Brahmamudi Serial Today February 27th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు అపర్ణ వార్నింగ్ - తీరు మార్చుకోని రేఖ
Brahmamudi serial today episode February 27th: ఆపర్ణను బెదిరించి ఆస్థి మొత్తం సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసిన రేఖ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode: హాస్పిటల్‌లో సుభాష్ కు ట్రీట్‌మెంట్ చేస్తున్న డాక్టర్ అపర్ణ దగ్గరకు వచ్చి ఆయన ఇక లేవలేరని బెడ్‌కే పరిమితం అవుతారని చెప్తాడు. దీంతో అపర్ణ షాక్ అవుతుంది.
అపర్ణ: ఏదైనా ఆపరేషన్ చేసి ఆయన లేచేలా చేయండి డాక్టర్
డాక్టర్: చేయోచ్చు కానీ చాన్సెన్స్ చాలా తక్కువ
అపర్ణ: అయినా సరే చేయండి డాక్టర్ త్వరగా చేయండి.. ఖర్చు ఎంతైనా పర్వాలేదు డబ్బుల గురించి ఆలోచించొద్దు
డాక్టర్: మేం ఆలోచించేది డబ్బుల గురించి కాదు మేడం.. పేషెంట్ కండీషన్ గురించి ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి బయట పడ్డాడు ఇమీడియెట్‌గా ఆపరేషన్ చేయడం కుదరదు మేడం. కొంత టైం తీసుకుని చేయాలి. ఒకవేళ అలా చేసినా కూడా తిరిగి లేచి నడుస్తాడన్న గ్యారెంటీ లేదు మేడం ఐయామ్ సారీ
అని డాక్టర్ వెళ్లిపోతాడు. అపర్ణ దేవుడి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. ఏడుస్తూ..
అపర్ణ: ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా..? ఉంటావులే ఎందుకంటే నువ్వు అనుకున్నది పూర్తి చేశావు కదా..? అసలు మేం ఏం తప్పు చేశాము స్వామి ఇంత పెద్ద శిక్ష వేశావు.. మా కుటుంబంలో ఎవ్వరూ కూడా ఎవ్వరికీ కూడా ఇప్పటి వరకు మోసం కానీ ద్రోహం కానీ చేయలేదు.. ఉన్న ఆస్థిని కూడా పేదవాళ్లకు పంచేయాలనుకున్నాం కదా..? అలాంటిది ఇంత అన్యాయం చేయాలని ఎలా అనుకున్నావు నువ్వు. ఒక ఆడది నవమాసాలు మోయడాన్ని కానీ ఒక బిడ్డకు జన్మను ఇవ్వడాన్ని కానీ ఎప్పుడూ కష్టం అనుకోదు. పురిటి నొప్పులను కూడా సంతోషంగా భరిస్తుంది. కానీ కడుపు కోతను మాత్రం భరించలేదు స్వామి. అలాంటిది కొడుకుకు తలకొరివి పెట్టే దౌర్బ్యాగ్యాన్ని నా నుదుటన ఎందుకు రాశావు.. అంత పాపిస్టి దాన్నా నేను.. అన్ని పాపాలు చేశానా నేను. దీని కంటే నన్ను చంపేసి ఉండొచ్చు కదా స్వామి.. నన్ను బతికించి ఇంత పెద్ద శిక్ష వేశావేంటి..? ఈ భారాన్ని నేను చచ్చే వరకు ఎలా మోయగలను స్వామి..
అప్పుడే వెనక నుంచి రేఖ వస్తుంది. రేఖను చూసిన అపర్ణ షాక్ అవుతుంది.
రేఖ: అన్యాయం చేసింది దేవుడు కాదు అత్తయ్యా.. మా అమ్మ, అన్నయ్య.. ఆస్థి కోసం వాళ్లు ఇంతలా దిగజారిపోతారని అసలు అనుకోలేదు. తన కడుపున పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉంది. నాకు తెలుసు అత్తయ్యా దీన్ని జీర్ణించుకోవడం ఎంత కష్టమో.. నాకు తెలుసు అత్తయ్యా మీ గుండెల్లో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలుతున్నాయో.. కానీ ఏం చేయగలం లైఫ్ ముందుకు వెళ్లాలి.. కదా..? అత్తయ్యా మిమ్మల్ని నమ్ముకుని ఇద్దరు పిల్లలు ఉన్నారు.. పైకి లేవలేని పరిస్థితుల్లో మామయ్య ఉన్నారు. వాళ్లందరికి మీరే తోడుగా ఉండాలి అత్తయ్యా.. మీకు తోడుగా నేను ఉంటాను..
అపర్ణ: ఇంక చాలు ఆపు.. నిన్ను చూస్తుంటే.. మీ అమ్మే గుర్తుకు వస్తుంది. ఆ పసిపిల్లలు ప్రాణాలు కూడా తీద్దాం అనుకుంటున్నావా..? ఇంకొక్క మాట మాట్లాడినా ఇంకొక్క నిమిషం నా కళ్ల ముందు ఉన్నా నిన్ను చంపేస్తాను.. వెళ్లిపో ఇక్కడి నుంచి
అంటూ అపర్ణ తిట్టగానే రేఖ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక స్వరాజ్‌కు హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ జరుగుతుంది. చిన్న పిల్లాడు కదా షాక్‌లో ఉన్నాడు కోలుకోవడానికి టైం పడుతుంది అని చెప్తాడు డాక్టర్. ఇక రేఖ తన బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి వెంటనే తనను పెళ్లి చేసుకోమని చెప్తుంది. కట్ చేస్తే.. దుగ్గిరాల ఇంట్లో అపర్ణ, సుభాష్ ఏడుస్తూ కూర్చుని ఉంటారు. అప్పుడే రేఖ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తుంది. రేఖను చూసిన అపర్ణ, సుభాష్ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!























