Meghasandesam Serial Today September 27th: ‘మేఘసందేశం’ సీరియల్: ముడుపు కట్టిన గగన్ - శారద బాడీలోంచి బుల్లెట్ తీసిన డాక్టర్లు
Meghasandesam serial today episode September 27th: స్వామిజీ చెప్పినట్టే గగన్ చేస్తాడు. తన కష్టార్జితంతో డబ్బులు సంపాదించి శివుడికి ముడుపు కట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: హాస్పిటల్ లో ముసలావిడ చెప్పినట్టు గగన్ శివాలయానికి వెళ్లి అక్కడ పూజలు చేస్తాడు. దేవుడి ముందు కూర్చుని శారదను తలుచుకుని ఎమోషనల్ అవుతుంటాడు.
గగన్: స్వామి నువ్వు ఉన్నావని నేను ఏనాడు నమ్మలేదు. నువ్వుంటే మాకు ఇన్ని కష్టాలు ఇచ్చే వాడివి కాదు నువ్వొక రాయివి మాత్రమే అనుకున్నాను. నేను ఎప్పుడూ నిన్ను నోరారా పిలిచింది లేదు చెయ్యోత్తి మొక్కింది లేదు. కానీ మా అమ్మ నువ్వు ఉంటావు.. మమ్మల్ని కాపాడతావు అని నమ్మింది. కానీ మా అమ్మ..
భూమి: బావ.. ఆగు బావ..
గగన్: హాస్పిటల్ లో ఉంది స్వామి.. బతుకుతుందో లేదో అంటున్నారు స్వామి.. ఈరోజు నీ దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాను. అడుక్కుంటున్నాను. నాకు మా మీద కోపం ఉంటే నాకు ఏ శిక్షైనా వేయి స్వామి… మా అమ్మ లేకుండా నేను బతకలేను పరమేశ్వరా మా అమ్మ మీద రక్షించే.. నువ్వు బ్రమవు కాదు నువ్వు ఉన్నావన్న మా అమ్మ నమ్మకాన్ని రక్షించు..
అంటూ గగన్ తల దేవుడి ముందు కొట్టుకుంటుంటే.. ఇంతలో ఒక అఘోరి వస్తాడు. గగన్ ను ఆపి నీ తెలివి తేటలతో కాకుండా నవ్వెవరో చెప్పకుండా నీ కష్టార్జితాన్ని సాయంత్రం వరకు సంపాదించి ఆ శివుడికి ముడుపు కట్టు అని చెప్పగానే.. గగన్ పని కోసం రోడ్డు మీదకు వెళ్తాడు. గగన్‌కు ఎవ్వరూ పని ఇవ్వరు దీంతో గగన్ ఏడుస్తూ వెళ్తుంటాడు. వెనకే భూమి వెళ్తుంది. ఇద్దరూ వెళ్తుండగా ఒక దగ్గర కారు ఆగిపోయి ఉంటుంది. కారులోని వ్యక్తులు కారు పక్కనే నిల్చుని ఉంటారు. గగన్ వాళ్లను చూసి దగ్గరకు వెళ్తాడు.
గగన్: ఏమైంది.. ఇక్కడ నిలబడ్డారు..
వ్యక్తి: మా కారు టైర్ పంక్చర్ అయింది. స్టెపినీ ఉంది కానీ మార్చడం మాకు రాదు. అందుకే ఏం చేయలేక ఇలా నిలబడి చూస్తున్నాము..
గగన్: సార్ మీరు ఏమీ అనుకోకపోతే ఆ స్టెపినీ నేను మార్చొచ్చా..?
వ్యక్తి: మీరు మారిస్తే మాకు సంతోషమే.. కానీ మీకు మార్చడం వచ్చా..?
గగన్: వచ్చు సార్ నేను స్టెపినీ మారుస్తాను.. ఇంతకీ ఎక్కడుంది స్టెపినీ
వ్యక్తి: అదిగో వెనక ఉంది..
అంటూ ఆ వ్యక్తి స్టెపినీ చూపించగానే.. గగన్ స్టెపినీ తీసుకుని కారుకు ఉన్న టైర్ మార్చి స్టెపినీ వేస్తాడు. గగన్ స్టెపినీ మార్చడంతో చేతులకు గాయాలు అవుతాయి. ఇక పని అయిపోయాక
గగన్: సార్ అయిపోయింది. స్టెపినీ మార్చేశాను.
వ్యక్తి: చాలా థాంక్స్ అండి..
గగన్: సార్ డబ్బులు..
అంటూ గగన్ అడగ్గానే.. ఆ వ్యక్తి వంద రూపాయలు తీసి గగన్‌కు ఇస్తాడు. దీంతో గగన్ ఏడుస్తూనే ఎమోషనల్ అవుతాడు. తర్వాత టిఫిన్ సెంటర్ దగ్గర ప్లేట్స్ కడిగేస్తాడు. మరో దగ్గర మూటలు మోస్తాడు.. మరోచోట షూస్‌కు పాలిష్ చేస్తాడు. మరోవైపు హాస్పిటల్ లో శారదకు ఆపరేషన్ చేస్తుంటారు. గగన్ శివాలయానికి వెళ్లి స్నానం చేసి శివుడికి పూజ చేసి తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో ముడుపు కట్టేస్తాడు. ఇక హాస్పిటల్ లో శారద బాడీలోంచి బుల్లెట్ బయటకు తీస్తారు డాక్టర్లు.. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















