Nindu Manasulu Serial Today October 14th: నిండు మనసులు: విశ్వనాథ్, రంజిత్ మధ్య ఏం జరిగింది? మంజుల ఎంట్రీతో ఊహించని మలుపు!
Nindu Manasulu Serial Today Episode October 14th ప్రేరణ మంజులను కేఫ్ ఓపెనింగ్‌ని పిలవడం, రంజిత్ విశ్వనాథ్ కేఫ్ దగ్గర ఎదురు పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ సిద్ధూ తల్లి మంజుల దగ్గరకు వెళ్తుంది. సిద్ధూ బాధ పడుతున్నాడని కాఫీ షాప్ ఓపెనింగ్‌కి రావాలని కోరుతుంది. ఎప్పుడూ పిల్లల్ని కన్నవాళ్లే అర్థం చేసుకోవాలా.. తల్లి మనసుని పిల్లలు అర్థం చేసుకోరా.. బంగ్లాలో బతకమన్నాను.. వీధిలోకి వెళ్తా అన్నాడు.. ద్వేషాన్ని వదిలేయమన్నాను.. ఇంటినే వదిలేశాడు.. నేను చెప్పింది వాడు వినలేదు.. అలాంటప్పుడు వాడి బాధని నేను ఎందుకు భరించాలి అని మంజుల ప్రేరణని ప్రశ్నిస్తుంది. 
ప్రేరణ మంజులతో మీరు అమ్మ కాబట్టి భరించాలి అని అంటుంది. ఈ ప్రపంచంలో ఎవరికీ దేనికీ లేని విలువ అమ్మ అన్న పదానికి ఉంది కాబట్టి.. భరించడం అని మాటకు అర్థం తెలీకుండా పిల్లల్ని జీవితాంతం భరించే ఏకైక వ్యక్తే మేడం అమ్మ. అంతటి స్థానంలో ఉన్న మీరు ఆ మాట గుండెల్లో నుంచి అన్నారు అని నేను అనుకోవడం లేదు.. అమ్మకి అహానికి భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది.. కాబట్టి మీరు సిద్ధూకి ఈగోకి వెళ్లే అవకాశం లేదు. మీ కోసం సిద్ధూ మీద కాదు సిద్ధూ ఆలోచన మీద.. మేడం కాలంతోపాటు ఆలోచనలు మారుతాయి కానీ అమ్మ ప్రేమ కాదు. మీ ప్రేమ మారదు అని నాకు తెలుసు.. ఆ నమ్మకమే మీకు ఉంటే మీరు కాఫీ షాప్ ఓపెనింగ్‌కి వస్తారు. సిద్ధూ ఏదో సాధిస్తాడు అన్న నమ్మకం అమ్మలా మీకు మాత్రమే ఉంటుంది.. ఆ నమ్మకం సిద్ధూ గుర్తిస్తాడు అని రండి అని చెప్తుంది. 
సాహితి అమ్మతో వెళ్దామమ్మా అన్నయ్య బాధ పడుతూ ఉంటాడు అని అంటుంది. విజయానంద్ ప్రేరణ మాటలకు షాక్ అయిపోతాడు. మంజుల దగ్గరకు వెళ్లి నువ్వు వెళ్లాలి మంజు కానీ సిద్ధూ తండ్రి ఎందుకు రాలేదు అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తావా అని బాధగా ఉంది నువ్వు వెళ్లు మంజు నా అదృష్టం ఇంతే అని అనుకుంటా అని రెండు కన్నీటి చుక్కలు కార్చి మంజుల ఆలోచించేలా చేస్తాడు. విశ్వాసం విజయానంద్ దగ్గరకు వెళ్లి మీరు వెళ్లమనడం ఏంటి సార్ అని అంటే నేను వెళ్లమని చెప్పినట్లే అక్కడికి వెళ్తే జరిగే ఫలితాలు ఏంటో చెప్పానని మంజుల వెళ్లదు అని చెప్తాడు. విశ్వాసంతో కాఫీ షాప్ దగ్గరకు వెళ్లి సిద్ధూ అమ్మరాలేదు అని పడుతున్న బాధని తనకు వీడియో కాల్ చేసి చూపించమని అంటాడు.
రంజిత్ ఐశ్వర్యని స్కూటీ మీద తీసుకెళ్తాడు. ఐశ్యర్యని పనిష్మెంట్‌గా రివర్స్‌లో కూర్చొపెట్టి రంజిత్ తీసుకెళ్తాడు. పనిష్మెంట్ ఎందుకు అని ఐశ్వర్య అడిగితే ఉప్మాలో ఉప్పు తక్కువ వేసినందుకు, పిలవకుండా ఓపెనింగ్‌కి పిలిచినందుకు అని అంటాడు. ఇక ఇద్దరూ కాఫీ షాప్ దగ్గరకు వెళ్తారు. ఐశ్వర్య చూసి వావ్ అని అనుకుంటుంది. రంజిత్ మాత్రం ఆ ఇంటిని చూసి అలా ఉండిపోతాడు. ఐశ్వర్య లోపలికి రమ్మని చెప్తే ఇక్కడికి తీసుకొచ్చావ్ ఏంటి అని రంజిత్ అడిగితే ఇక్కడే కదా కేఫ్ ఓపినింగ్ అని అంటుంది. ఈ బిల్డింగ్ అని రంజిత్ అడిగితే విశ్వనాథ్ గారిది.. అదే ఆ రోజు నువ్వు గొడవ పడ్డావు కదా ఆయనే.. కేఫ్ పెట్టుకోమని ఆయన ఈ ప్లేస్ ఇచ్చారని అంటుంది.
రంజిత్ ఇబ్బంది పడుతూనే లోపలికి వస్తుంటే విశ్వనాథ్ రంజిత్‌ని చూసి ఇక్కడికి నువ్వు ఎవరు రమ్మన్నారు.. ఈ కాంపౌండ్‌లో కూడా నీ నీడ పడకూడదు అని అంటాడు. దానికి రంజిత్ నేను అనుకోకుండా వచ్చాను అంటే నీ జీవితంలో ఏదీ అనుకోకుండా జరగదు.. ప్రతీది నీ ఇష్టం ప్రకారమే చేశావ్ అని విశ్వనాథ్ అంటారు. రంజిత్ మాట్లాడుతుంటే విశ్వనాథ్ మాట్లాడొద్దు అని వెళ్లిపోమని అంటాడు. ఇంతలో సిద్ధూ వచ్చి రంజిత్ సార్ అంటూ రంజిత్‌ని పలకరిస్తాడు. ఇందిర కూడా వస్తుంది. ఇందిర విశ్వనాథ్‌తో రంజిత్ తమ ఇంటి ఓనర్ అని చెప్తుంది. ఇంతలో ప్రేరణ వాళ్లు కూడా వస్తారు. మీరు ఇతగాడి ఇంట్లో అద్దెకు ఉంటున్నారా అని విశ్వనాథ్ ఆశ్చర్యంగా అడుగుతాడు.
సిద్ధూ, ప్రేరణ ఇద్దరూ రంజిత్‌కి విశ్వనాథ్ గారి గురించి కోచింగ్ ఇస్తారని.. ప్లేస్ కూడా ఇచ్చారు.. లోన్ ఇప్పించారని అంటారు. ఇక పూజకి పిలవడంతో ప్రేరణ వాళ్లు వెళ్తారు. రంజిత్‌తో విశ్వనాథ్ నువ్వు ఉన్న చోట నేను ఉండను వెళ్లిపోతా అంటే వద్దు నేను వెళ్లిపోతా అని రంజిత్ వెళ్లిపోతాడు. ఐశ్వర్ అది చూసి ఏంటో అని అనుకుంటుంది. ఇక పోలీస్‌స్టేషన్‌లో గణ సిద్ధూ కొట్టిన చెంప దెబ్బ ఫొటో చూస్తూ ఉంటాడు. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి గణకు ఓ ఇంటి ప్లాన్ ఇస్తాడు. సుధాకర్ అది చూసి ఏదైనా ఇల్లు కొంటారా సార్ అంటే నాకు లంకంత ఇళ్లు ఉంది నాకు ఎందుకు ప్రేరణ, సిద్ధూలు ఏదో కేఫ్ పెడుతున్నారు కదా.. ఆ కేఫ్‌కి సంబంధించి మ్యాప్ ఇది అని అంటాడు. ఆ కేఫ్‌ని ఏమైనా చేస్తున్నారా సార్ షాప్ క్లోజ్ చేయిస్తారా అని సుధా అడుగుతాడు. ఇప్పుడే కదా వాళ్లు బిజినెస్ చేస్తున్నారు.. నేను ఎందుకు అలా చేస్తాను.. నువ్వు వెళ్లి కేఫ్ ఓపెనింగ్ ఎలా జరుగుతుందో నాకు చెప్పు అని అంటాడు. కేఫ్ ఓపెనింగ్ మొదలవుతుంది. మొదటి కొబ్బరి కాయ విశ్వనాథ్‌తో కొట్టిస్తారు. తర్వాత ఇందిర కొడుతుంది. పంతులు సిద్ధూతో మీ తరుఫున ఎవరైనా ఉంటే పిలవండి అని అంటారు. దానికి సిద్ధూ బాధగా ప్రస్తుతానికి ఎవరూ లేరు పంతులు గారు అంటాడు. అప్పుడే మంజుల, సాహితి ఎంట్రీ ఇచ్చి నేను ఉన్నా పంతులు గారు అని మంజు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















