అన్వేషించండి

Jagadhatri Serial Today December17th: మీనన్‌ వద్ద నుంచి ఇంటికి వచ్చిన నిషిక ఏం చెప్పింది..? శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించేయడానికి వైజయంతి వేసిన ప్లాన్ ఏంటి..?

Jagadhatri Serial Today Episode December 17th: మీనన్‌ వద్ద నుంచి ఇంటికి వచ్చిన నిషిక ఫ్రెండ్స్‌ వద్దకు వెళ్లి వస్తున్నానని అబద్ధం చెబుతుంది. కానీ ఆమెమాటలు ధాత్రి, కేదార్ నమ్మరు.

Jagadhatri Serial Today Episode: జగధాత్రితోపాటు యువరాజు,కౌషికి అందరూ నిషిక కోసం కంగారుపడుతుండగా...రాత్రికి నిషి ఇంటికి వస్తుంది. నీకోసం ఇంట్లో అందరూ కంగారుపడుతుంటే నువ్వు కనీసం ఫోన్ కూడా చేయవా అని నిలదీస్తారు. ఇప్పుడు ఎందుకు అందరూ ఓవర్ రియాక్ట్‌ అవుతున్నారని నిషి అంటుంది. నువ్వు కనిపించకుండాపోయే సరికి అందరూ  ఎంత కంగారుపుడుతున్నారో తెలుసా అని జగధాత్రి అంటుంది. దీనికి నిషి ఇంకా నయం నన్ను మీనన్ కిడ్నాప్ చేశాడని అనుకున్నారా ఏంటి అని అంటుంది. ఫారన్ నుంచి నా ప్రెండ్స్‌ వచ్చి నాకు సర్‌ఫ్రైజ్‌ ఇచ్చారని...వాళ్లను కలిసి వచ్చేసరికి నాకు కొంచెం లేటు అయ్యిందని దీనికే మీరంతా ఎందుకు హడావుడి చేస్తున్నారని అని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతుంది.

   ఫారన్ ప్రెండ్స్ ఎవరని యువరాజు నిషికను నిలదీస్తాడు. వాళ్లు నీకు తెలియదులే అంటూ నిషి దాటవేసి స్నానం చేయడానికి వెళ్లిపోతుంది. కచ్చితంగా  నిషి ఏదో దాచిపెడుతోందని యువరాజు అనుమానిస్తాడు. అందరికీ అబద్ధం చెబుతుందని అనుకుంటాడు. నాకు తెలియకుండా ఏదో దాస్తోందని అనుమానిస్తాడు.

   నిషిక ఖచ్చితంగా అబద్ధం చెప్పిందని అనిపిస్తోందని ధాత్రి కేదార్‌తో అంటుంది. ఆమె నిజం దాస్తోందని అంటుంది. నిజంగానే మీనన్‌ నిషికను కిడ్నాప్ చేసి ఉంటాడని భావిస్తుంది. మీనన్‌ కిడ్నాప్‌ చేస్తే వాడికోసం నిషి  ఎందుకు అబద్ధం చెబుతుందని కేదార్ అంటాడు. మీనన్‌ నుంచి ఎలా తప్పించుకుని రాగలుగుతుందని అంటాడు. నా అనుమానం కూడా అదేనంటుంది ధాత్రి...అసలు మీనన్‌ నిషికను ఎందుకు వదిలేశాడని ఆలోచిస్తుంది. నిషిని వాళ్ల ప్రెండ్స్ మాత్రం తీసుకెళ్లలేదని...మీనన్‌ అయ్యి ఉండొచ్చని అంటుంది. ఒకవేళ అదే నిజమే అయితే ఖచ్చితంగా  నిషిక మీనన్‌కు పనిచేస్తానని చెప్పి ఉండాలని... అదే నిజమైతే నేనే నిషికను పోలీసులకు పట్టిస్తానని కేదార్‌తో చెబుతుంది. వాళ్ల మాటలను మేడపై నుంచి వింటున్న నిషికలో భయం పట్టుకుంటుంది. మీనన్‌ను కలిసి వచ్చినప్పటి నుంచి నిషిక కంగారుపడటాన్ని గమనిస్తున్న యువరాజు కూడా ఆమె గురించి తీవ్రంగా  ఆలోచిస్తుంటాడు. అయినా నాన్న ప్రాణాపాయస్థితిలోఉంటే ప్రెండ్స్‌తో పార్టీకి వెళ్లడం ఖచ్చితంగా అబద్ధమే అనుకుంటాడు. జగధాత్రి వాళ్లు చెప్పినట్లు నిషిని ఎవరో కిడ్నాప్ చేశారని అనుకుంటాడు. మరి ఎందుకు నిషి అబద్ధం చెబుతోందని ఆలోచిస్తాడు. ఎవరిని కాపాడటానికి ఆమె ఈ పనిచేస్తోందని ఆలోచిస్తాడు. నా అనుమానమే నిజం అయితే....మీనన్ నిషిని కిడ్నాప్‌ చేయించి ఉండాలని భావిస్తాడు. నిషిని వదిలేశాడంటే....మీనన్‌కు పనిచేస్తానని ఒప్పుకుందా అని భయపడతాడు. మీనన్‌తో చేతులు కలిపితే ప్రతిక్షణం భయంతో చస్తూ బతకాల్సిందేనని అంటాడు. ఇప్పుడే నిషిని ఈ విషయంలో  హెచ్చరించాలని  అనుకున్నా....సాక్ష్యాలు లేకుండా మాట్లాడితే ఖచ్చితంగా గొడవ చేస్తుందని యువరాజు భావిస్తాడు. కాబట్టి రిషిని ఓ కంట కనిపెట్టాలని అనుకుంటాడు.

