Chinni Serial Today December 18th: చిన్ని సీరియల్: అమెరికా పారిపోతున్నా మ్యాడీని మధు అడ్డుకుందా! మ్యాడీ ఇంట్లో పరిస్థితేంటి?
Chinni Serial Today Episode December 18th మ్యాడీ అమెరికా వెళ్లిపోతున్నాడని ప్రమీల మధుకి చెప్పడం మధు వెళ్లి మ్యాడీని ఆపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ ఇంట్లో ఎవరికీ తెలీకుండా అమెరికా వెళ్లిపోవడానికి రెడీ అవుతాడు. ప్రమీల మ్యాడీని ఆపలేక ఎవరికి చెప్పాలి.. మధు మాట అయితేనే వింటాడు. ముందు మధుకి చెప్పి తర్వాత నాగవల్లికి చెప్తా అని మధుకి కాల్ చేస్తుంది. ఎవరికీ చెప్పకుండా మ్యాడీ అమెరికా వెళ్లిపోతున్నాడని.. నువ్వే వాడి మనసు మార్చి తీసుకురావాలి.. లేదంటే వాళ్ల అమ్మానాన్న చాలా బాధ పడతారు అని అంటుంది.
మధు నేను తీసుకొస్తా అని అంటుంది. తల్లిదండ్రులకు విషయం చెప్పి మ్యాడీ కోసం పరుగులు పెడుతుంది. మ్యాడీ క్యాబ్‌లో నా నిర్ణయం కరెక్టే ఇక్కడే ఉంటే త్వరలోనే నాకు శ్రేయకి పెళ్లి పిక్స్ చేసేస్తారు. నేను ఆ పెళ్లికి మెంటల్‌గా రెడీ అయిన తర్వాత ఇండియా వస్తా అనుకుంటాడు. ఇక మధుకి కూడా విమానం ఎక్కిన తర్వాత చెప్తా అనుకుంటాడు. మధు చాలా బాధ పడుతుందని అనుకుంటాడు. మ్యాడీ వెళ్తున్న క్యాబ్‌కి ఎదురుగా మధు వస్తుంది. మ్యాడీ చూసి షాక్ అయిపోతాడు. నీతో కొంచెం మాట్లాడాలి పద అని మధు మ్యాడీని తీసుకెళ్తుంది.
ఇద్దరూ ఓ చోట కూర్చొంటారు. ఇప్పుడు చెప్పు బాబు ఎక్కడికి బయల్దేరావ్ అని అడుగుతుంది. అమెరికా అని మ్యాడీ చెప్పగానే కంగ్రాట్స్ అని మధు అంటుంది. మ్యాడీ వింతగా చూస్తాడు. అమెరికా వెళ్లిపోతున్నావ్ కదా నేనే నీకు పార్టీ ఇస్తా అని టీ తీసుకొచ్చి ఇస్తుంది. నువ్వు అమెరికా వెళ్తావ్ కదా.. అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు పంపిస్తావా.. నా ఫ్రెండ్ ఎంత మంచోడో తెలుసా.. చిన్నప్పటి నుంచి చిన్ని ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాడు.. చిన్నిని పెళ్లి చేసుకోవడానికి తన పేరెంట్స్‌ని కూడా ఒప్పించాడు. ఇవాళ రేపు దొరుకుతుంది అనే టైంకి చిన్ని మీద కోపంతో అమెరికా వెళ్లిపోయాడు.. నీకు అమెరికాలో తను కనిపిస్తే పంపిస్తావా అని అంటుంది. నీకు చెప్పకుండా వెళ్తున్నందుకే కదా ఇలా సెటైర్లు వేస్తున్నావ్ అని మ్యాడీ అంటాడు.
మధు మ్యాడీతో నాతో కాదు అమ్మానాన్నలకు చెప్పకుండా.. నా ఫ్రెండ్ పరిస్థితులకు భయపడి వెళ్లడం బాధగా ఉంది.. మీ అమ్మానాన్న, మీ పెద్దమ్మా, అత్త, వరుణ్, నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న శ్రేయ ఎంత బాధ పడుతుంది అని అంటుంది. నాకు అమ్మానాన్న ఎంతో నువ్వు అంతే మధు.. కానీ ఇప్పుడు నేను ఆ పెళ్లి మెంటల్‌గా ప్రిపేర్ కాలేదు.. అందుకే వెళ్తున్నా అని అంటాడు. ఈ విషయం మీ అమ్మా వాళ్లకి చెప్తే బెటర్ కదా దానికి పారిపోవడం తప్పు అని అంటుంది. చిన్ని మీద ఇష్టం పోయే వరకు మరో అమ్మాయి మీద ప్రేమ పుట్టదులే అని అంటుంది. చిన్ని గురించి వద్దు అని మ్యాడీ అంటాడు.
సరే ఇంట్లో వాళ్లకి చెప్పలేవు కదా.. ఈ విషయం శ్రేయకి చెప్పు.. శ్రేయ నిన్ను అర్థం చేసుకుంటుంది. ఇంట్లో వాళ్లని ఒప్పిస్తుంది. ఇంత సింపుల్ సొల్యూషన్ ఉంటే అమెరికా పారిపోవడం ఎందుకు అని అంటుంది. మంచి ఆలోచన అని మ్యాడీ అమెరికా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి మధుని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అంటాడు. ఇంటి దగ్గర విషయం తెలిసి శ్రేయ ఏడుస్తుంటుంది. నాగవల్లి వాళ్లు శ్రేయకి ధైర్యం చెప్తారు. ఇంతలో దేవా ఇంటికి వస్తాడు. అందరినీ చూసి ఏమైందని అడుగుతాడు. మ్యాడీ అమెరికా వెళ్లిపోయాడు అని లోహిత చెప్తుంది. దేవా షాక్ అయిపోతాడు. అమెరికా వెళ్లడం ఏంటి అని అరుస్తాడు.
మ్యాడీకి కాల్ చేస్తా అని అంటే ఫోన్ స్విఛ్ ఆఫ్ ఉందని లోహిత చెప్తుంది. బావ ఇంక నన్ను పెళ్లి చేసుకోడు నా బతుకు ఇంతే ఇంక అని శ్రేయ ఏడుస్తుంది. ఇంతలో మధు మ్యాడీని తీసుకొని ఇంటికి వస్తుంది. మ్యాడీ వచ్చి సారీ డాడీ.. ప్రస్తుత పరిస్థితిలో ఇక్కడ ఉండలేను అని అమెరికా వెళ్లిపోవాలి అనుకున్నా.. కానీ నేను చేసిన తప్పు ఏంటో మధు నాకు తెలిసి వచ్చేలా చెప్పి వెనక్కి తీసుకొచ్చింది.. ఇంకెప్పుడూ ఇలా జరగదు అంటాడు. ఇంకోసారి ఇలా జరిగితే ఏం జరుగుతుందో తెలుసా.. నువ్వు అంటే నా ప్రాణం నువ్వు ఈ ఇంటి నుంచి దూరం వెళ్తే నా ప్రాణాలు దూరంగా వెళ్తాయి అని అంటాడు. మధుతో రోజు రోజుకి నీకు మేం ఎక్కువ రుణపడిపోతున్నాం అమ్మా అంటాడు. త్వరలోనే వడ్డీతో సహా మధు రుణం తీర్చుకుందామని నాగవల్లి అంటుంది. మధుతో మాట్లాడటానికి నాగవల్లి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















