అన్వేషించండి

Meghasandesam Serial Weekly Roundup: ‘మేఘసందేశం’ సీరియల్‌: గడచిన వారం మేఘసందేశం సీరియల్‌లో ఏ జరిగిందో మొత్తం ఏపిసోడ్స్‌ హైలెట్స్‌ పై  ఓ లుక్కేద్దాం.

Meghasandesam serial weekly episode August 4th to 9th: మేఘసందేశం సీరియల్‌ ఈ వారంలో చాలా ఆసక్తికరంగా జరిగింది. ఆగస్టు 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Meghasandesam Serial weekly Episode: అపూర్వ భూమికి పెళ్లి చేయాలని తెలిసిన సంబంధ చూద్దాం అంటుంది. ఎవరున్నారు తెలిసిన వాళ్లు అని శరత్‌చంద్ర అడిగితే మీ ప్రెండ్‌ వాళ్ల అబ్బాయి ఉదయ్‌ ఉన్నాడు కదా అని చెప్తుంది. దీంతో అపూర్వ వాళ్లకు ఫోన్‌ చేసి భూమి, గగన్‌ల గురించి అన్ని విషయాలు చెప్తుంది. అయినా సరే భూమిని పెళ్లి చేసుకోవాడనికి ఉదయ్‌ ఒప్పుకుంటాడు. దీంతో అందరినీ ఇంటికి పిలుస్తాడు శరత్‌చంద్ర. విషయం మొత్తం తెలుసుకున్న భూమి ఇంట్లో ఉండకుండా గగన్‌ వాళ్ల ఇంటికి వెళ్తుంది.

ఇంటికి వచ్చిన భూమిని చూసిన శారద టెన్షన్‌ పడుతుంది. అప్పుడే గగన్‌ వచ్చి శరత్‌ చంద్రకు ఫోన్‌ చేసి కూతురుకు పెళ్లి ఇష్టమో కాదో తెలుసుకోకుండా బలవంతంగా పెళ్లి చేస్తావా..? నీ కూతరు ఇప్పుడు నా ఇంట్లో ఉందని చెప్తాడు. గగన్‌ కాల్‌ కట్‌ చేశాక నాన్నకు ఎందుకు కాల్‌ చేశావు అని భూమి అడగ్గానే.. భూమిని తిట్టి ఇంట్లోంచి వెళ్లగొడతాడు గగన్‌. తర్వాత శివను కాలేజీలో జాయిన్‌ చేస్తాడు గగన్‌.

నక్షత్ర ఉదయమే లేచి పూజ చేసి చెర్రి మీద ప్రేమ ఉన్నట్టు అందరి ముందు నటిస్తూ లోపలికి వెళ్లి నిద్రపోతున్న చెర్రి ముఖం మీద కాఫీ పోస్తుంది. దీంతో చెర్రి గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకు కేపీ వచ్చి ఏమైందని అడుగుతాడు. జరిగిన విషయం చెప్పగానే కేపీ బాధపడతాడు. తర్వాత ఉదయ్‌, శరత్‌ చంద్ర ఇంటికి వస్తుంటే.. కారు ట్రబుల్‌ ఇస్తుంది. ఇంతలో గగన్‌ కారులో వస్తుంటే లిఫ్ట్‌ అడిగి ఎక్కుతాడు. ఎక్కడికి అని గగన్‌ అడిగితే శరత్‌ చంద్ర ఇంటికి అని చెప్తాడు. దీంతో గగన్‌ వివరాలు అడగ్గానే ఆ ఇంటికి కాబోయే అల్లుడిని అని భూమిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్తాడు. దీంతో భూమికి పెళ్లి ఇష్టమేనా అని గగన్‌ అడగ్గానే.. వెంటనే ఉదయ్‌ శరత్‌ చంద్రకు ఫోన్‌ చేసి భూమితో పెళ్లి ఇష్టమేనా అని అడుగుతాడు. శరత్‌ చంద్ర ఇష్టమే అని చెప్పు అనగానే భూమి ఇష్టమే అని చెప్తుంది. దీంతో గగన్‌ బాధపడతాడు. తర్వాత ఇంటికి వెళ్లి బెడ్‌రూంలో పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తాడు గగన్‌. అది చూసిన శివ బాధపడుతూ వెంటనే భూమికి ఫోన్‌ చేసి విషయం మొత్తం చెప్పేస్తాడు. శివ.. గగన్‌ పరిస్థితి చెప్పగానే భూమి ఏడుస్తుంది.

