(Source: ECI/ABP News/ABP Majha)
Naga panchami October 17: మళ్లీ మామూలు మనిషి అయిన మోక్ష-పంచమిని ఇంట్లోంచి గెంటేస్తున్న కుటుంబం!
మోక్ష మళ్లీ మామూలు స్థితికి రావడంతో కథలో కొత్త మలుపు చోటు చేసుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది..
Naga panchami, October 17, ఈరోజు ఎపిసోడ్ లో స్పృహ తప్పిన పంచమికి స్పృహ వచ్చేలాగా చేస్తాడు సుబ్బు.
పంచమి: ఏం జరిగింది.
సుబ్బు : కటికప్పు వాసులు చేసి ప్రదక్షిణలు చేస్తున్నావు కదా అందుకే కళ్ళు తిరిగి పడిపోయావు.
పంచమి : పూర్తి చేయలేదు కాబట్టి స్వామివారికి కోపం వస్తుందా..
సుబ్బు: లేదు నువ్వు డిస్టర్బ్‌తో పూజ చేశావు, స్వామివారు నీ పూజని అనుగ్రహించారు అందుకే ఆయన మొహం చూడు ఎలా వెలిగిపోతుందో అంటాడు.
మరోవైపు స్పృహలోకి వచ్చిన మోక్ష తన గదిలో ఉన్న నంబూద్రుని ఆయన శిష్యులని చూసి ఏం జరిగింది? ఏం చేస్తున్నారు అని అడుగుతాడు.
నంబూద్రి : నీ ఆరోగ్యం బాగోకపోతే నయం చేయమని మీ అమ్మగారు చెప్పారు అందుకే పూజ చేస్తున్నాం.
అమ్మ అంటూ కిందికి వెళ్తాడు మోక్ష. మామూలు స్థితికి వచ్చిన మోక్ష ని చూసి ఆనందపడతారు కుటుంబ సభ్యులు.
కుటుంబ సభ్యులు: నువ్వు మామూలు మనిషివి అయిపోయావు, మమ్మల్ని గుర్తు పడుతున్నావు నిన్ను మళ్ళీ ఇలా చూస్తాం అనుకోలేదు.
మోక్ష :ఆపండి, అసలు ఏం జరిగిందో ముందు చెప్పండి.
నంబూద్రి : నేను చెప్తాను, నీకు ఒక దుష్ట శక్తి ఆవహించింది. నా మంత్ర శక్తితో నిన్ను బాగు చేశాను.
మోక్ష కుటుంబ సభ్యులు నంబూద్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.
నంబూద్రి : నయం చేస్తానని మీకు మాటిచ్చాను నయం చేసినందుకు సంతోషంగా ఉంది.
మోక్ష పంచమిగురించి అడుగుతాడు. కుటుంబ సభ్యులు ఎవరు ఆమె గురించి చెప్పకపోవడంతో మోక్ష అన్న కూతురు వచ్చి పంచమి పిన్ని నీకోసం పూజలు చేయడానికి వెళ్ళింది అని చెప్తుంది. మరోవైపు కంగారుగా ఇంటికి వస్తున్న పంచమిని నీ నమ్మకాన్ని కాదనటం నీ ఆత్రుతని ఆపడం ఎవరి తరం కాదు పదా అంటాడు సుబ్బు. ఇద్దరు ఇంటికి ప్రయాణం అవుతారు.
వాళ్ల ప్లాన్ ఫెయిల్ అయినందుకు నంబూద్రి, కరాళి.
నంబూద్రి : నేను అక్కడ ఉండి కూడా ఏమి చేయలేకపోయాను అంటే పంచమికి దైవశక్తి ఏదో సాయం చేస్తుంది. పంచమికి తన భర్త మీద ఉన్న ప్రేమ మన ప్రయత్నాలకు అడ్డు తగిలింది. ఈ అనుభవం మనకి గుణపాఠం లాంటిది. ఇకపై మనం ఏం చేసినా ఆలోచించి చేయాలి.
