అన్వేషించండి

Naga Panchami Serial Today May 31st: 'నాగ పంచమి' సీరియల్: ఆస్తి కోసం అత్త ఎదురుగా కొట్టుకున్న కన్నింగ్ కోడళ్లు.. వైశాలిని చదివించొద్దన్న పంచమి!

Naga Panchami Serial Today Episode : తాను ఆశ్రయం పొందుతున్న ఇంట్లో నీలుకి కంటి చూపు వచ్చేలా చేస్తాను అని కరాళి నీలు తల్లిదండ్రులకు మాట ఇవ్వడంతో ఇవాళ్టి ఎసిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode : పంచమి ఏడుస్తూ తనలో తాను మాట్లాడుకుంటుంది. విశాలాక్షి చెప్పినట్లు తన తల్లి వైశాలి రూపంలో తనకు పుట్టిందని అనుకుంటుంది. ఈ విషయం నాగేశ్వరికి తెలిసి తన బిడ్డను నాగలోకం తీసుకెళ్లకుండా కాపాడుకోవాలని అనుకుంటుంది. మరోవైపు కరాళి కూడా వెంటాడుతుందని బాధపడుతుంది. తన పిల్లల్ని భర్తని కాపాడే బాధ్యత నీదే అంటూ శివయ్యను వేడుకుంటుంది. ఇంతలో మోక్ష వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని పంచమిని అడుగుతాడు. 

మోక్ష: ఇటు చూడు పంచమి మన ఇద్దరు పిల్లలు మన ఆస్తి. వాళ్లని చూస్తే మన కడుపు నిండిపోతుంది. ఇలా ఏడ్వడం నాకు నచ్చలేదు.
పంచమి: మనసులో నా గుండె అగ్ని గుండంలా మండిపోతే ఎలా మామూలుగా ఉండగలను అండీ అనుకుంటుంది. 
మోక్ష: మనకు ఆ భగవంతుడి దయ వల్ల ఒకరికి ఇద్దరు పుట్టారు. ఏ అవ లక్షణాలు లేవు. దానికి మనం ఎంతో సంతోషించాలి.
పంచమి: అవును మోక్షాబాబు నేను యుక్త వయసు వచ్చే వరకు నాకు ఏ కష్టం లేదు. ఆ తర్వాత తెలిసింది నేను నాగకన్యను అని.  
మోక్ష: మనం అనుభవించాల్సిన కష్టాలు అన్నీ అనుభవించేశాం. ఇక సంతోషం మాత్రమే ఉంది. మన నలుగురిని ఎవ్వరూ వేరు చేయలేరు.
పంచమి: నేను అదే కోరుకుంటున్నాను మోక్షాబాబు. కానీ శత్రువులు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తారో తెలీదు. మనసులో.. భగవంతుడా నాగేశ్వరి కోరిక నెరవేరకూడదు. కరాళి ప్రయత్నాలు విఫలం అవ్వాలి. మా పిల్లలు దూరం అయితే మేం బతకలేం. మమల్ని విడదీయకు. 

కరాళి ఆశ్రయం పొందుతున్న ఇంట్లో నీలు కిందపడిపోబోతే కరాళి పట్టుకుంటుంది. తన బిడ్డను రెండో సారి కాపాడావు అని నీలు తల్లి కరాళికి కృతజ్ఞతలు  చెప్తుంది. దానితో కరాళి ఇలా కాపాడటానికి రోజూ ఎవరు ఉంటారు నీలుకు ఎందుకు ఇలాంటి పనులు చెప్తున్నారు అని అడుగుతుంది. నీలు తండ్రి పెద్దగా పనులు చెప్పమని కానీ నీలుకి ఏదో ఒక పని చేయకపోతే ఇష్టం ఉండదని పైగా ఇళ్లు కూడా గడవదని కరాళితో చప్తాడు. 

కరాళి: ఎవరైనా డాక్టర్‌కి చూపించకపోయారా.
నీలుతల్లి: మాకు అంత స్తోమత లేదమ్మ. ఏదో కట్టెలు అమ్ముకొని బతుకుతున్నాం.
కరాళి: నా మీద మీకు నమ్మకం ఉంటే నీలుకి చూపు వచ్చేలా నేను చేస్తాను. 
నీలుతండ్రి: చల్లని మాట అన్నావమ్మా. మా బిడ్డకు చూపు తెప్పిస్తే జీవితం మొత్తం నీకు ఊడిగం చేస్తామమ్మా. 
నీలు: నిజంగా నాకు చూపు వస్తుందా.
కరాళి: ప్రయత్నించడంలో తప్పు లేదు నీలు. నీకు చూపు వస్తుంది. 