శివ తీసుకెళ్లిన బొమ్మ కోసం అపూర్వ, సుజాతను గగన్‌ ఇంటికి పంపిస్తుంది. ఇంటికి వచ్చిన సుజాతను చూసిన శారద షాక్‌ అవుతుంది. ఎందుకు వచ్చారని అడుగుతుంది. విబూది ఇద్దామని వచ్చాను. ఈ విబూది ఇల్లంతా చల్లితే ఇప్పుడున్న సమస్యలు తీరిపోతాయి అంటూ బొమ్మ కోసం విబూది చల్లుతూ ఇల్లంతా వెతుకుతుంది. శారద కిచెన్‌లో కాఫీ చేస్తుంది. సుజాతకు బొమ్మ కనిపించగానే తీసుకుని వెళ్లిపోతుంది. గేటు దగ్గరకు వెళ్లగానే.. గగన్‌ వస్తాడు. సుజాత చేతిలో బొమ్మ తీసుకుని మా ఇంటికి ఎందుకు వచ్చావు.. అంటూ తిట్టి పంపిస్తాడు.

ఇక కాలేజీకి వెళ్తున్న శివను బయటకు తీసుకెళ్లి ఫోన్‌ కొనిస్తుంది భూమి. త్వరలోనే అకౌంట్‌ ఓపెన్‌ చేసి ఖర్చులకు డబ్బులు వేస్తాను అని చెప్తుంది. ఇంతలో దూరం నుంచి రౌడీలతో రెడీగా ఉన్న కావ్య, భూమిని చంపాలని ప్లాన్‌ చేస్తుంది. రౌడీలకు భూమిని చూపించి వెంటనే కారుతో ఢీకొట్టమని చెప్తుంది. రౌడీలు వెనక నుంచి వెళ్లి భూమిని ఢీకొట్టి వెళ్లిపోతారు. శివ ఏడుస్తూ భూమిని హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. గగన్‌ వాళ్లకు ఫోన్‌ చేసి చెప్తాడు. హాస్పిటల్‌లో ఉన్న భూమి దగ్గరకు శారద, గగన్‌ వస్తారు. ఇంతలో అక్కడ ఒక పాప రిషిత.. భూమిని చూసి దేవుడు ఆమెను బతికించాలని అందుకోసం తాను డాన్స్‌ చేస్తానని డాన్స్‌ చేస్తుంది.  ఆ పాప డాన్స్‌ చూసి అందరూ మెచ్చుకుంటారు. ఇంతలో నర్స్‌ వచ్చి భూమి కళ్లు తెరిచిందని ఇక ఔటాప్‌ డేంజర్‌ అని చెప్తుంది. తర్వాత గగన్‌ అక్కడి నుంచి శారద, శివను తీసుకుని వెల్లిపోతాడు.

శరత్‌ చంద్ర, ఉదయ్‌ తో కలిసి హాస్పిటల్ కు వస్తాడు. వాళ్లతో అకాడమీ ఓపెనింగ్‌ రేపే ఉంది ఎలా అని అడుగుతుంది. ఆ గగన్‌ తో కలిసి నువ్వు ఓపెన్‌ చేయడం నాకు ఇష్టం లేదంటాడు శరత్‌ చంద్ర. కానీ తనకు ఇష్టమేనని ఉదయ్‌ చెప్తాడు. దీంతో ఈ వారం మేఘసందేశం సీరియల్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today Nov 24: కేదార్‌ను వారసుడిగా ప్రకటించిన సుధాకర్‌..తాగిన మత్తులో మాట్లాడాటంటూ అందరికీ చెప్పిన యువరాజు
జగద్ధాత్రి సీరియల్:కేదార్‌ను వారసుడిగా ప్రకటించిన సుధాకర్‌..తాగిన మత్తులో మాట్లాడాటంటూ అందరికీ చెప్పిన యువరాజు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి సంతకాన్ని ఆపేసిన పద్మాక్షి! అసలైన వారసుడు ఉన్నాడంటూ ట్విస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి సంతకాన్ని ఆపేసిన పద్మాక్షి! అసలైన వారసుడు ఉన్నాడంటూ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today November 24th: నిండు మనసులు: సంతోషంగా సిద్ధూ, ప్రేరణ! రాజశేఖరం మాస్ వార్నింగ్! ప్రేరణను విజయానంద్ చంపేస్తాడా!
నిండు మనసులు: సంతోషంగా సిద్ధూ, ప్రేరణ! రాజశేఖరం మాస్ వార్నింగ్! ప్రేరణను విజయానంద్ చంపేస్తాడా!
Godavari Serial Today November 24th: 'గోదావరి' సీరియల్: అందరి ముందు మరోసారి పెళ్లి చేసుకున్న సంజు, జాను! మూడు ముళ్లని జాను ఒప్పుకుంటుందా!
'గోదావరి' సీరియల్: అందరి ముందు మరోసారి పెళ్లి చేసుకున్న సంజు, జాను! మూడు ముళ్లని జాను ఒప్పుకుంటుందా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
This Week Movies : శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
TVK MLA Arul Vignesh: మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం!
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Gaganayan Mission: గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
Embed widget