News
News
X

Ennenno Janmalabandham july 6th Update: కైలాష్ గురించి యష్ కి నిజం చెప్పిన వేద, కైలాష్ కుట్రకి బలైన వేద

కైలాష్ గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన వేదనే పోలీసులు లాకప్ లో పెడతారు. కైలాష్ చేసిన కుట్ర కి బలైపోతుంది పాపం వేద. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ‘తను నా భార్య, ఓ డాక్టర్, ఎవరో ఏదో చెప్తే విచారణ లేకుండా అరెస్ట్ వారెంట్ లేకుండా నా భార్యని లాకప్ లో ఎలా ఉంచుతారు. ఎంత ధైర్యం మీకు నా భార్యని అవమానించడానికి. ఈ అవమానం నా భార్యకే కాదు నాకు కూడ’ అని యష్ పోలీస్ ఇనస్పెక్టర్ తో అంటాడు. మీ వెర్షన్ మీకు ఉంటే మాది మాకుంటుంది. డాక్టర్ అంటున్నారు అయితే ఏంటి అని పోలీస్ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. తనని తెల్లరేదాక విడిచి పెట్టేది లేదని ఇన్ స్పెక్టర్ చెప్తాడు. అసలు ఏమైందని యష్ వేదని అడుగుతాడు. నీ నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు తప్పు చేసావంటే నేను నమ్మను. ధైర్యంగా ఉండు నేను ఉండగా నీకు కష్టం రానివ్వను అని యష్ వేదని ఓదారుస్తాడు.

యష్ వెంటనే పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడిన కాసేపటికి లాయర్ వచ్చి వేదని విడిపించేందుకు బెయిల్ పేపర్స్ ఇస్తాడు. సార్ నిజంగానే వివిఐపి నే ఇంత అర్థ రాత్రి బెయిల్  తెచ్చాడంటే గ్రేట్ అని ఇన్ స్పెక్టర్ అంటాడు. దీంతో వేదని పోలీసులు విడుదల చేస్తారు. కారులో యష్, వేద ఇంటికి చేరుకుంటారు. అసలేం జరిగిందని యష్ మరో సారి అడుగుతాడు. నీ దగ్గర పని చేసే సారికని నువ్వు వేధించడం ఏంటి తను నీ మీద కేస్ పెట్టడం ఏంటి అని నిలదీస్తాడు. వేద కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్తాను ఇంట్లో అందరి ముందు అసలు ఏం జరిగిందో చెప్తానని అంటుంది. ఇంట్లోకి రాగానే ఎక్కడికి వెళ్లావమ్మ, నీ గురించి మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని రత్నం అడుగుతాడు. మావయ్య గారు మీరందరూ ఈ రోజు నన్ను చాలా ప్రశ్నలు అడుగుతారని నాకు తెలుసు. సమాధానాలు ఇవ్వడానికి నేను సిద్ధ పడ్డాను దానికి ఇంట్లో అందరూ ఉండాలి అని వేద అంటుంది. అందరూ ఇక్కడే ఉన్నాం కదా ఏం చెప్తావ్ చెప్పు అని మాలిని అడుగుతుంది. కైలాష్ కూడా ఉండాలని వేద చెప్తుంది.

