయింగ్‌ మొత్తం పాడైపోతుంది. అయ్యో సారీ అన్నట్లు నటించిన మ్యాడీ....చూడకుండా చేయి తగిలి పడిపోయిందని చెబుతా అనుకున్నావా అంటాడు. లేదు కావాలనే ఈ డ్రాయింగ్‌పై పెయింట్‌ పడేలా చేశానని అంటాడు. దీంతో చిన్నికి కోపం వస్తుంది. 

రోజురోజుకు నువ్వు విలన్‌ను తయారవుతున్నావని అంటుంది. నేను అవ్వడంలేదని నువ్వే నన్ను విలన్‌ను మారుస్తున్నావని అంటాడు. ఒకసారి మరకపడిన పెయింట్‌ అయినా, జీవితం అయినా ఎందుకు పనికిరావని అంటాడు. నీ జీవితంపై మరక మీ అమ్మ ఎప్పుడో వేసిందని అది నువ్వు చెరిపినా చెరిగిపోదని చెప్పి వెళ్లిపోతాడు.

క్లయింట్‌ మీటింగ్‌లో అందరూ కూర్చుని ఉంటారు. వచ్చిన వాళ్లకు విశ్వప్రసాద్‌ మ్యాడీని పరిచయం చేస్తాడు. ఇంతకీ అసిస్టెంట్ మేనేజర్‌ ఎక్కడ అని మ్యాడీ అడుగుతాడు. ఇప్పటికే రావాలి ఇంకా రాలేదని విశ్వప్రసాద్‌ అనగా....ప్రజెంటేషన్‌ ఇవ్వలేక పారిపోయిందా అని మ్యాడీ అంటాడు. అలాంటి పని చిన్ని ఎప్పటికీ చేయదంటూ తన ప్రజంటేషన్ పేపర్లు తీసుకుని వస్తుంది. తనని చూసి మ్యాడీ షాక్‌ తింటాడు. కొత్త కాన్సెప్ట్‌తో చిన్ని ప్రజెంటేషన్‌ ఇస్తుంది. 

చీర కొంగుపై తల్లి, కుమార్తెల అనుబంధంతో ఉన్న డిజైన్ ఫొటోలత్ అదరగొడుతుంది.ఈ కాన్సెప్ట్‌ క్లయింట్‌కు బాగా నచ్చి ఓకే చేస్తారు. దేశవ్యాప్తంగా  ఈ చీరలు మేమే సప్లై చేస్తామని అంటారు. మొత్తం రూ.20 కోట్లకు ఢీల్‌ ఓకే చేస్తారు. అప్పటికప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యే వరకు చిన్నిని ఈ ప్రాజెక్ట్‌పైనే ఉంచమని రిక్వెస్ట్ చేస్తారు. దీంతో మ్యాడీకి మతిపోతుంది. విశ్వప్రసాద్‌ చూశారా మ్యాడీ...చిన్ని టాలెంట్‌ గురించి నేను చెబితే మీరు నమ్మలేదు కదా...ఇప్పుడు చూడండి ఒకే సిట్టింగ్‌లో రూ.20 కోట్ల ఢీల్ ఓకే చేయించిందని అంటాడు.

తన గదిలో కూర్చుని బాధపడుతున్న మ్యాడీ దగ్గరకు వచ్చిన చిన్ని....ఈ ప్రజెంటేషన్ ఇంత బాగా సక్సెస్‌ కావడానికి మీరే కారణమని చెబుతుంది. మీరు మా అమ్మగురించి అలా మాట్లాడి ఉండకపోయి ఉంటే..నాకు అసలు ఆ ఐడియా వచ్చేదే కాదని అంటుంది.ఏదీఏమైనా నీ భార్య ఉద్యోగం పోకుండా నువ్వే సాయం చేశావంటూ మ్యాడీని మరింత ఉడికిస్తుంది. దీంతో మ్యాడీ కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. ఇంట్లో అందరూ మ్యాడీ రాకకోసం ఎదురుచూస్తుంటారు. 

తొలి మీటింగ్‌లోనే రూ.20కోట్ల ఢీల్‌ ఓకే చేయించావంట కదా అని నాగవల్లితోపాటు అందరూ మ్యాడీని మెచ్చుకుంటారు. అంటే నీ టీం అంత స్ట్రాంగ్‌గా ఉందన్నమాట అని అంటారు. అలాంటి ప్రతిభ ఉన్న ఉద్యోగులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని...అవసరమైతే ఎక్కువ జీతం ఇచ్చి మన కంపెనీలోనే పనిచేసేలా ఒప్పించమని నాగవల్లి అంటుంది. వాళ్లంతా అంత సంతోషంగా ఉన్నా మ్యాడీ మాత్రం ఢల్‌గా ఉండటంతో నాగవల్లి ఏం జరిగిందని అడుగుతుంది. 

ఆ చిన్ని మళ్లీ ఏమైన ఇబ్బందిపెట్టిందా అని అంటుంది. అయినా చిన్ని మన ఆఫీసులో ఎందుకు ఉంటుందని మాహి అంటుంది. ఇప్పటికీ చిన్ని విషయంలో వీళ్లను ఇబ్బంది పెట్టానని మళ్లీ చిన్ని ఆఫీసులో జాయిన్ అయ్యిందని వీళ్లకు చెప్పి బాధపెట్టకూడదని  మ్యాడీ అనుకుంటాడు. అలాంటిదేమీ లేదని అబద్ధం చెప్పి వెళ్లిపోతాడు. అటు చిన్ని వాళ్ల ఇంట్లో ఆనందం తాండవిస్తుంది. నా ఉద్యోగం ఫర్మినెంట్ చేయించుకున్నానని చిన్ని వాళ్ల అమ్మనాన్నలకు చెప్పి సంతోషపడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 4th:విక్కీకి తొలిముద్దు పెట్టిన రాధ...విక్కీ మనసులో చోటు కోసం భార్యగా ప్రయత్నాలు
నువ్వులేక నేను లేను: విక్కీకి తొలిముద్దు పెట్టిన రాధ...విక్కీ మనసులో చోటు కోసం భార్యగా ప్రయత్నాలు
Podarillu Serial Today August 4th:మాధవ్‌కు పెళ్లిచూపులు...ఆడపెళ్లివారి అభ్యంతరాలు ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌కు పెళ్లిచూపులు...ఆడపెళ్లివారి అభ్యంతరాలు ఏంటి..?

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Embed widget