Trinayani August 22th: నాగయ్యను కుండలో బంధించిన తిలోత్తమా.. అత్తపై అనుమాన పడుతున్న నయని?
తిలోత్తమా నాగయ్యను కుండలో బంధించటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందాం.
Trinayani August 22th: తిలోత్తమా పాము ను లొంగదీయడానికి తీసుకొచ్చిన పౌడర్ ను నయని జాకెట్లపై చల్లుతుంది. ఇక అలా ఎందుకు చల్లావు అని వల్లభ అడగటంతో పిల్లలకు పాలు ఇవ్వలేదని.. దాంతో ఆవు పాలు తెస్తుంది అప్పుడు ఆ కుండలో వశీకరణం పౌడర్ వేస్తే పాము వస్తుంది అని కుట్ర చేసే డైలాగులు చెబుతుంది. మరోవైపు దురంధర నయని దగ్గర గాయత్రిని తీసుకొచ్చి తనను ఆడించడం తన వల్ల కాదు అని.. ఇక తనకు ఆకలేస్తుంది పాలు ఇవ్వమని అంటుంది.
అప్పుడే హాసిని నయని జాకెట్లు తీసుకొచ్చి దానిపైన పౌడర్ పడిందని నయనిని చూడమని నయనికి ఇవ్వటంతో ఆ పౌడర్ మంచిది కాదు అని పక్కన పడేసేయమని అంటుంది. ఇక నువ్వు వేసుకున్న జాకెట్ కి కూడా ఆ పౌడర్ ఉండొచ్చు అని ఇదంతా అత్తయ్య పని అయ్యి ఉండొచ్చు ఏమో అని నయని అనటంతో హాసిని కూడా తనకు కూడా అదే డౌట్ ఉంది అని అంటుంది.
ఇక ఇది చూపించి మంచి పని చేశావు లేదంటే ఇప్పుడు గాయత్రి పాపకు పాలు ఇస్తే ఏమైయ్యేదో అని అంటుంది. ఇక ఆవు పాలు తీసుకొస్తాను అని అంటుంది. ఆ తర్వాత గురువు నాగయ్యను పిలుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నాగులమ్మ రావడంతో నేను నిన్ను గుర్తు పట్టలేదు అనుకుంటున్నావా అని అనటంతో వెంటనే పాముగా ఉన్న పెద్ద బొట్టమ్మ తన భర్తకు నాగయ్యకు ఏ హాని కలుగుతుందో అని ఆయన రాకముందుకు ఇలా వచ్చాను అని అంటుంది.
చెప్పండి మీరేం చేయమన్నా ఆ పని చేస్తాను అని అంటుంది. దాంతో గురువు ఆదేశించేది నేను కాదు విశాలాక్షి తల్లి అని అంటాడు. రాతలో ఏ విధంగా ఉంటే అలా జరుగుతుంది మారవలేము అని అంటాడు. సుమంగలిగా పోవాలనుకుంటున్న నా సంకల్పం వికల్పం అవుతుందా అని నాగులమ్మ అంటుంది. దాంతో గురువు చూద్దాం అని.. నాగయ్యకు ఎంత శక్తి ఉన్న కొన్నిసార్లు లొంగిపోక తప్పదు అని అప్పుడే అక్కడికి నాగయ్య వస్తాడు.
నాగయ్యకు నాగులమ్మ ఎందుకు వచ్చిందో అన్న విషయాన్ని చెప్పి తనను నయని ఇంటికి పంపిస్తాడు. నయని ఆవు పాలు తెచ్చి వేడి చేస్తూ ఉండటంతో.. అదంతా ఒకవైపు ఉండి గమనిస్తారు తిలోత్తమా, వల్లభ. ఇక నయని పాలు చల్లార్చి అక్కడ నుంచి బయటకు వెళ్తుంది. వెంటనే తిలోత్తమా, వల్లభ అక్కడికి వెళ్తారు. అదే సమయంలో దురంధర లోపలికి వెళ్ళిన తల్లి కొడుకులని చూసి అనుమానం పడుతుంది.
ఇక తిలోత్తమా కుండలో పాలు పోసి పౌడర్ వేస్తుంది. ఇక అందరూ హాల్లోకి వచ్చి తిలోత్తమా వాళ్ళని గమనిస్తూ ఉంటారు. ఇక వాళ్ళు పాడు పనిచేస్తున్నారు అని డమ్మక్క అనటంతో ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడే బయట నుంచి నయని కూడా వస్తుంది. ఇక ఎవరికి అనుమానం రాకుండా తల్లి కొడుకులిద్దరూ బయటికి వస్తారు.
విశాల్.. మీకు ఏదైనా కావాలి అంటే నయని వాళ్ళని అడగొచ్చు కదా నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవచ్చు కదా అని తన తల్లితో అంటాడు. ఇక హాసిని మధ్యలో వెటకారం చేస్తూ ఉంటుంది. మళ్ళీ సుమన ఆస్తి టాపిక్ తేవటంతో అదే చర్చ జరుగుతూ ఉంటుంది. అప్పుడే నాగయ్య కిచెన్ లోకి వస్తాడు. మరోవైపు ఇంట్లో వాళ్లంతా మాటల యుద్ధం చేస్తూ ఉంటారు.
ఇక పాము రావడానికి తిలోత్తమా గమనిస్తుంది. వెంటనే వల్లభకు కూడా చూపిస్తుంది. ఇక పాము కుండలోకి వెళుతుంది. ఇంట్లో వాళ్ళు మాట్లాడుతుండగా వాళ్లు అక్కడి నుంచి వంట గదిలోకి వెళ్తారు. వీళ్లు పదేపదే వంట గదిలోకి ఎందుకు వెళ్తున్నారు అని విక్రాంత్ అంటాడు. ఇంట్లో వాళ్ళు తిలోత్తమా వాళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కుండకు గరుడ వస్త్రాన్ని తిలోత్తమా కడుతూ ఉండగా నయనికి అనుమానం వచ్చి లోపలికి వెళ్తుంది. ఇక గరుడ వస్త్రాన్ని కట్టేసి కట్టేసాను రా అని ఊపిరి పీల్చుకుంటుంది తిలోత్తమా.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial