Podharillu Serial Today January 1St: పెళ్లి తప్పించుకునేందుకు మహాకు చక్రి ఏం సలహా ఇచ్చాడు.? మాధవ్‌ను కలిసిన కవితకు ఎలాంటి అనుభవం ఎదురైంది..?
Podharillu Serial Today Episode January 1St: పెళ్లి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఇంటి నుంచి పారిపోవాల్సిందేనని మహాకు చక్రి సలహా ఇస్తాడు.అవసరమైతే మా ఇంట్లో ఆశ్రయం కల్పిస్తానని హామీ ఇస్తాడు.

Podharillu Serial Today Episode: మహా ఇంట్లో పెళ్లిపనులు చకాచకా జరిగిపోతుంటాయి. వచ్చిన బంధువులంతా మహా అదృష్టం గురించి...జరగబోయే పెళ్లి గురించి చాలాబాగా మాట్లాడుకుంటారు. అయితే మహా మాత్రం చాలా బాధపడుతుండటం చూసి చక్రి ఎలాగైనా ఈ పెళ్లి ఆపించేయాలని నిర్ణయించుకుంటాడు. మాధవ్‌ను కలిసేందుకు ఫోన్ చేసిన కవిత చెప్పిన రెస్టారెంట్‌కు వచ్చి అతన ఎదురుచూస్తుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కవిత..అతనితో మాట్లాడుతుంది. మీరు బాగా నచ్చారని చెబుతుంది. మీ పద్ధతులు, మీ వినయం, విధేయత, మంచితనం అన్నీ బాగా నచ్చాయని చెబుతుంది. బయటవాళ్లు చెప్పింది విని మా వాళ్లు తొందరపడటం తప్పేనని...కాకపోతే మీరంటే మా కుటుంబంలో అందరికీ మంచి అభిప్రాయమే ఉందని కవిత చెబుతుంది. కానీ మీరు మీ ఫ్యామిలీని వదిలిపెట్టి బయటకు వస్తే....మన పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారని చెబుతుంది. మీరు మాఇంటికి ఇల్లరికం రావాల్సిన అవసరం లేదని....మనం విడిగా ఉందమా అని అడుగుతుంది. పైగా మీ ఇల్లు కూడా బాగా పాతగా ఉందని మా వాళ్ల అభిప్రాయమని అంటుంది. మా ఫ్యామిలీ నాకు బలమని...కొన్ని కారణాలవల్లే మా ఇంటిని తిరిగి నిర్మించలేకపోతున్నామని మాధవ్ ఆమెకు సర్ధిచెబుతాడు. ఇది నాకు కొత్తమీ కాదని...చాలా పెళ్లి సంబంధాల వాళ్లు చెప్పిన మాటలే మీరుచెప్పారని దీనికి నేను ఏం ఫీల్ అవ్వడం లేదని మాధవ్ అంటాడు. నా తమ్ముళ్లను నేను బిడ్డల్లా పెంచానని...నా సుఖం కోసం వారిని వదిలి రాలేనని అంటాడు. కాబట్టి మీరు మీవాళ్లు చూసిన మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు.
రిజిస్టర్ మ్యారేజీ ఆగిపోయినట్లే....ఈ పెళ్లి కూడా ఆగిపోతుందని చక్రి మహాకు ధైర్యం చెబుతాడు. మీరు ఎంత వద్దన్నా...మీవాళ్లు మొండిగా ఎందుకు ఈ పెళ్లి చేస్తున్నారని అంటాడు. ఏం చేసైనా ఈ పెళ్లి ఆపేయాలని అంటాడు. మా నాన్న కొట్టేలా ఉన్నాడని....మా అన్న కాళ్లుచేతులు బంధించి మరీ తాళి కట్టించేలా ఉన్నారని మహా చెబుతుంది. ఇంతలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అఫ్రూవల్ చేస్తూ...సంస్థ నుంచి ఫోన్‌కాల్ వస్తుంది. మీరు హైదరాబాద్ వస్తే మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుందామని చెబుతారు. ఈమాటలు విన్న మహా ఎంతో సంతోషిస్తుంది. అలాగే అవతలి వారికి సారీ చెబుతుంది. తాను ఈప్రాజెక్ట్ కోసం పనిచేయలేనని...నాకు పెళ్లి జరగబోతోందని చెబుతుంది. ఆ మాటలు విన్న చక్రి కోప్పడతాడు. వాళ్లను కొంచెం టైం అడిగితే సరిపోయేది కదా అంటాడు. మనకు కుదరనప్పుడు అసలు వాయిదాలు అడగటం ఎందుకు అని మహా ప్రశ్నిస్తుంది.
