(Source: ECI | ABP NEWS)
Meghasandesam Serial Today September 21st: ‘మేఘసందేశం’ సీరియల్: రత్నను అండర్ గ్రౌండ్‌కు పంపిన అపూర్వ – అపూర్వ శవయాత్రకు సుజాత ఏర్పాట్లు
Meghasandesam serial today episode September 21st: శారద వీడియో చూసిందని తెలియగానే అపూర్వ శవయాత్రకు ఏర్పాట్లు చేస్తుంది సుజాత. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: శారదను షూట్ చేసిన వాడిని అపూర్వ, రత్న వెళ్లి కలుస్తారు. కంగారుగా కారు దిగిన అపూర్వ ఆ రౌడీ దగ్గరకు వెళ్లి దాన్ని షూట్ చేశావా..? చెప్పు షూట్ చేశావా లేదా చెప్పరా అని అడుగుతుంది.
రౌడీ: షూట్ చేశాను.. బుల్లెట్ మెడపై దిగింది.
అపూర్వ: కెమెరా ఎక్కడా ఆ కెమెరా ఎక్కడుందిరా.. త్వరగా ఇవ్వు..
రౌడీ: నేను చెప్పేది కొంచెం వినండి మేడం..
అపూర్వ: ఏంటో త్వరగా చెప్పు..
రౌడీ: మేడం నేను ఆవిడను కెమెరా ఎక్కడ అని అడిగాను చెప్పలేదు.. బెదిరించాను అయినా చెప్పలేదు.. దాంతో షూట్ చేశాను. ఆవిడ చేతిలో ఉన్న కెమెరా గాల్లోకి ఎగిరింది. అది ఎక్కడ పడిందో తెలియలేదు..
అపూర్వ: అది వెతికి అయినా తీసుకురావాలి కదా వెధవ.. అక్కడే వదిలేసి వస్తే ఎలా..?
రౌడీ: నేను షూట్ చేశాక కెమెరా వెతుకుతుంటే.. ఒక అమ్మాయి వచ్చి నా మీదకు శివంగిలా దూకింది మేడం.. వెనక నుంచి నా తల మీద కొట్టింది. ఒక్కసారిగా నా కళ్లు బైర్లు కమ్మాయి మేడం అందుకే తప్పించుకుని వచ్చాను మేడం..
అపూర్వ: మరి ఆ శారద చనిపోయిందా..?
రౌడీ: నేను చూడలేదు మేడం.. కచ్చితంగా చచ్చిపోయిందనే అనుకుంటున్నాను మేడం..
అపూర్వ: నీ ఊహాగానాల గురించి నేను అడగడం లేదు.. చచ్చిందా..? లేదా..? అది క్లారిటీ కావాలి నాకు ..
రౌడీ: తెలియదు మేడం..
అపూర్వ కోపంగా రౌడీని కొడుతుంది.
అపూర్వ: ఈడియట్ ఒక ఆడదాన్ని చంపలేక ఇంకో ఆడదాని చేతిలో దెబ్బలు తిని వచ్చావు. చీ అసలు మీ ఇద్దరిని నమ్మి తప్పు చేశాను. ఇప్పుడు భూమి కనక ఆ వీడియో చూస్తే నన్ను భూస్థాపితం చేస్తుంది. వెళ్లండి వెళ్లి ఎక్కడైనా దాక్కొని చావండి నేను చెప్పే వరకు బయటకు రావొద్దు. వచ్చారంటే.. నేనే నా చేతులతో చంపేస్తాను..
రౌడీ: మేడం నా ముఖం ఆవిడ చూడలేదు..
అపూర్వ: ఆ భూమి ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. దానికి చిన్న ఆధారం దొరికినా నన్ను వదలదు.. నోరు మూసుకుని చెప్పిన పనులు చేయండి.. సగం సగం పనులు చేసి నన్ను ఇరికించేలా ఉన్నారు.
రత్న: మేడం మేము అండర్ గ్రౌండ్‌కు వెళ్తాము. అవసరం ఉంటే కాల్ చేస్తాము..
అపూర్వ: త్వరగా ఏదో ఒకటి చేసి చావండి. త్వరగా వెళ్లండి.. ( రత్న, రౌడీ వెళ్లిపోతారు.) అటు వీడియో దొరికినా ఇటు శారద బతికినా గ్యారంటీగా నా భర్త చేతుల్లోనో ఆ గగన్ గాడి చేతుల్లోనో చస్తాను.. ఎలా ఇప్పుడు నేను తప్పించుకోవడం ఎలా
అంటూ టెన్షన్ పడుతుంది అపూర్వ. ఇంతలో సుజాత కారు డిక్కీ తెరుచుకుని బయటకు వస్తుంది. సుజాతను చూసిన అపూర్వ షాక్ అవుతుంది.
అపూర్వ: పిన్ని నువ్వు ఎప్పుడొచ్చావు కారులోకి
సుజాత: నాకు తెలియకుండా నాకు అనుమానం వచ్చేసి నీ కారు డిక్కీలో దాక్కున్నాను.
అపూర్వ: అసలే టెన్షన్‌తో చస్తున్నాను. నువ్వు మరింత టెన్షన్ పెట్టకు పిన్ని..
సుజాత: శారదకు నిజం తెలిసిందా..? నువ్వు శోభాచంద్రను చంపిన వీడియో చూసిందా..?
అపూర్వ: అవును.. చూసింది..
సుజాత: శారదను చంపించావా..? లేక అదే చచ్చిందా..?
అపూర్వ: తెలియదు..
సుజాత: అయిపోయింది. నా పెట్టే సర్దుకుని తీర్థ యాత్రలకు వెళ్లే టైం వచ్చేసింది.
అంటూ ఎవరికో ఫోన్ చేసి అపూర్వ శవయాత్రకు అడ్వాన్స్ బుకింగ్ చేస్తుంది. దీంతో అపూర్వ కోపంగా సుజాతను తిడుతుంది. అంతదాకా రానివ్వను దాని కోసం ఎవ్వరిని బలి ఇవ్వడానికైనా తెగిస్తానని అపూర్వ చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















