అన్వేషించండి

Podharillu Serial Today Feb 27th: మాధవ్‌ ఆర్కిటెక్‌ కాదని మహాలక్ష్మీ కి తెలిసిపోయిందా...? శైలూ దగ్గర నుంచి కేశవ్ ఫోన్ ఎలా కొట్టేశాడు...?

Podharillu Serial Today Episode February 27th: మాధవ్‌ ఆర్కిటెక్‌ కాదని మహాలక్ష్మీ కి తెలిసిపోయిందా...? శైలూ దగ్గర నుంచి కేశవ్ ఫోన్ ఎలా కొట్టేశాడు...?

Podharillu Serial Today Episode: మహాను ఇంటర్వూ కోసం ఆఫీస్‌ వద్దకు తీసుకెళ్తాడు చక్రి....అక్కడ ఎంతసేపటికీ వాళ్ల ఫ్రెండ్ ఫోన్ ఎత్తకపోవడంతో  చిరాకుపడతాడు. చివరికి  ఫోన్ లిప్ట్‌ చేసిన చక్రి ఫ్రెండ్‌...మానాన్న విదేశాల నుంచి సడెన్‌గా వచ్చాడని అందుకే ఇంటర్వూ నిర్వహించలేనని చెబుతాడు. ఏదోవిధంగా  ఇంటర్వూ చేయమని కోరగా...నా వల్ల కాదని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. వీడు సడెన్‌గా హ్యాండ్ ఇచ్చాడేంటని చక్రి బాధపడతాడు. అసలే ఉదయం నుంచి ఉద్యోగం కోసం తహతహలాడుతున్న  మహాకు ఈ విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటాడు. ధైర్యం చేసి మహా దగ్గరకు వెళ్లి ఇంటర్వూ చేసేవాడు ఇంకారాలేదంటా మనం తిరిగి వెళ్లిపోదామని అంటాడు. అయితే అతను వచ్చే వరకు మనం  ఎదురుచూద్దామని....మహా అంటుంది.నేనే చెప్పిన టైంకు రాకుండా రెడీ అవుతూ లేటు చేశానని నావల్లే అతను బయటకు వెళ్లిపోయాడని బాధపడుతుంది. చక్రి ఎంత చెప్పినా వినకుండా సాయంత్రం వరకు ఎదురుచూస్తుంది. ఇక ఇవాళ ఇంటర్వూ లేనట్లేనని  చెప్పి మహాను తీసుకుని చక్రి ఇంటికి వెళ్లిపోతాడు.
                 

సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైపోయిన శైలూ...తన ఫాలోవర్స్ కోసం ఓ ప్రాంక్‌ వీడియో చేయాలని చూస్తుంటుంది.  ఎవడినైనా బకరా చేద్దామని వాళ్ల ఫ్రెండ్‌కు చెబుతుంది. ఆ ప్లాన్ మొత్తం చాటుగా విన్న కేశవ్‌....హెల్మెట్‌ పెట్టుకుని వాళ్ల ముందుకు వెళ్తాడు. ఎవరో అనుకుని శైలూ మీ ఫోన్ కిందపడిపోయిందండీ  అని అనగానే  కిందకు దిగి ఫోన్‌ కోసం కేశవ్‌ వెళ్లగానే....శైలూ ఫ్రెండ్‌ అతను వేసుకుని వచ్చిన స్కూటీ ఎత్తుకుని పోతుంది. ఇదంతా  చాటుగా  పెట్టిన సెల్‌ఫోన్ కెమెరాతో రికార్డు చేస్తున్నారని ముందుగానే  తెలుసుకున్న  కేశవ్‌...ఆ ఫోన్ లాక్కుని బెదిరిస్తాడు. మీరు ఎత్తుకెళ్లిన బండి ఎస్‌ఐ గారిదని చెబుతాడు. దీంతో భయపడిపోయిన శైలూ...తన ఫ్రెండ్‌కు ఫోన్ చేసి బండి తీసుకుని రమ్మని చెబుతుంది. గతంలో గిప్ట్‌ పగులగొట్టిన డబ్బులుతోపాటు...మొన్న బండికి డాష్‌ఇచ్చి  చేసిన డ్యామేజీ డబ్బులు   20వేలు ఇచ్చి ఫోన్ తీసుకెళ్లమని చెప్పి ఫోన్  తీసుకుని కేశవ్ వెళ్లిపోతాడు.
                       

 మాధవ్‌ చూసిన  ఇంటర్వూ తన వల్లే హాజరుకాలేకపోయానని  మహాలక్ష్మీ చాలా బాధపడుతుంది. పెద్ది వస్తే ఏం చెప్పాలా   అని చాలా ఇబ్బందిపడుతుంది కన్నా మిరపకాయ బజ్జీలు తీసుకుని తెచ్చి ఇచ్చినా... తెలియకుండానే కారం తినేస్తూ ఉండటం చూసి కన్నా కూడా భయపడిపోతాడు. ఇంతలో బయట నుంచి వచ్చిన మాధవ్ ఏమైందని చెబితే...మీరు ఎంతో కష్టపడి చూసిన ఇంటర్వూకు నేను  టైంకు వెళ్లలేకపోయానని...అందుకే వాళ్లు ఇంటర్వూ చేయలేదని చెబుతుంది. దీంతో మహాకు నిజం చెప్పాలని డిసైడ్‌ అయిపోయిన మాధవ్‌...ఆమెను తీసుకుని తాను పనిచేసే చోటుకు తీసుకెళ్తాడు. నేను నువ్వు అనుకున్నట్లు నిజంగా ఆర్కిటెక్‌ను కాదని సాధారణ మేస్త్రీని అని చెబుతాడు. నువ్వు వెళ్లిన ఇంటర్వూ కూడా నేను చూడలేదని అంటాడు.

నువ్వు నా గురించి అపార్థం చేసుకోకూడదనే ఇదంతా చెబుతున్నానని అంటాడు. నన్ను నీ దగ్గర తక్కువ చేసి చూపించకూడాదనే  చక్రి  అబద్ధం చెప్పి ఉండొచ్చని చెబుతాడు. దీంతో మహా చాలా బాధపడుతుంది.ఆ చక్రి పని నేను చెబుతానులే అని చెప్పి వెళ్లిపోతుంది. చక్రికి ఫోన్ చేసి బయటకు పిలుస్తుంది. బాగా కోపంగా ఉండటం చూసి ఏదో జరిగి ఉంటుందని చక్రి భయపడిపోతాడు. ఏం జరిగిందని అడగ్గా...మీ అన్నయ్య ఆర్కిటెక్‌ అని ఎందుకు అబద్ధం చెప్పావని నిలదీస్తుంది. ఇలా ఎన్ని అబద్ధాలు చెబుతావని గట్టిగా కోప్పడి వెళ్లిపోతుంది.                  

కేశవ్‌ ఫోన్ తీసుకని వెళ్లిపోవడంతో  ఇంట్లో  ఏం చెప్పాలో తెలియక భయపడుతున్న శైలూకు ఓ ఐడియా వస్తుంది. కొత్త   ఫోన్ కొంటున్నామని చెప్పి షాపుకు వెళ్లి అక్కడ తనలాంటిదే డమ్మీ ఫోన్  దొంగలించుకుని తీసుకుని వస్తుంది. రేపు ఎలాగైనా   ఆ కేశవ్ దగ్గర నుంచి తన ఫోన్ తీసుకోవాలని భావిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget