పర్​ఫ్యూమ్​ని చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అది ఎక్కువసేపు వారి మీద ఉండదు.

కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే పర్​ఫ్యూమ్​ ఎక్కువ కాలం ఉంటుందంటున్నారు నిపుణులు.

పర్​ఫ్యూమ్​ని ఎక్కువకాలం ఉండాలంటే.. స్నానం చేసిన తర్వాతే దానిని అప్లై చేసుకోవాలి. లేదంటే వాసనలో మార్పులొస్తాయి.

శరీరానికి మాయిశ్చరైజర్ అప్లై చేసి.. తర్వాత పర్​ఫ్యూమ్ అప్లై చేస్తే మరింత ఎలివేట్ అవుతుంది.

శరీరం కూల్​గా ఉన్నప్పుడు పర్​ఫ్యూమ్ అప్లై చేస్తే అది బాగా అబ్జార్వ్ అవుతుంది.

అలాగే పర్​ఫ్యూమ్​ని ఎక్కువగా కాకుండా.. 2 లేదా 3 స్ప్రేలు ఉండేలా చూసుకుంటే మంచిది.

రిస్ట్, నెక్, మోచేతుల లోపల దగ్గర పర్​ఫ్యూమ్ అప్లై చేసుకుంటే మంచిది.

పర్​ఫ్యూమ్​ని అప్లై చేసిన తర్వాత డాబ్ చేస్తే మంచిది. రబ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు.

పర్​ఫ్యూమ్​ని లేయరింగ్ పద్ధతిలో డ్రెస్​కి అప్లై చేయొచ్చు. డ్రెస్​కి, స్కార్ఫ్స్​కి, వస్తువులకు స్ప్రే చేయొచ్చు.

మీ పర్​ఫ్యూమ్​ని సన్​లైట్​లో, వేడి ఎక్కువగా ఉన్నప్రాంతాల్లో ఉంచకపోవడమే మంచిది.