మరోవైపు తనని వింతగా చూస్తున్న శబరి దగ్గరికి వెళ్లి ఏంటి అలా కొత్తగా చూస్తున్నావు శబరి అంటాడు మోక్ష.
శబరి: కొత్తగా కాదురా నా పాట మనవడిని చూస్తున్నందుకు ఆనందంగా ఉంది.
మోక్ష తల్లి: నువ్వు మళ్ళీ మామూలు మనిషికి వెళ్తావు అనుకోలేదు ఇదంతా నంబూద్రి గారి చలవ,ఆయన లేకపోతే నువ్వు ఏమైపోయే వాడివో.
కుటుంబ సభ్యులందరూ నంబుద్రుని తెగ పొగిడేస్తూ ఉంటారు.
మోక్ష: ఆయన నాకు బాగు చేయటం ఏంటి?
ఇంతలో మోక్ష తండ్రి వచ్చి కొడుకుని పట్టుకుని బాగా ఎమోషనల్ అవుతాడు. కుటుంబ సభ్యులందరూ కూడా బాగా ఎమోషనల్ అవుతారు.
మోక్ష: అందరూ కనిపిస్తున్నారు కానీ పంచమి కనిపించట్లేదు ఏంటి తను ఎక్కడ ఉంది.
మోక్ష వదిన: పంచమి నిన్ను పిచ్చివాడిగా చేసి మమ్మల్ని గుర్తుపట్టకుండా చేసింది.
మోక్ష తల్లి: నంబూరి గారిని పిలిపించి మళ్లీ నిన్ను మామూలు మనిషిగా చేసుకున్నాం.
మోక్ష: నాకు నమ్మాలి అనిపించడం లేదు అసలు పంచమి ఎక్కడికి వెళ్లిందో చెప్పండి.
మోక్ష వదిన: మోక్షకి పంచమి పిచ్చి పట్టింది.
మోక్ష: తను చాలా మంచిది నీలాగా కాదు అంటాడు.
ఇంతలో మోక్ష అన్న కూతురు వచ్చి పిన్ని గురించి నేను చెప్తాను అని అక్కడినుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వాడి ఆరోగ్యం బాగుపడింది కానీ వాడి బుద్ధి బాగుపడలేదు అని బాధపడతారు.
మోక్ష తల్లి నంబూద్రికి ఫోన్ చేస్తుంది.
మోక్ష తల్లి:వాడి బుద్ధి మారలేదు మళ్లీ పంచమి గురించే అడుగుతున్నాడు.వాడి గురించి భయంగా ఉంది.
నంబూద్రి : భయపడకండి భార్య మీద విరక్తి కలిగి తను వద్దనే లాగా చేస్తాను.
ఆనందంగా ఫోన్ పెట్టేస్తుంది మోక్ష తల్లి. మరోవైపు బాధపడుతూ కూర్చున్న మోక్ష దగ్గరికి వచ్చి పిన్ని మీకోసం చాలా కష్టపడింది అంటూ వీడియోలు చూపిస్తుందిమోక్ష అన్న కూతురు. తన కోసం కష్టాలు పడుతున్న మోక్షని చూసి కన్నీరు పెట్టుకుంటాడు మోక్ష.
మోక్ష అన్న కూతురు: పిన్ని చాలా మంచిది బాబాయ్ తన గురించి ఎవరు చెడుగా చెప్పినా నమ్మొద్దు.
ఇంతలో పంచమి వచ్చిమోక్షని పిలుస్తుంది.ఆనందంగా ఆమె దగ్గరికి వెళతాడు మోక్ష ఇద్దరూ హగ్ చేసుకుంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
తరువాయి భాగంలో..
పంచమిని ఇంట్లోంచి గెంటయ్యబోతుంది ఆమె అత్తగారు. తన జోలికి వచ్చారంటే తల్లి తండ్రి అన్న వదిన అని కూడా చూడను అంటూ కోప్పడతాడు మోక్ష.