Meghasandesam Serial Today July 30th: ‘మేఘసందేశం’ సీరియల్: శరత్‌చంద్రకు ఫోన్ చేసిన గగన్ - అయోమయంలో పడిపోయిన భూమి
Meghasandesam serial today episode July 30th: శరత్ చంద్రకు ఫోన్ చేసి భూమి నా ఇంట్లో ఉందని గగన్ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: శరత్ చంద్ర గెస్ట్‌హౌస్‌లో మర్డర్ అయిన ఎస్సై కేసు గురించి మాట్లాడటానికి డీఎస్పీ ఇంటికి వస్తాడు. ఆ కేసులో ఎవరో లేడీ హస్తం ఉన్నట్టు తమ ప్రాథమిక విచారణలో తేలింది అని చెప్తాడు డీఎస్పీ.
శరత్: తను ఎవరో నాకు చెప్పండి. నేన తనును చూడాలి. నా శోభాచంద్రను ఎందుకు చంపిందో అడగాలి.
డీఎస్పీ: ఎమోషనల్ అవకండి శరత్‌చంద్ర గారు. మాకు క్లూస్ దొరికాయి. బలమైన విట్నెస్ దొరకలేదు. త్వరలోనే అవి కూడా సంపాదిస్తాను. అప్పుడు చెప్తాను ఆ ఆడది ఎవరని.. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ మీద కూడా అటాక్ జరగొచ్చు. ఇక నేను బయలుదేరుతానండి.
శరత్: మీరిలా సగం సగం చెప్పి బయలుదేరుతుంటే నాకు చాలా అసంతృప్తిగా ఉందండి డీఎస్పీ గారు.
డీఎస్పీ: ఏదైనా మీ మంచి కోసమే చెప్తున్నానండి. ఆ ఆడది చాలా డేంజర్ మీ నుంచి తనకు రిస్క్ ఉందని తెలిస్తే మీరు రిస్క్ లో పడతారు. బలమైన విట్నెస్ దొరికితే ఆవిడను అరెస్ట్ చేస్తున్నప్పుడు ఆవిడెవరో మీకు తెలుస్తుంది. ఉంటాను సార్.
అని చెప్పి డీఎస్పీ వెళ్లిపోతాడు. డీఎస్పీని కోపంగా చూస్తుంది అపూర్వ.
అపూర్వ: నిన్న దాని గురించే ఆలోచిస్తూ కళ్లు తిరిగి పడిపోయావు. ఇలా అయితే మీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. నిన్నే నమ్ముకున్న నేను ఏమైపోవాలి బావ. ఆ డీఎస్పీ మీ మనసులో వేసిన అనుమానంతో మీకు నాకు మనఃశాంతి లేకుండా పోతుంది బావ. దాన్నంత వదిలేయ్. ప్రశాంతంగా ఉండు.
శరత్: అపూర్వ ఒక్కసారి అనుమానం మనసులో పడ్డాక ప్రశాంతంగా ఎలా ఉండగలం చెప్పు.
మీరా: అన్నయ్యా.. అదే అన్నయ్య మీరు వద్దనుకున్నా చెర్రి పెళ్లి నక్షత్రతో అయిపోయింది కదా..?
సుజాత: సరిపోయింది. కాసేపటి క్రితం డీఎస్పీ వచ్చి భయపెట్టాడు. ఇప్పుడు ఈవిడ గారు వచ్చి బాధపెడుతుంది.
అపూర్వ: పిన్ని అసలు ఏం మాట్లాడుతుందో మాట్లాడనివ్వు. అప్పుడే కదా బాధ పడాలో బాధలో పడేయాలో అర్థం అవుతుంది.
సుజాత: సరే మీ ఇష్టం..
శరత్: సరే పెళ్లి అయిపోయింది. ఇప్పుడు ఏమంటావు..?
అని శరత్ చంద్ర అడగ్గానే.. మీరా ఏదో చెప్పబోతుంది. ఇంతలో శరత్ చంద్రకు ఫోన్ రావడంతో బయటకు వెళ్తాడు. మరోవైపు శారద ఇంటికి వెళ్లిన భూమి శారదను చూసి ఎమోషనల్ అవుతుంది.
శారద: గగన్, భూమి షాపింగ్ కు వెళ్లారు వాళ్లు వచ్చే లోగా ఇక్కడి నుంచి వెళ్లిపో భూమి.
భూమి: వెళ్లిపోతాను కానీ ఎలాగైనా మీ అబ్బాయి గగన్‌ను మా పెళ్లికి మీరే ఒప్పించాలి. ఒప్పిస్తానని నాకు మాట ఇవ్వండి అత్తయ్య.
అని భూమి అడగ్గానే.. ఇంతలో గగన్ వస్తాడు. గగన్‌ను చూసి శారద భయపడుతుంది.
గగన్: అసలు నువ్వు ఈ ఇంట్లో ఎందుకు ఉన్నావు…
అంటూ శరత్‌చంద్రకు ఫోన్ చేస్తాడు.
శరత్: ఏంట్రా..? నాకు ఫోన్ చేశావు.
గగన్: పెళ్లి చూపులకు పెళ్లి కూతురు ఇంట్లో లేదని చాలా ఫ్రెస్టేషన్‌లో ఉన్నావా శరత్‌చంద్ర. కూతురుకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసే ముందు తనకు ఇష్టం ఉందో లేదో తెలుసుకునే సంస్కారం నీకు లేదా..? నీ కూతురు భూమి ఇప్పుడు నా ఇంట్లో ఉంది.
అంటూ గగన్ చెప్పగానే.. భూమి భయపడుతుంది. శరత్ చంద్ర కోపంగా గగన్‌ను తిడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















