Meghasandesam Serial Today July 4th: ‘మేఘసందేశం’ సీరియల్: పెళ్లి వాయిదా వేద్దామన్న చెర్రి – వద్దన్న గగన్ - షాక్ లో భూమి
Meghasandesam Today Episode: డాన్స్ కాంపిటీషన్ వాయిదా వేయలేమని పెళ్లి వాయిదా వేసుకోమని చెర్రి చెప్పినా గగన్ వినకపోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: ఇంట్లో ఒక పక్క భూమి హల్దీ ఫంక్షన్ జరుగుతుంటే మరోపక్క అపూర్వ, మీరా పక్కకు తీసుకెళ్తుంది. పక్కక వెళ్లాక మీరా చెప్పండి వదిన ఎందుకు పక్కకు తీసుకొచ్చారు అని అడుగుతుంది.
అపూర్వ: ముందు నాకో విషయం చెప్పు మీరా.. అమ్మ స్థానంలో నిలబడి మేనత్తగా భూమి పెళ్లి జరిపిస్తున్నావు అంటున్నావు కదా నువ్వు హ్యాపీయా..?
మీరా: హ్యపీ అంటే చెప్పడం కష్టం వదిన. నా మేనకోడలిని నా ఇంటి కోడలిగా చేసుకోవాలని ఆశపడ్డాను. అలా జరిగి ఉంటే ఈ రోజు నాకంటే హ్యపీగా ఉండేవాళ్లు ఈ భూమ్మీదే ఎవ్వరూ ఉండేవారు కాదేమో..? నా మేనకోడలే నా కోడలు అయ్యే భాగ్యం నాకు లేదేమోనని సరిపెట్టుకున్నాను. భూమికి ఎలాగూ అమ్మ లేదు. ఎన్నో ఏళ్ల తర్వాత భూమికి నాన్న ప్రేమ దొరికింది. ప్రేమించిన వాణ్నే భూమి పెళ్లి చేసుకుంటుంది. తను ఆనందంగా ఉంది కదా..? తన ఆనందంలోనే నేను ఆనందాన్ని వెతుక్కుంటున్నాను.
అపూర్వ: ఆ ఆనందంలోనే ఈ పెళ్లి జరిపిస్తున్నావు అంతేగా..?
మీరా: అంతే కదా వదిన..
అపూర్వ: నేను నీలాగే సరిపెట్టుకుంటాను మీరా. కానీ నేను అలా సరిపెట్టుకోవడంలో నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ డీప్ గా ఆలోచించి చూస్తే.. మొత్తం నీ జీవితాన్నే నష్టపోతున్నావు అని నాకు అనిపిస్తుంది.
మీరా: అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు. ఈ పెళ్లి తర్వాత నాకు వచ్చే నష్టం ఏముంటుంది. కాకపోతే నాకు కోడలు కాలేదన్న బాధ ఎంతో కొంత ఉంటుంది.
అపూర్వ: అదంతా నీ అమాయకత్వం మీరా.. ఇన్నాళ్లు కేపీ మన ఇంట్లో ఉంటూ నీతో కాపురం చేస్తున్నాడు అంటే అదంతా నీ మీద ప్రేమ అనుకున్నావా..?
మీరా: అంత ప్రేమే ఉంటే అప్పుడప్పుడు ఆ శారద ఇంటికి ఎందుకు వెళ్లి వస్తుంటారు వదిన. నువ్వు అన్నా అన్నయ్య అన్నా మా వారికి చాలా భయం అందుకే మనింట్లోనే ఉంటున్నారు.
అపూర్వ: కరెక్టుగా చెప్పావు మీరా ఇప్పుడు భూమితో గగన్ పెళ్లి అయిపోయింది అనుకో.. అప్పటికి కేపీకి మేమంటే భయం ఉంటుందా..?
మీరా: ఎందుకు ఉండదు..?
అపూర్వ: ఎందుకు ఉండాలి. మేమంటే భయం ఉన్న కేపీ ఆ శారద ఇంటికి వెళ్లి వస్తున్నాడు అంటే ఈ పెళ్లి అయిపోయిన తర్వాత పూర్తిగా వెల్లిపోతాడు.
మీరా: ఎందుకు వెళ్తారు..? వెళ్లిపోతే నువ్వు కానీ అన్నయ్య కానీ ఊరుకుంటారా..?
అపూర్వ: ఊరుకోకపోతే ఉరేసుకుంటామా..? పిచ్చిదాని లాగా మాట్లాడకు మీరా కాస్త లాజిక్‌గా ఆలోచించు..
మీరా: మీరు మాట్లాడుతుంది నాకు పూర్తిగా అర్థం కావడం లేదు వదిన.
అపూర్వ: అర్థం అయితే నువ్వు అమాయకురాలివి అని మేమందరం ఎందుకు అంటాము. ఈ పెళ్లి అయిందనుకో ఈ ఇంటి ఆడపిల్ల ఎక్కడ ఉంటుంది. ఆ ఇంట్లో ఉంటుంది. అంటే అర్థం నేను మీ అన్నయ్య ఆ శారద చేతిలో ఉంటాము. అలా కాదని ఉన్నామనుకో ఆ శారద భూమిని రాచి రంపాన పెడుతుంది. ఇక కేపీ నేను ఆ ఇంటికి వచ్చేస్తాను శారద అన్నాడనుకో సంతోషంగా వచ్చేయండి అంటుంది.
అని అపూర్వ తన మాటలతో మీరాను రెచ్చగొడుతుంది. దీంతో మీరా కోపంగా శారద ఇంటికి బయలుదేరుతుంది. ఎలాగైనా శారద, కేపీతో విడాకులు తీసుకునేలా చేయాలనుకుంటుంది. మరోవైపు రూంలో ఏడుస్తూ కూర్చున్న భూమి దగ్గరకు చెర్రి వెళ్తాడు.
చెర్రి: మామయ్యా ఎమంటున్నారు..?
భూమి: తన ఆశీర్వాదం కావాలంటే పెళ్లి కూతురిలా కాకుండా నాట్య కళాకారిణిగా రమ్మంటున్నారు.
చెర్రి: అన్నయ్యతో మాట్లాడి పెళ్లి పోస్ట్‌పోన్ చేయడమే మనకున్న ఏకైక దారి
భూమి: వద్దు చెర్రి ఆయన ఒప్పుకుంటారో లేదో..?
చెర్రి: నువ్వు కాదు నేను మాట్లాడతాను.
అంటూ చెర్రి, గగన్ కు కాల్ చేస్తాడు. పెళ్లి గురించి డాన్స్ కాంపిటీషన్ గురించి శరత్ చంద్ర చెప్పిన మాటల గురించి చెప్పి పెళ్లి పోస్ట్ ఫోన్ చేద్దామంటాడు. గగన్ కోపంగా వద్దని పెళ్లి జరగాల్సిందేనని అంటాడు. దీంతో భూమి షాక్ అవుతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















