Nuvvunte Naa Jathaga Serial Today October 14th: నువ్వుంటే నా జతగా: మిథున-దేవా రొమాన్స్! కాంతం కుళ్లు, శారద షాక్! అసలు ట్విస్ట్ ఏంటంటే?
Nuvvunte Naa Jathaga Serial Today Episode October 14th మిథున కాలు బెనకడం దేవా మిథునని ఎత్తుకొని తీసుకెళ్లడం ఆ సీన్ ఇంట్లో వాళ్లు చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున, దేవా కొవొత్తి పట్టుకొని దొంగ కోసం వెతుకుతారు. ఇక మిథున దేవాని చూసి నీ పని చెప్తా ఆగు అని కర్ర తీసుకొని దేవాని కొడుతుంది. ఏయ్ ఏయ్ కొట్టకే నేను దేవా అని అంటాడు. తర్వాత దేవా మిథునని ఆపి నేను అని తెలిసే కొట్టావ్ కదా అని అంటాడు. తెలిసిపోయిందా అని మిథున అంటుంది. 
ఇక ఇద్దరూ దొంగని పట్టుకుంటారు. దొంగ దేవన్నా ఇది మన ఇల్లేనా అని అంటాడు. ఛీ ఛీ దొంగల్లో కూడా నీకు ఫ్రెండ్స్ ఉన్నారా అని మిథున అంటుంది. దానికి దేవా నాకు వీడు తెలీదు.. అని అంటాడు. అన్న నేను నీ దగ్గరకు వచ్చాను అన్న.. అప్పట్లో నాకు లవ్‌గురు పేరుతో పెద్ద బిజినెస్ ఉండేది.. నేను దొంగని కాదు అన్న లవర్ వదిలేస్తా అని అంటే దొంగతనానికి వచ్చిందని అంటాడు. నిన్ను చూస్తే నాకు జాలేస్తుందిరా అని దేవా అంటే నాకు నిన్ను చూస్తే జాలేస్తుందన్న ఇందాక నిన్ను వదిన కొట్టడం చూసేశా.. రోజూ నీకు వదిన ఏ రేంజ్‌లో చుక్కలు చూపిస్తుందో అర్థమైపోతుందని అంటాడు. నా బాధ బయటకు చెప్పుకోలేను కానీ తాళం వేసిన ఇంట్లోకి ఎలా వచ్చావో చెప్పరా ఇద్దరం అలాగే వెళ్లిపోదాం అని దేవా అంటాడు. నేను ఎలా వచ్చానో తెలియాలి అంటే నేను ఎలా వెళ్లిపోయానో తెలియాలి అని దొంగ ఒక్క జంప్‌లో పారిపోతాడు. దొంగ ఎక్కడా అని దేవా అనుకుంటూ నిన్ను కొట్టకుండా వదిలేసినందుకు నాకు హ్యాండ్ ఇస్తావా అనుకుంటాడు. 
ఉదయం మిథున దేవాతో బాగా నిద్ర పట్టిందా మాష్టారూ అంటుంది. ఓ వైపు దొంగ ఇంకోవైపు ఈ దెయ్యం ఇంక నిద్ర ఎలా పడుతుంది. దోమలు అయినా అప్పుడప్పుడు చెవి దగ్గర మ్యూజిక్ వాయిస్తాయి కానీ కొందరు నోరు గట్టు తెగిన గోదారే ఇంకెక్కడ నిద్ర పడుతుంది అని అంటాడు. ఇక మిథున గిన్నెలు తోముతూ దేవా మీద లైట్ వేస్తుంది. నీకు ఏమైనా తిక్కా అని దేవా తిడతాడు. మిథున కావాలనే దేవా మీద నీరు చల్లుతుంది. దాంతో దేవా నా మీదే నీరు వేస్తావా అని మిథున వెనక పడతాడు. మిథున పరుగెత్తడంతో కాలు బెనుకుతుంది. 
