Meghasandesam Serial Today January 14th: ‘మేఘసందేశం’ సీరియల్: చెర్రికి అన్నం తినిపించిన నక్షత్ర – భోజనం చేయకుండా వెళ్లిపోయిన అపూర్వ
Meghasandesam serial today episode January 14th: నక్షత్రలో మార్పును చూసి భోజనం చేయకుండా కోపంగా వెళ్లిపోతుంది అపూర్వ. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: శరత్ చంద్ర ఇంట్లో అందరూ భోజనానికి కూర్చుంటారు. ఇంతలో మీరా వచ్చి అందరికీ వడ్డిస్తుంటే.. నక్షత్ర వెళ్లి తాను వడ్డిస్తాను అంటుంది. నీకెందుకులే నక్షత్ర ఆ శ్రమ అంటుంది మీరా.. అయితే మా ఆయనకైనా వడ్డించే అవకాశం ఇవ్వు అత్తయ్యా అని నక్షత్ర అడగ్గానే అందరూ ఆశ్చర్యపోతారు. అపూర్వ, సుజాత షాక్ అవుతారు.
మీరా: పోనీలేమ్మా.. కనీసం ఈ అవకాశం అయినా నాకు ఇచ్చావు.. అదే నాకు సంతోషం
అనగానే.. మీరా, నక్షత్ర ఇద్దరూ కలిసి వడ్డిస్తుంటారు. శరత్ చంద్ర సంతోషంగా నక్షత్రను చూస్తుంటారు.
నక్షత్ర: ఏంటి అందరూ నన్నే చూస్తున్నారు తినండి..
శరత్: మరీ ఒక్కరోజులో ఇంత మార్పు ఏంట్రా చెర్రి..
చెర్రి: మారింది కదా మామయ్య ఈ మార్పు మీకు నచ్చలేదా చెప్పండి..
అపూర్వ: అయ్యో నచ్చకపోవడం ఏంట్రా చాలా నచ్చిందిరా..? నా కూతురు నక్షత్రను నేను ఎలా చూడాలి అనుకున్నానో అలా ఉంది.
చెర్రి: ఏం నాన్న నువ్వు హ్యాపీయే కదా..?
కేపీ: నా హ్యాపినెస్ ను మాటల్లో చెప్పలేనురా.? అంతలా ఉంది.
చెర్రి: అత్తయ్యా మీరు హ్యాపీయే కదా..?
శరత్: నా కూతురు మారితో సంతోషించేవాళ్లలో మొదటి వ్యక్తి నా అపూర్వనే ఉంటుందిరా… ఏం అపూర్వ…
అపూర్వ: అవును అవును.. నా మనసు కరెక్టుగా బావకే తెలుసు..
సుజాత: నా మనసు మా అమ్మాయికి తెలుసు.. నక్షత్ర మారిపోతే సంతోషించేవాళ్లతో రెండో దాన్ని నేను
చెర్రి: అందరూ హ్యాపీయే కదా.? నక్షత్ర ఎలా మారితే ఏంటి..? మారడం ముఖ్యం.
నక్షత్ర: భోజనాలు వడ్డించిన దగ్గరి నుంచి మీరు అందరూ మాటలే భోం చేస్తున్నారు. కాస్త నేను వండిన వంటలు భోం చేయండి. అప్పుడు నేను వండిన వంటలు ఎలా ఉన్నాయో చెప్పండి..
శరత్: వావ్ నక్షత్ర అమృతం అమ్మా..
కేపీ: అదిరింది అమ్మా..?
నక్షత్ర: థాంక్స్ మామయ్యా..
కేపీ: మీరా చేసే వంటలు కూడా నువ్వు చేసే వంటలకు పోటీ రాదు. ఏమీ అనుకోకు మీరా..
మీరా: నా కోడలు నాకంటే వంటలు బాగా చేస్తుందంటే.. నాకు ఆనందమే కదండి..
ఇంతలో చెర్రి చేయి నొప్పితో బాధపడుతుంటే..
నక్షత్ర: అయ్యో ఏమైందండి..?
చెర్రి: ఇందాక వంటలో నీకు హెల్ప్ చేశాను కదా అప్పుడు చేయి కట్ అయింది.
నక్షత్ర: మరి చెప్పాలి కదండి.. తెగిపోయిన వేలితో మీరు ఎలా తింటారు. నేను తినిపిస్తాను ఉండండి.. తినండి.. (అంటూ నక్షత్ర, చెర్రికి తినిపిస్తుంది. శరత్ చంద్ర చూస్తుంటే..) అదేంటి డాడీ అలా చూస్తున్నావు.. నీకు ఇలాంటి పరిస్థితి వస్తే మమ్మీ నీకు తినిపిస్తుందా లేదా..?
శరత్: తినిపిస్తుంది అమ్మా..
నక్షత్ర: మరి నేను ఇప్పుడు అదేగా చేస్తున్నాను..
చెర్రి: నాకు తినిపిస్తున్నావు నక్షత్ర కానీ నువ్వు ఎప్పుడు తింటావు..
నక్షత్ర: మీరు తిన్నాక మీ ఎంగిలి ప్లేట్‌లో తింటానండి. అదే కదా మన సంప్రదాయం.
అంటూ నక్షత్ర చెప్తుంటే.. అపూర్వ ఇరిటేటింగ్‌గా లేచి చేయి కడుక్కుని వెళ్లిపోతుంటే.. ఏమైందని శరత్ చంద్ర అడిగితే నక్షత్రలో ఈ మార్పు చూశాక ఆనందంతో నా కడుపు నిండిపోయింది అని చెప్పి వెళ్లిపోతుంది. వెనకాలే సుజాత కూడా భోజనం మధ్యలోంచే వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















