అన్వేషించండి

Gam Gam Ganesha OTT: ఆనంద్‌ దేవరకొండ 'గం గం గణేశా' ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Gam Gam Ganesha OTT: ఆనంద్‌ దేవరకొండ గం గం గణేశా మూవీ నేడు థియేటర్‌లోకి వచ్చింది. థియేటర్లో పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ డిటైయిల్స్‌ ఆసక్తిగా మారాయి.

Anand Devarakonda Gam Gam Ganesha OTT Partner and Streaming: టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘గం గం గణేశా’. 'బేబీ' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. విడుదలైన ఫస్ట్‌ షో నుంచి ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను తెచ్చుకుంటుంది. సోషల్‌ మీడియా రివ్యూస్ ప్రకారం.. సినిమా మొత్తం ఎంజాయ్‌ చేయొచ్చంటూ ప్రిమియర్‌ షోలు చూసిన నెటిజన్లు చెబుతున్నారు.

మూవీ కాన్పెప్ట్‌ సూపర్‌ అని, రెండున్నర గంటల పాటు ఎక్కడ లాగ్‌ లేకుండ ఎంటర్‌టైనర్‌గా మూవీ సాగిందంటున్నారు. ఇక సినిమా క్లైమాక్స్‌ అల్టిమేట్‌ అని, ఇది ఎవరూ ఊహించలేరంటున్నారు. దీంతో మూవీపై ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం థియేటర్లో పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీ డిటైయిల్స్‌పై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం థియేటర్లో రిలీజైన ఏ సినిమా అయినా ఓటీటీలో అలరిస్తున్నాయి. 

ఇక మూవీ రిజల్ట్‌ బట్టి ఓటీటీ ప్రీమియర్‌కు డిసైడ్‌ అవుతుంది. 'గం గం గణేశా'కు పాజిటివ్‌ టాక్ రావడంతో ఇప్పుడు డిజిటల్‌ ప్రియులంతా మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. 'గం గం గణేశా' అప్పుడే ఓటీటీ పార్ట్‌నర్‌ని లాక్‌ చేసుకుంది. అమెజాన్‌ ప్రైం ఈ మూవీని ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ హక్కులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను థియేట్రికల్‌ రన్‌ అనంతరం ఓటీటీలోకి తీసుకురానుంది. అంటే 'గం గం గణేశా' జూన్ చివరి వారం లేదా జూలై నెలలో ఓటీటీకి తీసుకువచ్చేందుకు అమెజాన్ ప్లాన్ చేస్తుందని టాక్. అయితే గం గం గణేశా ఓటీటీ పార్ట్ నర్, ఓటీటీ డిటైయిల్స్ కి సంబంధించి  త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.  

ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆనంద్‌ దేవరకొండ సరసన నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాతో వంశీ కారుమంచి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. తన మిత్రుడు కేదార్ సెలగం శెట్టితో కలిసి  హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వంశీ ఈ మూవీని నిర్మించారు. దాదాపు ఈసినిమానే నేడు 400 థియేటర్లలో విడుదల చేశారు. ఇదిలా ఉంటే గతేడాది ఆనంద్‌ దేవరకొండ బేబీ సినిమాతో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్నాడు. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత ఆనంద్‌ దేవరకొండ నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచాలు నెలకొన్నాయి. అలా భారీ అంచాలా మధ్య థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఫుల్‌ లెన్త్‌ కామెడీ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఇక రివ్యూస్‌ చూస్తుంటే ఈ మూవీతో ఆనంద్‌ ఖాతా మరో పెద్ద హిట్‌ ఖాయం అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget