అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  ECI | ABP NEWS)

Meghasandesham Serial Today  October 7th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి మీద నెక్లెస్‌ దొంగతనం మోపిన అపూర్వ – భూమి సంగతి చెబుతానన్న పూరి

Meghasandesham Today Episode:  శరత్‌చంద్ర, ఇందుకు గిఫ్టుగా ఇచ్చిన నెక్లెస్‌ ను భూమి బ్యాగులో పెట్టి ఇంట్లోంచి తరిమేయాలని ప్లాన్‌ చేస్తుంది అపూర్వ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode: చెర్రి రాసిన లవ్‌ లెటర్‌ నక్షత్ర కు దొరుకుతుంది.  చెర్రి చూసి భయపడతాడు. పోయి పోయి ఈ బ్రహ్మరాక్షసి కంట్లో పడిందే.. చదువుతుంది లెటర్‌ అత్తయ్యకు కానీ చెప్పేస్తుందా? అని భయపడుతుంటాడు చెర్రి. ఇంతలో నక్షత్ర, చెర్రికి ఏంటిది అన్నట్లు సైగ చేస్తుంది. చెర్రి దగ్గరకు వెళ్లగానే నీ జీవితంలో ఏదైనా మంచి పని చేస్తావని అసలు అనుకోలేదు అంటుంది నక్షత్ర. దీంతో చెర్రి షాక్‌ అవుతాడు. మీ ఇద్దరి జంట సూపర్‌ గా ఉంటుంది. ఆలోచించకుండా ప్రోసీడ్‌ అయిపో.. వీలైతే మీ లవ్‌కు నేనే హెల్ప్‌ చేస్తాను. అని చెప్పడంతో చెర్రి హ్యాపీగా వెళ్లిపోతాడు. నా బావకు నాకు మధ్యలో దీన్ని ఎం చేయాలా అనుకున్నాను. ఇప్పుడు నా లైన్‌ క్లియర్‌ అనుకుంటుంది నక్షత్ర. తర్వాత శరత్‌ చంద్ర ఇందు దగ్గరకు వెళ్తాడు.

శరత్‌: అమ్మా ఇందు ఇదిగో ఇది నీకోసమే.. తీసుకోమ్మా..

మీరా: ఏంటన్నయ్యా అది

శరత్‌: చూడమ్మా..

ఇందు: డైమండ్‌ నెక్లెస్‌..   మామయ్యా నాకెందుకు

శరత్‌: నా మేన కోడలుకు నేను ఇస్తున్న గిఫ్ట్‌ అమ్మా ఇది.  పెళ్ళిలో నువ్వు గ్రాండ్‌ గా కనిపించాలి కదా? నువ్వు కూడా నా బిడ్డ లాంటి దానివే కదమ్మా నీకు ఇవ్వకపోతే ఎవరికిస్తాను.

మీరా: మా అన్నయ్య నీకు అంత ప్రేమగా ఇస్తుంటే ఏంటి ఎందుక అంటావేంటి? పెళ్లిలో పెట్టుకుందువులే తీసుకో..

అపూర్వ: భూమి నీ దరిద్రం డైమండ్‌ లా మెరిసిపోతుంది. నిజం చెప్పి ఇంట్లోకి ఎలా రావాలా అని నువ్వు చూస్తుంటే.. నిన్ను పర్మినెంట్‌ గా బయటకు పంపించే దారి మీ నాన్నకు నువ్వే చూపిస్తున్నావు. కాసేపట్లో అది కనిపించకుండా  పోతుంది. నీ బ్యాగులో దొరుకుతుంది. నువ్వే దొంగతనం చేశావని మా బావను నమ్మిస్తాను.

 అని అపూర్వ భూమిని చూస్తూ కోపంగా మనసులో అనుకుంటుంది. మరోవైపు భోజనం చేస్తు్న్న పూరి భూమి, నక్షత్రల గురించి ఆలోచిస్తుంది. అసలు భూమి అన్నయ్య దగ్గరకు ఎందుకు వెళ్లింది. అక్కడికి నక్షత్ర ఎందుకు వెళ్లింది అని ఆలోచిస్తుంది. భూమి నీ దగ్గరకు వచ్చిందా? అంటూ అడుగుతుంది. అవునని వచ్చిందని నా చేతులు పనికిరాకుండా చేసి తనే చేతితో తినిపించింది. అని చెప్పగానే పూరి ఏదో జరుగుతుంది అని అనుమానిస్తుంది. శారద కూడా భూమిని అనుమానిస్తుంది. మరోవైపు భూమి వెళ్లిపోతుంది.

భూమి: అంకుల్‌ వెళ్లి వస్తాను.

శరత్‌: జాగ్రత్తగా వెళ్లి రామ్మా.. సంగీత్‌ ఇంత బాగా జరిగిందంటే అందుకు కారణం నువ్వేనమ్మా..

భూమి: మన ఇంటి ఫంక్షన్‌ కదా అంకుల్‌. పైగా ఈ ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం.

మీరా: అన్నయ్య తెచ్చిన నెక్లెస్‌ ఏంత బాగుందో.. ఒక్కసారి చూస్తాను. అన్నయ్యా.. ఇందుకోసం మీరు ఇచ్చిన నెక్లెస్‌ కనబడటం లేదు.

ప్రసాద్‌: మీరా నువ్వే కదా లోపల పెట్టావు.

మీరా: నేనే తీసుకెళ్లాను అండి. లోపల పెడుతూ ఒకసారి చూద్దామని తెరిస్తే నెక్లెస్‌ లేదు.

అపూర్వ: బావ ఇచ్చిన వస్తువు కనిపించడం లేదంటే ఎవ్వరినీ క్షమించకూడదు. అందర్నీ చెక్‌ చేయాల్సిందే.

ప్రసాద్‌: ఇప్పుడు అందర్నీ చెక్‌ చేస్తే వచ్చిన వాళ్లందరూ అవమానంగా ఫీలవుతారుగా.

ఇందు: మా నాన్నకు లేనంత ప్రేమతో మా మామయ్య నాకు గిఫ్టుగా ఇచ్చిన నెక్లెస్‌ అది. అయినా ప్రేమల గురించి మా నాన్నకేం తెలుసులే. అత్తయ్యా నా నెక్లెస్‌ పోకుండా చూడండి.

అని చెప్పగానే మీ అందరిని చెక్‌ చేస్తున్నందుకు నన్ను క్షమించండి అని అపూర్వ అందరినీ చెక్‌ చేయమని మీరాకు చెప్తుంది. మీరా భూమిని తప్పా అందరినీ చెక్‌ చేస్తుంది. ఎవ్వరి దగ్గర లేదని చెప్తుంది. దీంతో అపూర్వ భూమిని చెక్‌ చేశావా అంటుంది. శరత్‌చంద్ర భూమిని చెక్‌ చేయడం ఏంటని అంటాడు. పర్వాలేదు అంకుల్‌ చెక్‌ చేయనివ్వండి అంటూ తన బ్యాగ్‌ ఇస్తుంది. మీరా చెక్‌ చేయగానే అందులోంచి నెక్లెస్‌ బయటపడుతుంది. అందరూ షాక్‌ అవుతారు. శరత్‌ చంద్ర కోపంగా తిడుతూ అడిగితే నేనే ఇచ్చేవాణ్ని కదా? దొంగతనం చేస్తావా? అంటూ కోప్పడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagarjuna statement: నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ వ్యాఖ్యలు అనుచితం- చర్యలు తీసుకోవాలన్న నాగార్జున
Nagarjuna statement: నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ వ్యాఖ్యలు అనుచితం- చర్యలు తీసుకోవాలన్న నాగార్జున
Nobel Prize 2024: భౌతికశాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ బహుమతి, ఈ ఏడాది విజేతలుగా జాన్ ఎఫ్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్
భౌతికశాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ బహుమతి, ఈ ఏడాది విజేతలుగా జాన్ ఎఫ్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్
How BJP won in Haryana Elections :  బీజేపీ ఊస్టింగ్ ఖాయమని తేల్చిన ఎగ్జిట్ పోల్స్ - కానీ ఫలితం రివర్స్ - హర్యానాలో ఏం  జరిగింది ?
బీజేపీ ఊస్టింగ్ ఖాయమని తేల్చిన ఎగ్జిట్ పోల్స్ - కానీ ఫలితం రివర్స్ - హర్యానాలో ఏం జరిగింది ?
Jammu Kashmir Election 2024:  నాడు అయోధ్యలో నేడు కశ్మీర్‌లో మోదీనే పడగొట్టిన రాహుల్ గాంధీ
నాడు అయోధ్యలో నేడు కశ్మీర్‌లో మోదీనే పడగొట్టిన రాహుల్ గాంధీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISRO News: 8 ఏళ్ల క్రితం నింగిలోకి ఇస్రో రాకెట్ - ఇప్పుడు భూమ్మీద పడ్డ శకలాలురూ.6.6 కోట్ల నోట్ల కట్టలతో అమ్మవారికి అలంకరణరెండు కీలకమైన ఘట్టాల తర్వాత బీజేపీకి తలబొప్పి కట్టిందేంటీ?PM Modi Yogi Pawan Kalyan Hindutva Speech | హిందూత్వ నినాదంతో మోదీ,యోగి బాటలో పవన్ కళ్యాణ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagarjuna statement: నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ వ్యాఖ్యలు అనుచితం- చర్యలు తీసుకోవాలన్న నాగార్జున
Nagarjuna statement: నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ వ్యాఖ్యలు అనుచితం- చర్యలు తీసుకోవాలన్న నాగార్జున
Nobel Prize 2024: భౌతికశాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ బహుమతి, ఈ ఏడాది విజేతలుగా జాన్ ఎఫ్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్
భౌతికశాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ బహుమతి, ఈ ఏడాది విజేతలుగా జాన్ ఎఫ్ హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్
How BJP won in Haryana Elections :  బీజేపీ ఊస్టింగ్ ఖాయమని తేల్చిన ఎగ్జిట్ పోల్స్ - కానీ ఫలితం రివర్స్ - హర్యానాలో ఏం  జరిగింది ?
బీజేపీ ఊస్టింగ్ ఖాయమని తేల్చిన ఎగ్జిట్ పోల్స్ - కానీ ఫలితం రివర్స్ - హర్యానాలో ఏం జరిగింది ?
Jammu Kashmir Election 2024:  నాడు అయోధ్యలో నేడు కశ్మీర్‌లో మోదీనే పడగొట్టిన రాహుల్ గాంధీ
నాడు అయోధ్యలో నేడు కశ్మీర్‌లో మోదీనే పడగొట్టిన రాహుల్ గాంధీ
Crime News: పిఠాపురంలో దారుణం - బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం
పిఠాపురంలో దారుణం - బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం
Haryana Election 2024 Results : పడిలేచిన కెరటంలా బీజేపీ- హర్యానాలో హ్యాట్రిక్‌ దిశగా కమలం - అనూహ్యంగా పడిపోయిన కాంగ్రెస్‌!
పడిలేచిన కెరటంలా బీజేపీ- హర్యానాలో హ్యాట్రిక్‌ దిశగా కమలం - అనూహ్యంగా పడిపోయిన కాంగ్రెస్‌!
Director Ruthvik Yelagari: ప్రభాస్ పాన్ ఇండియా సినిమాకు పని చేసిన కుర్రాడు ఓటీటీ సినిమా 'తత్వ' దర్శకుడని మీకు తెలుసా?
ప్రభాస్ పాన్ ఇండియా సినిమాకు పని చేసిన కుర్రాడు ఓటీటీ సినిమా 'తత్వ' దర్శకుడని మీకు తెలుసా?
Julana Assembly seat result: జులానాలో మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం- సెటైర్లు వేసిన బ్రిజ్‌భూషణ్
జులానాలో మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం- సెటైర్లు వేసిన బ్రిజ్‌భూషణ్
Embed widget