Nindu Manasulu Serial Today December 18th:నిండు మనసులు: వర్ష పెళ్లిలో ఊహించని ట్విస్ట్! గణ నిజస్వరూపం బయటపడిందా? నట్టింట్లో రచ్చ!
Nindu Manasulu Serial Today Episode December 18th వర్షని పెళ్లి పేరుతో గణ నమ్మించి కిడ్నాప్ చేయించడం ప్రేరణ వాళ్లకి ఆ విషయం తెలిసి గణని నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode గణ వర్షకి కాల్ చేసి ప్రేరణ మాటలు వినొద్దు నీ గురించి ప్రేరణ నాకు లేనిపోనివి చెప్పింది.. నేనేం నమ్మలేదు.. నా వర్ష బంగారం అని చెప్పాను.. నేను తన మాట వినలేదు అని నిన్ను రెచ్చగొట్టాలి అనుకుంటుంది. కాసేపట్లో నేను తాళి పట్టుకొని గుడిలో ఉంటాను.. త్వరగా గుడికి వచ్చేయ్.. ఒక్కదానివే రావొద్దు నా మనుషుల్ని పంపిస్తా వాళ్లతో వచ్చేయ్.. మన పెళ్లి అయ్యే వరకు నువ్వు ఎవరికీ ఏం చెప్పొద్దు అని అంటాడు.
ప్రేరణ, సిద్ధూ మాట్లాడుకుంటారు. వర్షతో ఎంత మాట్లాడినా గణకి తనకు మధ్య ఉన్న సంబంధం చెప్పడం లేదని కేవలం ఫ్రెండ్‌షిప్‌నే ఉందని అంటుందని.. ఉన్న ఒక్క ఆధారం ఎక్కడ పోతుందో అని భయంగా ఉందని ప్రేరణ అంటుంది. నాకు నీ గురించి భయంగా ఉందని సిద్ధూ అంటాడు. నా గురించి ఎందుకు అని ప్రేరణ అంటే అందరినీ నువ్వు నీ వాళ్లు అనుకుంటావ్,, ఇప్పుడు నా చెల్లి సమస్యని నీ సమస్య అనుకుంటున్నావ్,, ఈ క్రమంలో నీకు ఏమైనా అయితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను ప్రేరణ. అసలే మా అమ్మతో మాటలు పడ్డావ్,, గణ అవమానించినా ఊరుకున్నావ్.. సాహితి విషయంలో నువ్వే ఎక్కువ బాధ్యత తీసుకుంటున్నావ్.. నువ్వు నా పక్కన ఉంటే నేను కోల్పోయిన సంతోషం తిరిగి వస్తుందని అనుకుంటున్నా నాకు నువ్వు దూరం అయితే నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని ఎమోషనల్ అవుతాడు.
ప్రేరణ సిద్ధూతో నాకు ఏం కాదు నువ్వు ఎమోషనల్ అవ్వొద్దు అని అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్లినా నాకు చెప్పు అని అంటాడు. వర్షతో వెళ్లి మాట్లాడుదామని అనుకుంటారు. వర్ష తనకు గణతో పెళ్లి అవుతుందని రెడీ అవుతుంది. తన ఫ్రెండ్ స్వాతిని కూడా పెళ్లికి తీసుకెళ్లదు.. గణ వద్దన్నాడుఅని చెప్తుంది. ఇక ప్రేరణ ఫోన్ నెంబరు తీసి ఇది ఉండాలే నేను గణ ఎంత సంతోషంగా ఉన్నామో తనకు తెలియాలి గణతో తనకు సారీ చెప్పించాలి అని పర్సులో ప్రేరణ నెంబరు పెట్టుకుంటుంది.
గణ మనుషులు వచ్చి సార్ వెయిట్ చేస్తున్నారు అని వర్షని ఎక్కించుకొని వెళ్తారు. వర్ష వెళ్లగానే ప్రేరణ, సిద్ధూ అక్కడికి వస్తారు. ప్రేరణ, గణలు స్వాతితో వర్ష గురించి అడుగుతారు. వర్షని ఇబ్బంది పెట్టకండి.. తన పెళ్లి జరుగుతుంది తనని వదిలేయండి.. వాళ్లని ఇబ్బంది పెట్టొద్దు అని అంటుంది. గణ గురించి మీకు ఏం తెలుసు.. ఫ్రెండ్ అంటే తను బాగుపడటానికి ఏమైనా చేయాలి.. గణ విషయంలో వర్ష ఎంత ప్రమాదంలో ఉందో నీకు ఏం తెలుసు.. ఒక వైపు ఆ ఆమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.. అవన్నీ తెలుసుకోకుండా ఎలా పెళ్లికి రెడీ అయిపోయింది. మర్యాదగా చెప్పు పెళ్లి ఎక్కడ అని అడుగుతుంది.
స్వాతి ఎంత చెప్పినా వినదు.. దాంతో వర్షకి కాల్ చేసి తన పరిస్థితి తెలుసుకో అని ప్రేరణ అంటుంది. స్వాతి వెంటనే వర్షకి కాల్ చేస్తుంది. వర్షకి గణ కాల్ చేసి నీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా త్వరగా వచ్చేయ్ అంటాడు. తర్వాత రౌడీలతో మాట్లాడి తనకు అనుమానం రాకుండా ఎక్కడో దాచేయండి.. ఎవరికీ తెలీకూడదు.. తన ఫోన్ కూడా ఆపేయండి.. నా పెళ్లి అయిన వరకు వదలొద్దు అని అంటాడు. రౌడీలు గణ చెప్పినట్లు చేస్తారు. పాపం వర్ష నన్ను గుడ్డిగా నమ్మేస్తుంది అని గణ అనుకుంటాడు.
స్వాతి వర్షకి కాల్ చేస్తే ఫోన్ స్విఛ్ ఆఫ్ వస్తుంది. పెళ్లి ఎక్కడ జరుగుతుందో చెప్పడం లేదు అంటే నీకు అర్థం కావడం లేదా.. అని స్వాతిని ప్రేరణ తిడుతుంది. గణని నిలదీస్తే విషయం తెలుస్తుందని సిద్ధూ, ప్రేరణ వెళ్తారు. విజయానంద్ ఇంట్లో పెళ్లి హడావుడి మొదలవుతుంది. పెళ్లి ఆపలేకపోతున్నా,, నా కాళ్ల కింద ఉండాల్సిన వాడి కాళ్లు కడగాల్సి వస్తుందని విజయానంద్ తిట్టుకుంటాడు. ఇంతలో గణ వాళ్లు వస్తారు. విజయానంద్‌ని చూసి ఏంటి మామయ్య ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నట్లు ఉన్నారు అంటే ఏంటి గణ అలా అంటావ్ నిన్ను సెలక్ట్ చేసింది నేనే కదా అంటాడు. గణ మంచోడని మంజుల గణని పొడుగుతుంది. నీ లాంటి మంచి వాడు నా కూతురికి భర్తగా రావడం అదృష్టం అని అంటుంది.
సిద్ధూ ఆవేశంగా రావడం చూసి నేను అనుకున్నట్లే ఇద్దరూ వస్తున్నారు అని ప్రేరణ, సిద్ధూని చూసి బావగారు తన పార్టనర్ లేకుండా ఏం పని చేయరన్నమాట అంటాడు. సిద్ధూ ఆవేశంగా వచ్చి గణ కాలర్ పట్టుకొని వర్ష ఎక్కడ తనని ఎక్కడ దాచావ్ అంటాడు. విజయానంద్ మనసులో ఈ పెళ్లి ఆగిపోవడం ఖాయం అయితే అని అనుకుంటాడు. మంజు గణ కాలర్ వదలమని అంటుంది. వీడిని ఇప్పుడు వదిలితే మన సాహితి జీవితం నాశనం అయిపోతుందని సిద్ధూ అంటాడు. నేనేం తప్పు చేశాను బావగారు అని అంటాడు. ప్రేరణని అడిగితే తప్పు చేసింది నువ్వే మళ్లీ అది కప్పిపుచ్చుకోవాలని అనుకున్నది నువ్వే వర్షని ఏం చేశావ్ చెప్పు అని అడుగుతుంది. నీకు వర్షకి ఏదో సంబంధం ఉంది.. అది బయట పెట్టాలని మేం చూస్తున్నాం అని వర్షని దాచేశావ్ అంటాడు సిద్ధూ. నా ఫ్రెండ్‌ని నన్ను అంత మాట అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది అని గణ అడుగుతాడు. నీ గురించి అంతా తెలుసుకొని వచ్చాంరా.. మర్యాదగా నువ్వు నిజం చెప్తావా.. మేం నిజం చెప్పించాలా అని అడుగుతాడు. వర్ష వీడు ప్రేమించుకున్నారు.. మీ అందరికీ స్నేహం అని చెప్పాడు అని సిద్ధూ చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