చిత్ర: అమ్మో ఈ జ్వాలని ఇలాగే వదిలేస్తే వారసుడు అని ఆస్తి మొత్తం తన కొడుకునే అని లాగేసుకుంటుంది. ఏదో ఒకటి చేసి దానికి అడ్డుకట్ట వేయాలి. కానీ ఎలా. అంటూ వైదేహి కాళ్లు పట్టుకుంటుంది. 
వైదేహి: ఏంటి చిత్ర ఇది ఎవరైనా చూస్తే కోడల్ని రాచి రంపాన పెడుతున్నాను అనుకోరా. 
చిత్ర: అయ్యో అత్తయ్య ఇందులో తప్పు ఏముంది. అత్త తల్లితో సమానం. అత్తయ్య ఇంట్లో మొదటి బిడ్డను కన్నది నేనే కదా. నా కూతురే కదా మీ మొదటి మనవరాలు. నిన్న కాక మొన్న ఓ నలుసుని కని వాడే వారసుడు అని జ్వాల అక్క ఫోజులు కొడుతుంది. 
వైదేహి: ఏదో కొడుకు పుట్టాడని అలా అంటుందిలేమ్మా. దానికి ఏమైంది ఇప్పుడు.
చిత్ర: మీకు ఆ జ్వాల గురించి తెలీదు అత్తయ్యగారు. అది తడిగుడ్డతో గొంతు కోసే రకం. నా కొడుకే ఈ ఇంటికి వారసుడు  అని నాకు మొండి చేయి చూపిస్తుంది. ఆ జ్వాల సంగతి నాకు తెలుసు అత్తయ్య గారు. మీకు ఆ జ్వాల అక్క నిజస్వరూపం తెలీక అలా మాట్లాడుతుంది. ఎందుకైనా మంచిది నా కూతురు మొదటి వారసురాలు అని చెప్పి సగం ఆస్తి రాసి పెట్టండి.
జ్వాల: పళ్లు రాలిపోతాయ్ ఒక్కోక్కరికి. జ్వాలని చూసి చిత్ర భయపడుతుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నా గురించి అత్తయ్యకు చెప్తావ్ నీ సంగతి ఇప్పుడే చెప్తా.
 వైదేహి: జ్వాల అలా ఏం లేదమ్మా చిత్ర ఏం చెప్పలేదు.
జ్వాల: నేను విన్నాను అత్తయ్య గారు. ఈ ఇంట్లో ఆస్తికి సంబంధించి రాతకోతలు జరిగితే అప్పుడు చూస్తారు ఈ జ్వాల అంటే ఏంటో.
వైదేహి: చూడు జ్వాల నేను మీ మామయ్య గారు అమాయకులం కాదు. ఈ ఇంట్లో అందరూ సమానమే.
జ్వాల: ఎలా అవుతుంది. అత్తయ్య గారు రేపో మాపో చిత్ర కూతురికి పెళ్లి చేసి పంపేస్తాం ఆ పిల్లకి ఈ ఆస్తి మీద ఏం  హక్కు ఉంటుంది. చెప్పండి. 
చిత్ర: ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన వాటా ఇవ్వాల్సిందే.
జ్వాల: అవునా అయితే ముందు నువ్వు నీ పుట్టింటి నుంచి నీ వాటా తీసుకొని రా. అప్పుడు ఈ ఇంటి ఆస్తి గురించి మాట్లాడు. కావాలి అంటే నాలుగు రూపాయలు ఎక్కువ పెట్టి బంగారం పెట్టి అత్తారింటికి పంపిద్దాం.
చిత్ర: ఇది చాలా అన్యాయం అక్క. కావాలి అంటే ఇప్పుడే ఎవరి ఆస్తి వాళ్లే పంచుకుందాం అంతే. 
జ్వాల: అంత ధైర్యంగా ఆస్తి పంచేవాళ్లు ఎవరో రమ్మను అప్పుడు చెప్తాను.
చిత్ర: ఏ ఎందుకు పంచకూడదు. ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే కోడలు కాదు. ఇంట్లో ఉన్న అందరికి సమాన వాటా రావాల్సిందే. 
జ్వాల: అలా మొండికేస్తే నీకు ఒక్క పైసా కూడా రాకుండా చేస్తాను. రేపు పెద్ద అయిన తర్వాత ఈ వంశానికి ఏకైక వారసుడు నా కొడుకే వాడి మాటే ఈ ఇంట్లో వేదం. 
చిత్ర: నేను ఒప్పుకోను అక్క అంత వరకు ఉండి నీ కొడుకు మోచేతి కింది నీళ్లు తాగాల్సిన అవసరం మాకు లేదు. 
వైదేహి: ముందు మీరు గొడవలు ఆపండి ఏం చేయాలో మాకు బాగా తెలుసు. 
జ్వాల: రేపు ఈ ఇంటిళ్ల పాదికి ఏ కార్యం చేయాలి అన్నా నా కొడుకే దిక్కు.
వైదేహి: ఇంతకు మించి ఒక్క మాట మాట్లాకండి. మీ మామయ్యగారితో మాట్లాడాలి. ముఖ్యంగా తీర్థయాత్రలకు వెళ్లిన మా అత్తయ్య గారు రావాలి. ఆస్తి పంపకం ఏ ఒక్కరి నిర్ణయం కాదు. అది చేయాల్సిన రోజున మేమే చేస్తాం. వెళ్లి మీ పనులు మీరు చేసుకోండి వెళ్లండి. బీటలు వారడం మొదలు పెట్టింది. ఈ ఇంటిని ఆ దేవుడే కాపాడాలి.

పంచమి వైశాలికి రుద్రాక్షి మాల ఎప్పుడూ తీయొద్దని చెప్తుంది. వైశాలి ఎప్పుడూ దాన్ని నా దగ్గరే ఉంచుకుంటా అని చెప్తుంది. ఇంతలో మోక్ష వస్తాడు. ఇద్దరినీ స్కూల్‌లో చేర్పిస్తాను అని అంటాడు. చక్కగా చదువుకోమని చెప్తాడు. పంచమి డల్‌గా ఉంటే పంచమి దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగుతాడు. ఓ స్కూల్‌లో ఆడ్మిషన్‌ తీసుకున్నాను అని అంటాడు. పంచమి వైశాలిని వద్దని ఫాల్గుణినే చదివిద్దామని అంటుంది. మోక్ష షాక్ అవుతాడు. పంచమి ఏడుస్తూ మోక్షని హగ్ చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: బాలీవుడ్‌లో మరో బ్రేకప్‌ - ఐదేళ్ల బంధానికి ముగింపు పలికిన మలైకా, అర్జున్‌..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Embed widget