మేము సినిమా నుంచి వచ్చేలోపు నువ్వు ఎక్కడికి వెళ్ళవ్ అని నిలదీస్తుంది. అడిగి అడిగి నేను అలిసిపోయాను ఏం జరిగిందో చెప్పు అని యష్ అంటాడు. ఈ ఇంట్లో నాకు ప్రమాదం ఉంది ఈ కైలాష్ వల్ల అని వేద చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. నా మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని చెప్పడంతో యష్ కైలాష్ ని కొట్టేందుకు వెళ్తుంటే కాంచన ఆపేస్తుంది. వేద అనవసరంగా ఇంట్లో గొడవలు పెట్టొద్దని మాలిక అనడంతో ఓర్చుకునే ఓపిక చచ్చిపోయిందని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. ఈ ఇంటి అల్లుడిగా నాకు ఒక అన్నయ్య గా చూశాను కానీ నా గురించి ఇంత నీచంగా ఆలోచిస్తాడాని నేననుకోలేదని వేద చెప్తుంది. మీకు తెలియని ఇంకొక విషయం ఏమిటంటే దుబాయి లో బిజినెస్ లో లాస్ వచ్చిందని పది లక్షలు అప్పు చేశానని చెప్పడం అంత అబద్దం. దుబాయి లో సారికని పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని వాడుకున్నాడు. సారిక ఒక్కటే కాదు ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నాడు. ఇతనొక కామ పిశాచి, ఒక మృగం అని అంటుంది. ఏయ్ ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావెంటీ నేనేమైనా పిచ్చి దాన్ని అనుకుంటున్నవా అని కాంచన వేదని తిడుతుంది. ‘ఈ నీచుడిని పిచ్చిగా ప్రేమిస్తున్నావ్ గుడ్డిగా నమ్ముతున్నావ్ ఈ రోజే వీడి నిజస్వరూపం నాకు తెలిసింది సారిక నాకు మొత్తం చెప్పింది. కానీ నేను ఇతనికి ఇంకో అవకాశం ఇవ్వాలని అనుకున్నాను. ఇతన్ని మారుద్దామని అనుకున్న, నాకు జరిగింది ఒక పీడ కల అని మర్చిపోదామని అనుకున్న మీకు మావయ్య గారికి తెలియకుండా ఆడవాళ్ళ మధ్యే సమస్య పరిష్కరించాలి అనుకున్నాను. కానీ ఇతను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాడు. అందరినీ సినిమాకి పంపించేసి ఒంటరిగా వచ్చే నాకోసం కాచుకుని కూర్చున్నాడు. ఎంత బతిమలాడిన వినకుండా నామీద పడ్డాడు’ అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. కాంచన వేదని తిడుతుంటే మాలిని అడ్డుపడుతుంది. అసలు నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్లావ్ అని మాలిని అడుగుతుంది. పోలీస్ స్టేషన్ కి అని చెప్తుంది.  

సీన్ కట్ చేస్తే వేద కైలాష్ మీద పోలీసులకి చెప్తుంది. సాక్ష్యం లేకుండా మీ మాటలు ఎలా నమ్మాలి అని ఆ పోలీస్ అడుగుతాడు. తన క్లినిక్ లో పని చేసే సారిక అందుకు సాక్ష్యం. తనని కైలాష్ వేధించాడని వేద చెప్తుంది. అక్కడకి వచ్చిన సారిక వేద మేడమ్ ఇంట్లో ఏవో గొడవలు జరుగుతున్నాయి కైలాష్ మీద మేడమ్ పగని పెంచుకుని అతన్ని ఇరికించాలని చూస్తుంది అందుకు నన్ను పావుగా వాడుకోవాలని చూస్తూ నన్ను వేధిస్తుంది అని చెప్తుంది. అది విని వేద బిత్తరపోయి సారిక అసలు నీకు ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నవని ప్రశ్నిస్తుంది. నాతో పోలీస్ స్టేషన్ కి నువ్వే వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడతావే అని నిలదిస్తుంది. కానీ సారిక వేదకి వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. కైలాష్ కి వ్యతిరేకంగా చెప్పకపోతే నన్ను జాబ్ లో నుంచి తీసేస్తానని ఇంకెక్కడ పని దొరక్కుండా చేస్తానని బెదిరించిందని సారిక పోలీసుకి చెప్తుంది. వేద మేడమ్ నుంచి నన్ను కాపాడండి అని సారిక పోలీసులని వేడుకుంటుంది.  దీంతో ఆ పోలీసు వేదని లాకప్ లో పెట్టమని చెప్తాడు.  

సారికని భయపెట్టి లొంగదీసుకుని నా మీద వ్యతిరేకంగా మాట్లాడేలా చేశాడని వేద చెప్తుంది. ఇక కాంచన నామీద ఎందుకు పగబట్టావ్ అని వేదని తిడుతుంటే కైలాష్ అడ్డుపడతాడు. ఈ ఫ్యామిలీ కోసం ఒక నింద పడటానికి నేను సిద్దమే అని నాటకమాడతాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని బెదిరిస్తూ కైలాష్ వెళ్ళి బట్టలు సర్దుకుంటుంటే కాంచన బతిమలాడుతుంది. ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాడు ఆపు తమ్ముడు అని యష్ ని అడుగుతుంది కానీ యష్ మౌనంగా ఉండిపోతాడు. తన మీద ఏదైనా అనుమానం ఉంటే ఫోన్ అక్కడే ఉంది చెక్ చేసుకోండి అనడం తో దాన్ని చూసిన కాంచన వేద చెంప పగలగొడుతుంది. ఈ వేద మా ఆయనకి బూతు మెస్సేజ్ పెట్టిందని ఇంట్లో అందరికీ ఫోన్ లోవీ చూపిస్తుంది. వాటిని చూసి వేద షాక్ అవుతుంది.

తరువాయి భాగంలో..

సులోచన యష్ ని నిలదీస్తుంది. ఇది మీ భార్య, తన గౌరవాన్ని కాపాడటం మీ బాధ్యత మాట్లాడండి అల్లుడు గారు అని యష్ ని అడుగుతుంది కానీ యష్ మౌనంగా ఉండిపోతాడు. దీంతో సులోచన వేదని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.

Published at : 06 Jul 2022 01:25 PM (IST) Tags: Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Today Episode ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu August 9th Update: బెడిసికొట్టిన ప్లాన్, జ్ఞానంబ కాళ్ళ మీద పడ్డ మల్లిక- జానకికి జ్ఞానంబ క్షమాపణలు

Janaki Kalaganaledu August 9th Update: బెడిసికొట్టిన ప్లాన్, జ్ఞానంబ కాళ్ళ మీద పడ్డ మల్లిక- జానకికి జ్ఞానంబ క్షమాపణలు

Karthika Deepam Serial ఆగస్టు 9:శోభతో పెళ్లికి సిద్ధమైన నిరుపమ్, స్వప్నకి షాకివ్వబోతున్న శౌర్య

Karthika Deepam Serial ఆగస్టు 9:శోభతో పెళ్లికి సిద్ధమైన నిరుపమ్, స్వప్నకి షాకివ్వబోతున్న శౌర్య

Gruhalakshmi August 9th Update: తులసి ఆంటీని 'అమ్మా' అని పిలవాలనుందన్న హనీ - సామ్రాట్ కలలో విహరిస్తున్న తులసి

Gruhalakshmi August 9th Update: తులసి ఆంటీని 'అమ్మా' అని పిలవాలనుందన్న హనీ - సామ్రాట్ కలలో విహరిస్తున్న తులసి

Guppedantha Manasu ఆగస్టు 9 ఎపిసోడ్: వసు ఊహల్లో రిషి - రచ్చ రచ్చ చేసిన సాక్షి, ప్రేమను గెలిపించుకునే ప్రయత్నంలో వసు

Guppedantha Manasu ఆగస్టు 9 ఎపిసోడ్: వసు ఊహల్లో రిషి - రచ్చ రచ్చ చేసిన సాక్షి, ప్రేమను గెలిపించుకునే ప్రయత్నంలో వసు

Devatha August 9th Update: రుక్మిణి, ఆదిత్యపై సత్య మనసులో అనుమాన బీజాన్ని వేసిన మాధవ- దేవికి మీసాలు పెడితే నీలాగే ఉందన్న దేవుడమ్మ

Devatha August 9th Update: రుక్మిణి, ఆదిత్యపై సత్య మనసులో అనుమాన బీజాన్ని వేసిన మాధవ- దేవికి మీసాలు పెడితే నీలాగే ఉందన్న దేవుడమ్మ

టాప్ స్టోరీస్

India vs Australia History: ఏ ఆట అయినా, ఏ టోర్నమెంట్ అయినా ఈ ఆస్ట్రేలియన్స్ వదలరా మనల్ని..?

India vs Australia History: ఏ ఆట అయినా, ఏ టోర్నమెంట్ అయినా ఈ ఆస్ట్రేలియన్స్ వదలరా మనల్ని..?

Parvathipuram AmmaVari Temple : ఇప్పల పోలమ్మ ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు | ABP Desam

Parvathipuram AmmaVari Temple : ఇప్పల పోలమ్మ ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు | ABP Desam

A little boy got angry on his teacher : గోదావరియాసలో మాస్టారిపై కంప్లైంట్ చేసిన పిల్లాడు | ABP Desan

A little boy got angry on his teacher : గోదావరియాసలో మాస్టారిపై కంప్లైంట్ చేసిన పిల్లాడు | ABP Desan

Tenali School Students : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం తెనాలి విద్యార్థులు | ABP Desam

Tenali School Students : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం తెనాలి విద్యార్థులు | ABP Desam