Meghasandesam Serial Today October 21st: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ కు నిజం చెప్పిన ప్రసాద్ - కోపంతో రగిలిపోయిన గగన్
Meghasandesam Today Episode: ప్రసాద్ నిజం చెప్పడంతో గగన్ కోపంగా అపూర్వ ఇంటికి వెళ్తాడు. చెర్రి ఫోన్ చేసి అపూర్వ ను హెచ్చరించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: పుల్లుగా తాగి గగన్ కారుకు ఎదురెళ్లి కింద పడిపోయిన ప్రసాద్ తాగిన మైకంలో గగన్ కాదనుకుని గగన్‌కు శారదకు గుడిలో జరిగిన అవమానం గురించి అపూర్వ చేసిన తప్పుడు గురించి చెప్పబోతుంటే ఇంతలో చెర్రి వస్తాడు. ప్రసాద్ ను ఆపబోతుంటే గగన్ వద్దని చెప్తాడు. నాన్నా ఇప్పుడు ఇదంతా అవసరమా? అని ప్రసాద్‌ను ఆపతుంటే అవసరమే అంటూ శారదకు అపూర్వ గుండు గీయించాలని చూసింది అని చెప్తాడు. ఆ మాట వినగానే గగన్ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. కోపంతో రగిలిపోతుంటాడు. కారు వేసుకుని వెళ్లిపోతాడు. చెర్రి బకెట్ లో నీళ్లు తీసుకువచ్చి ప్రసాద్ మీద పోస్తాడు.
ప్రసాద్: అరేయ్ నేను ఇక్కడ ఉన్నానేంట్రా..?
చెర్రి: నాన్నా అసలు ఎంత పని చేశావో తెలుసా?
ప్రసాద్: నేనేం చేశానురా..
చెర్రి : ఆ గుడి దగ్గర జరిగిందంతా అన్నయ్యకు చెప్పేశావు.
ప్రసాద్: నేను చెప్పడం ఏట్రా.. అంటే ఆ గగన్‌కు చెప్పానా..? వాడికి చెప్పొద్దని పెద్దమ్మ నాతో ఒట్టు వేయించుకుందిరా..?
చెర్రి: అయ్యో మందులో వద్దు అంటున్నా అంతా చెప్పేశావు నాన్నా.. నిన్ను ఇంటికి తీసుకెళ్లాలని నేను తిరుగుతున్నాను. నాన్నా.. పద అన్నయ్య ఇంటికి వెళ్లే లోపల మనం కూడా వెళ్దాం.
ప్రసాద్: అరేయ్ ఏం మాట్లాడుతున్నావురా..? ఈ స్థితిలో నేనున్న పరిస్థితుల్లో నేను అక్కడకు వస్తే ఇంకేమన్నా ఉందా? పైగా నన్ను ఇలా చూస్తే వాడు నన్ను చంపేస్తాడురా..? వాడి వెనకాలే వెళ్లి వాణ్ణి ఆపరా.
అని ప్రసాద్ చెప్పగానే చెర్రి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు గగన్ కోపంగా కారులో వెళ్తుంటాడు. వెనకాలే చెర్రి సైకిల్ మీద వెళ్తుంటాడు. సైకిల్ ను నమ్ముకుంటే కాదని రోడ్డు పక్కన ఉన్న వ్యక్తిని బైక్ ఇవ్వమని అడిగితే సరేనని సైకిల్ వేసుకుని వెళ్తాడు. బండి కీ ఇవ్వమంటే అది నాది కాదని చెప్తాడు. దీంతో చెర్రి పరుగెడతాడు. మరోవైపు భూమి.. శోభాచంద్ర ఫోటో చూస్తూ ఏడుస్తుంది.
భూమి: నన్ను క్షమించు అమ్మా.. ఇలా చేయడం తప్పని తెలిసినా చేయక తప్పలేదు. నువ్వున్నా మామయ్యా లేకుండా పెళ్లి చేస్తుంటే ఊరుకుంటావా అమ్మా.. అందుకే నువ్వు చేసే పని నేనే చేశాను. పెళ్లి కూతురు తండ్రి లేకపోయినా పెళ్లి చేశారని అందరూ నాన్నను అంటారు కదా? అందుకే నేను నీలా మాట్లాడాను. నేను నీ కూతురిని అని చెప్పుకునే అదృష్టం నాకు ఇంకా రాలేదమ్మా.. అ నిజం చెప్పానంటే గగన్ గారికి ఇంకా దూరం అయిపోతాను. ఆయనకు దూరం కాకుండా ఉండటం కొరకే నేను ఇలా చెప్పాల్సి వచ్చింది. నాకైతే ఇద్దరూ కావాలి. ఇంట్లో వాళ్లకు ఇబ్బంది అంటే నిన్ను అడ్డుపెట్టుకున్నాను. నాకు ఏ ఆటంకాలు రాకూడదని నన్ను ఆశీర్వదించు అమ్మా.. నాన్నకు దగ్గరయ్యేలా ఆయన ప్రేమ నాకు దక్కేలా నువ్వే చూడాలమ్మా
అంటూ ఎమోషనల్ అవుతుంది భూమి. మరోవైపు ప్రసాద్, శారదకు కాల్ చేసి తాను గగన్‌కు గుడిలో జరిగిన విషయం తెలిసిపోయిందని అది నేనే చెప్పానని ప్రసాద్ చెప్పడంతో శారద షాక్ అవుతుంది. వాడికి ఫోన్ చేసి ఎలాగైనా వాణ్ని ఆపు అని చెప్తాడు. నన్ను ఇబ్బంది పెట్టారని తెలిస్తే మిమ్మల్నే వదలని వాడు ఆ అపూర్వను వదులుతాడా? అని భయపడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి.. అనుకుంటుంది. మరోవైపు అపూర్వ కు చెర్రి ఫోన్ చేసి అన్నయ్య ఆవేశంగా ఇంటికి వస్తున్నాడని గుడిలో పెద్దమ్మకు జరిగిన అవమానం తెలిసిపోయిందని నువ్వు ఇంట్లోంచి ఎక్కడికైనా వెళ్లిపో అని చెప్తాడు. నా ఇంట్లోంచి నేనెందుకు వెళ్లాలి.. నువ్వు రా నువ్వు వచ్చే సరికి మీ అన్నయ్య కాళ్లు చేతులు విరిచేసి ఉంటాయి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో గగన్ అపూర్వ ఇంటికి వస్తాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!