   ఇంతలో అక్కడికి వాళ్ల కౌషికి వస్తుంది.ఏం ఆలోచిస్తున్నావ్ యువరాజు...మీనన్ ఈ ఫ్యామిలీని ఎందుకు ఎటాక్‌ చేశాడని ఆలోచిస్తున్నావా లేక నువ్వు మీనన్‌ వేసుకున్న ప్లాన్ ప్లాప్‌ అయ్యిందే అని బాధపడుతున్నావా అని అడుగుతుంది. నా కన్నతండ్రిని నేనే కిడ్నాప్ చేయమని ఎలా చెబుతాను అని మండిపడతాడు. ఇదేనా నువ్వు నన్ను నమ్ముతుంది అని అంటాడు. ఒకసారి ఆ మీనన్‌తో చేతులు కలిపి మన ఇంటి పరువు తీశావు కదా అని గుర్తుచేస్తుంది. మాఫియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని క్లాస్‌పీకుతుంది. ఈలోగా  వైజయంతి అక్కడికి వస్తుంది. అబ్బాయి నువ్వు చెప్పినట్లే ఇంట్లోఉన్నా...ఇంకా అనుమానిస్తూ ఇన్ని మాటలు అంటున్నావు అని అంటుంది. వాడు మనవాడ్ని వదలకపోతే...అందులో వీడి తప్పు ఏముందని అంటుంది. నేను వాడిని ఇంట్లో నుంచి బయటకు పంపకుండా ఉంచుతుంది వాడిని కాపాడుకోవడానికేనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వైజయంతి కూడా మళ్లీ తన కొడుకుని మరోసారి అడుగుతుంది. నువ్వు మళ్లీ ఆ మీనన్‌ కోసం పనిచేయడం లేదు కదా అని నిలదీస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా  నేను ఆ పనులు ఎందుకు చేస్తానమ్మా అంటాడు.నేను వాడు చెప్పిన పనులు చేసి ఉంటే నాన్నను ఎందుకు కిడ్నాప్ చేసేవాడు అని అంటాడు.
 
    కేదార్‌ జగధాత్రి వద్దకు వచ్చి మనం హనీమూన్‌కు వెళ్తామని అని ప్రతిపాదిస్తాడు.దీంతో ధాత్రి మండిపడుతుంది.అత్తయ్య శ్రీవల్లి విషయంలో దాస్తున్న నిజం ఏంటో తెలియదు. నిషి మీనన్‌తో చేతులు ఎందుకు కలిపిందో అర్థం కావడంలేదు. వారంరోజుల్లో మినిస్టర్‌ను చంపిన వాళ్లను పట్టుకుంటామని శపథాలు చేశాం. చుట్టూ ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని హనీమూన్‌కు వెళ్దామని ఎలా అడుగుతున్నావ్ అంటూ కోప్పడుతుంది. ఇంతలో వైజయంతిని నిషికను పిలిచి శ్రీవల్లిని ఇంట్లో నుంచి గెంటివేయబోతున్నానని చెబుతుంది. తన ప్లాన్ మొత్తం నిషికి చెబుతుంది.ఇది వర్కవుట్ కాకుంటే జగధాత్రి చేతిలో మీపని అయిపోతుందని నిషి హెచ్చరిస్తుంది. మరి వైజయంతి వేసిన ఆ ప్లాన్ ఏంటో వచ్చే ఏపిసోడ్‌లో చూద్దాం.

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: కల్యాణ్‌ పేరు ధీరజ్‌నే రాశాడని గోల చేసిన ప్రేమ! గుడ్‌ బై చెప్పేసిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: కల్యాణ్‌ పేరు ధీరజ్‌నే రాశాడని గోల చేసిన ప్రేమ! గుడ్‌ బై చెప్పేసిన ధీరజ్!
Jagadhatri Serial Today August 17th:కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
జగద్ధాత్రి సీరియల్: కోర్టులో వివేక్ మిశ్రాకు చుక్కలు చూపించిన జేడీ...కేసు ఓడిపోతే ఉద్యోగం వదిలేస్తానని ఛాలెంజ్‌
Karthika Deepam 2 Serial Today August 18th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌కి మనసులో మాట చెప్పేస్తుందా! సూరజ్ భర్త్‌డేకి మాలిని సందడేంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Embed widget