Meghasandesam Serial Today January 15th: ‘మేఘసందేశం’ సీరియల్: ఊహల్లో తేలిపోయిన నక్షత్ర – సందిగ్దంలో పడిపోయిన భూమి
Meghasandesam Today Episode: భూమికి గగన్.. లవర్స్ బొమ్మ గిఫ్ట్‌గా ఇస్తాడు. కానీ తాను శరత్‌చంద్రకు ఇచ్చిన మాట గుర్తు చేసుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: శారద కూడా కూరగాయలు తీసుకుని టాప్ దగ్గరకు వెళ్తుంది. ఇంతలో భూమి దగ్గరకు నక్షత్ర వెళ్లి ఆ వెజిటేబుల్స్ నేను కడుగుతాను అంటుంది.
భూమి: అబ్బా ఎలా పౌడర్‌తోనా..? సోప్‌తోనా..?
నక్షత్ర: వెటకారాలొద్దు ఆ మాత్రం కడగడం నాకు వచ్చు..
భూమి: అది కాదు చిట్టి నీ సోకుకు నీ యవ్వారానికి ఇది సెట్ అవ్వదేమో..? కాస్త ఆలోచించుకో అసలే సుకుమారంగా పెంచింది మీ అమ్మా..
నక్షత్ర: హలో తిట్టావంటే నేను తిట్టగలను. అనవసరంగా గొడవ పడటానికి ట్రై చేయకు.
భూమి: చూశావా అమ్మా అంటేనే అమ్మో అంటున్నాను. నీకు తెలుగుకు తెగులుకు తేడా తెలియదు. ఇంకో పని ఏదైనా చూసుకో..?
నక్షత్ర: నేను ఇంకేదైనా పని చూసుకుంటే ఇలాంటి పనులు నువ్వు చేసేసి డాడీ దగ్గర మార్కులు కొట్టేద్దామనుకుంటున్నావా..? అదేం కుదరదు. ఈ సారి డాడీ దగ్గర పడే ప్రతి మార్కు నాదే అయ్యుండాలి. నేను చెప్పినట్టే డాడీ వినాలి.
భూమి: ఓహో అంకుల్‌తో మందు మాన్పించేశాననా..? నీ బాధ.
నక్షత్ర: బాధేం లేదు. నీకు ఇంపార్టెంట్ ఇస్తున్నాడనే నా బాధ.
భూమి: ఇలాంటివన్నీ చేస్తే అంకుల్ నీకు ఇంపార్టెంట్ ఇస్తారని నీ ఫీలింగ్ చూడు ఒక మనిషి మనసు గెలవాలంటే మార్కులు కొట్టాలనో అంట్లు తొమాలనో లెక్కలు వేయకూడడు. ముందు ఆ మనిషి మనసేంటో మన మనసుతో తెలుసుకోవాలి. అయినా ఇంత బరువైన డైలాగులు ఈగోతో కండబట్టిన నీకు సూట్ కావు కానీ ఇప్పుడు ఇవన్నీ నువ్వు కడగాలి అంతేగా కడిగేసేయ్.. ఎంత కడుగుతావో నేను చూస్తాను.
అంటూ భూమి వెళ్లిపోతుంది. టాప్‌కు వెనక వైపు నుంచి వచ్చిన శారద, భూమి వెళ్లడం చూడకుండా.. నక్షత్రనే భూమి అనుకుని పోరపాటుగా అనుకుంటుంది. టాప్ దగ్గర కూర్చుని కూరగాయలు కడుగుతూ మెల్లగా మాట కలుపుతుంది.
శారద: అమ్మా నీతో మాట్లాడదామని వనభోజనాల పేరు మీద ఇక్కడి దాకా వచ్చాము.
నక్షత్ర: నాతో మాట్లాడటానికి వచ్చారా..? ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి.
శారద: ఏంటో నాకు కొంచెం టెన్షన్‌గా ఉండటం వల్ల నీ గొంతు కూడా నాకు అదోలా వినిపిస్తుంది.
నక్షత్ర: నీది టెన్షన్.. నాది ఆనందం.. ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి..
శారద: ఎప్పటి నుంచో నిన్ను కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నాను అమ్మా.. నీ మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలని వచ్చాను.
అంటూ శారద అడగ్గానే.. నక్షత్ర ఆనందంతో పొంగిపోతుంది. ఊహల్లో వివరిస్తూ గగన్‌ను గుర్తు చేసుకుంటుంది. మరోవైపు టాప్ దగ్గర నుంచి వెళ్తు్న్న భూమి దగ్గరకు గగన్ వెళ్తాడు. భూమి ఆగు అంటాడు. భూమి ఆగిపోతుంది.
గగన్: నీకో సర్‌ప్రైజ్ ఉంది.
భూమి: ఏంటది..?
గగన్: కళ్లు మూసుకో..
భూమి కళ్లు మూసుకోగానే ఒక లవర్స్ బొమ్మ చూపిస్తాడు.
గగన్: ఓపెన్ యువర్ ఐస్… దీన్ని చూస్తే నీకేమనిస్తుంది.
భూమి: లవర్స్ లా కనిపిస్తున్నారు.
గగన్: లా కనిపించడం కాదు. లవర్సే.. ఇది మన ప్రేమకు ప్రతిరూపం. అమ్మాయివి నువ్వు, అబ్బాయి నేను.. నా ప్రేమకు రూపంగా మొదటిసారి ఇది నీకోసం తీసుకొచ్చాను. వీళ్లు కలిసి ఉన్నట్టుగా మనిద్దరం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి.
అంటూ గగన్ చెప్తుండగానే.. భూమి భయపడుతుంది. తాను శరత్ చంద్రకు ఇచ్చిన మాట గుర్తుకు వస్తుంది. దీంతో తనకు ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తుంది పోతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!



