చక్రి తమ్ముళ్లు అతనికి ఫోన్ చేసి ఏం జరిగిందని ఆరా తీస్తారు. రిజిస్ట్ర మ్యారేజీ అయితే ఆగిపోయింది కానీ పెళ్లి ముహూర్తం మాత్రం ముందుకు తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారని చెబుతాడు. ఈ పెళ్లి ఎలా ఆపాలో అర్థం కావడంలేదని అంటాడు. పెళ్లికొడుకుని కిడ్నాప్ చేస్తే రిజిస్టర్ మ్యారేజీ ఆగిపోయినట్లు...ఈసారి పెళ్లికూతురిని మాయం చేస్తే అసలు పెళ్లి ఆగిపోతుందని కన్నా సలహా ఇస్తాడు. మాధవ్ బయపడుతూ నువ్వు అక్కడ ఉండొద్దని వెంటనే వచ్చేయాలని ఆదేశిస్తాడు.
ఇంతలో మహా మళ్లీ వచ్చి చక్రితో మాట్లాడుతుంది. కాలేజీలో గోల్డ్‌మెడలిస్ట్‌ను అయినా...హైదరాబాద్‌లో సీటు వస్తేనే పంపించని మా ఫ్యామిలీ ఇప్పుడు శాశ్వతంగా కెనడాకు ఎలా పంపుతున్నారో అర్థం కావడం లేదని అంటుంది. మీనాన్న చెప్పాడు, అన్న బెదిరించాడని వాడిని పెళ్లిచేసుకుంటే...జీవితాంతం వాడికి బానిసలా బతకాల్సిందేనని అంటాడు. దేశం కానీ దేశంలో మీరు వాడితో ఇబ్బందిపడితే పుట్టింటికి రాలేరు కదా అంటాడు. ఇంత చదవులు చదివి మీ వాళ్లకు బయపడి పెళ్లి చేసుకుంటే ఎలా అని అంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దామని మహా అంటుంది. అప్పుడే కన్నా ఇచ్చిన సలహా గుర్తొచ్చి చెబుతాడు. పెళ్లికూతురు కనిపించకుండా పోతే పెళ్లి ఆగిపోతుంది కదా అని చక్రి మహాతో అంటాడు. అంటే ఇంట్లో నుంచి పారిపోవాలా అని అంటుంది. పెళ్లి సమయానికి పారిపోయి...ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చేయండని సలహా ఇస్తాడు. నాకు మా ఇల్లు తప్ప మరొకటి తెలియదని మహా చెబుతుంది. నేను కనిపించకుండాపోతే మావాళ్లు తట్టుకోలేరని అంటుంది. ఇప్పుడు మీరు వాడిని పెళ్లిచేసుకుంటే జీవితాంతం పడే బాధకన్నా ఇది తక్కువేనని ఆమెకు లేనిపోనివన్నీ నూరిపోస్తాడు. నాకు పారిపోయేంత ధైర్యం లేదని.....మావాళ్లు రౌడీలను పెట్టి వెతికిస్తారని మహా చెబుతుంది. కావాలంటే మా ఇంటికి తీసుకెళ్తానని చక్రి అంటాడు. వెళ్లిపోయి నేను ఏంసాధిస్తానని మహా అనగా...హైదరాబాద్ వెళ్లిపోయి ఆ ప్రాజెక్ట్ పనులు చేసుకోవచ్చు కదా అని చక్రి అంటాడు.





