మరోవైపు సత్యమూర్తి వాళ్లు ఇంటికి వస్తుంటారు. ఇంట్లో దేవా మిథున ఎలా ఉంటారో.. దేవా మిథున చేసిన వంట తింటున్నాడో లేదో దేవా తినకపోతే మిథున కూడా తినదు అని శారద అంటుంది. ఇద్దరూ చక్కగా ఉన్నారో గొడవ పడతారో ఏంటో అని అనుకుంటుంది. సత్యమూర్తి భార్యతో అలా ఏం కాదులే దేవా ఇంటి భోజనం తప్ప బయట తినడు.. మిథునతో గొడవ పడితే మిథున వంట చేయదు కాబట్టి బుద్ధిగానే ఉంటాడులే అని అంటాడు. ఇక కాంతం అయితే మిథున తనతో ఛాలెంజ్ చేసినట్లు దేవాని కొంగుకి కట్టేసుకుంటుందా.. ఇద్దరూ ఒక్కటైపోయింటారా అని కడుపు మంటతో చచ్చిపోతుంటుంది.
మిథున కాలు నొప్పితో అరుస్తుంటుంది. భార్య బాధపడుతుంటే నా భర్త పట్టించుకోవడం లేదు అని అంటుంది. హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. ఇక్కడే నేనే ఉన్నాను కదా ఎందుకు అలా అరుస్తావ్ నువ్వు అలా అరిస్తే వినేవాళ్లు నేను నిన్ను ఏదో చేస్తున్నా అని మరోలా అనుకుంటారు ఊరుకో అని అంటాడు. మన ముఖానికి అది ఒక్కటే తక్కువ అని మిథున అంటుంది. దేవా తీసుకెళ్తాలే అంటే ముట్టుకోకుండా తీసుకెళ్లు అని మిథున అంటుంది. దేవా మిథునని ఎత్తుకొని ఎక్కడికి తీసుకెళ్లాలి అంటాడు. పైన మన గదిలోకి తీసుకెళ్లు అని మిథున అంటుంది. మిథునని దేవా ఎత్తుకొని తీసుకెళ్తుంటాడు. 
మిథునని దేవా ఎత్తుకొని తీసుకెళ్తుంటే శారద వాళ్లు ఇంటికి వస్తారు. కాంతం తాళం తీసి ఇంట్లో చూసే సరికి మిథునని దేవా ఎత్తుకొని తీసుకెళ్లడం చూసి అందరూ షాక్ అయిపోతారు. కాంతం అయితే కుళ్లుకుంటుంది. అందరూ చూస్తున్నారు ఏదైనా ఊహించుకుంటారు దిగు అని దేవా మిథునతో అంటే వద్దు వద్దు నేను ఈ నొప్పి భరించలేను అని మిథున అంటుంది. దేవా అమ్మతో అమ్మా తన కాలు బెనికింది.. కాలు నొప్పితో బాధ పడుతుంటే సాయం చేస్తున్నా అంటాడు. కబుర్లు బాగా చెప్తున్నావ్‌రా అని శారద, సత్యమూర్తి వెళ్లిపోతారు. ఇలా ఇరికించేశావ్ ఏంటే అని మిథునని దేవా అంటాడు. 
ఆనంద్ అన్నతో మేం వచ్చి డిస్ట్రబ్ చేశామా.. అని అంటాడు. రంగం దేవాతో చిన్నోడా నువ్వు సకలకలా వల్లభవుడువురా.. మేం ఎవరైనా డిస్ట్రబ్ చేస్తామని బయట నుంచి గడియ పెట్టడం సూపర్‌రా అని అంటాడు. కాంతం కూడా దేవాతో మేం ఉన్నప్పుడు పోట్లాడుకోవడం లేనప్పుడు ఇలా రొమాంటిక్ సాంగ్సా అని అంటుంది. వదిన నువ్వు అయినా నమ్ము అని దేవా అంటే నమ్మానులే అని ప్రమోదిని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
ట్రెండింగ్ వార్తలు






















