Malaika Arora-Arjun Kapoor: బాలీవుడ్‌లో మరో బ్రేకప్ - ఐదేళ్ల బంధానికి ముగింపు పలికిన మలైకా, అర్జున్..!
Malaika Arora Arjun Kapoor: బాలీవుడ్‌లోని ఈ స్టార్ జంట విడిపోయిందట. ఐదేళ్లుగా చెట్టపట్టాలేసుకుని తిరిగిన ఈ లవ్‌బర్ట్స్ తమ బంధానికి శుభం కార్డు వేశారట.

Malaika Arora And Arjun Kapoor Part Ways But: బాలీవుడ్‌లో మరో జంట బ్రేకప్ చెప్పుకుందట. ప్రస్తుతం ఈ వార్త బి-టౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. నేషనల్ మీడియాలో మొత్తం ఈ జంట రిలేషన్ గురించే చర్చికుంటున్నారు. కాగా బాలీవుడ్ లవ్ బర్ట్స్ మలైకా ఆరోరా-అర్జున్ కపూర్‌ల ప్రేమాయాణం ప్రత్యేకమైనదనే చెప్పాలి. కొంతకాలంగా సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న వీరు 2018లో రిలేషన్‌ని ఆఫీషియల్ చేశారు. ఐదేళ్లుగా చెట్టపట్టాలేసుకుని తిరిగిన ఈ ప్రేమ జంట ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారంటూ బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ జంట సన్నిహితవర్గాలు కూడా అదే చెబుతున్నాయట.
కాగా ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్ అయినా, ఎలాంటి మూవీ ఈవెంట్ అయినా అర్జున్ కపూర్-మలైకాలో జంటగా హాజరవుతున్నారు. అంతేకాదు తరచూ డిన్నర్ డేట్స్‌కి వెళ్లి కెమెరాలకు చిక్కారు. ఇక తమ రిలేషన్‌ని ఆఫీషియల్ చేసిన తర్వాత తరచూ ఇద్దరు ఒకరి ఫోటోలు ఒకరు షేర్ చేస్తూ ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకున్నారు. తరచూ వెకేషన్‌కు వెళ్లారు. అయితే కొద్ది రోజులుగా ఈ జంట గప్‌చుప్‌గా ఉంటుంది. ఎప్పుడు జంటగా కనిపించేవారు ఇప్పుడు సింగిల్‌గా కనిపిస్తున్నారు. అర్జున్ కపూర్ మీడియాకు దూరంగా ఉంటున్న.. మలైకా తరచూ సింగిల్‌గానే కనిపిస్తుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా వీరి బ్రేకప్ చెప్పుకున్నారంటూ ప్రచారం మొదలైంది. కానీ, చాలామంది దీన్ని కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు వీరిద్దరు విడిపోయారనేది నిజమేనంటూ ఇండస్ట్రీవర్గాలు కన్‌ఫాం చేస్తున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి అర్జున్-మలైకా విడిపోయారనే వార్తలను కన్‌ఫాం చేశారట.
విడిపోయినా.. ఆ బంధం అలాగే ఉంటుంది
"మలైకా, అర్జున్‌ల మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఒకరి మనసులో ఒకరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇద్దరికి బ్రేకప్ అయినా కూడా వారిమధ్య అనుబంధం అలాగే ఉంటుంది. అదే హెల్తీ రిలేషన్‌ని వారు కొనసాగిస్తారు. అయితే తమ బ్రేకప్ గురించి బయటకు చెప్పేందుకు వారు సముఖత చూపడటం లేదు. ఎందుకంటే దీనిపై అందరు చర్చించుకోవడం వారికి ఇష్టం లేదు. అందుకే ఈ విషయంలో వారు మౌనంగా ఉంటున్నారు" అని ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి.
ఇద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం
కాగా అర్జున్ కపూర్, మలైకా ఆరోరా కంటే 12 ఏళ్లు చిన్నవాడనే విషయం తెలిసిందే. వీరి ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పుడు కూడా ఇది పెద్ద చర్చనీయాంశమైంది. తనకంటే 12 ఏళ్ల చిన్నవాడితో డేటింగ్ ఏంటని అంతా మలైకాను ట్రోల్ చేసేవారు. ఆంటీతో ప్రేమ ఏంటని అర్జున్‌పై ఆటాడుకునేవారు. అంతేకాదు సోషల్ మీడియాలో వీరి పోస్ట్స్‌పై కూడా ఇలాంటి కామెంట్సే వచ్చేవి. కానీ వారిద్దరు ఎప్పుడు కూడా దీనిపై పెద్దగా స్పందించేవారు కాదు. కానీ, పలుమార్లు అర్జున్ ట్రోలర్స్‌కి తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తువచ్చేవాడు. అంతేకాదు ఎన్ని ట్రోల్స్ వచ్చినా తనకు మలైకా ఎంతో స్పెషల్ అంటూ తన పోస్ట్స్ ద్వారా సమాధానం ఇచ్చేవాడు. అలాంటి ఈ జంట ఇప్పుడు విడిపోయారంటూ వార్తలు రావడంతో వారి ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మరి దీనిపై ఈ అర్జున్, మలైకాల నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.
Also Read: ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ఓటీటీ పార్ట్‌నర్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

