Meghasandesam Serial Today January 10th: ‘మేఘసందేశం’ సీరియల్: బిందును చంపబోయిన అపూర్వ – అడ్డు పడిన కేపీ
Meghasandesam serial today episode January 10th: కాలేజీకి వెళ్తున్న బిందును ఆపి అట్లకాడతో కాల్చి చంపాలనుకుంటుంది అపూర్వ. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: బిందు కాలేజీకి వెళ్లడానికి రెడీ అయి కిందకు వస్తుంది. హాల్లో కూర్చున్న అపూర్వ దగ్గరకు వెళ్తుంది. బిందును చూసిన అపూర్వ కోపంగా ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది.
బిందు: ఈ రోజు ఎగ్జామ్ ఉంది అత్తయ్యా.. నేను వెళ్లి రాయాలి. రాయకపోతే ఇన్నాళ్లు చదువుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది అత్తయ్యా..
అపూర్వ: సరే వెళ్లు… ( బిందు వెళ్లిపోతుంది.) ఆగు.. వెళ్లు అనగానే.. చాలా ఆనందంగా వెళ్లిపోతున్నావు.. మనసు పడినవాడితో లేచిపోవడానికి వెళ్తున్నావా..? ఏంటి..?
బిందు: లేదు అత్తయ్యా నిజంగానే ఎగ్జామ్ ఉంది.
అపూర్వ: ఎగ్జామ్ అంటే పరీక్ష. నీకు పరీక్ష కాదే.. నువ్వు నీ బాబు మీరంతా కలిసి నా సహనానికి పరీక్ష పెడుతున్నారు. మీ బాబేమో మీ అన్నయ్య చెర్రిని నా కూతురు నక్షత్ర చంపబోయింది అంటున్నాడు. నువ్వేమో ఎగ్జామ్ అని మాటలతో మాయ చేసి నా కళ్లకు మసి పూసి మనసైనోడితో లేచిపోవాలని చూస్తున్నావు.. పిన్ని..
సుజాత: అమ్మాయి..
అపూర్వ: ఇదంతా చూస్తుంటే.. నేను వీళ్లందరి దృష్టిలో పలచన అయిపోయినట్టు కనిపించడం లేదూ..
సుజాత: మామూలు పలచన కాదు అమ్మాయి.. ఉత్త నీళ్లే కనబడేంత పలచన అయిపోయావు..
అపూర్వ: ఈ ఇంట్లో నీ ఉనికిని నువ్వు చాటుకోవాలన్నా..? నేనంటే వీళ్లందరికీ ఏదో భయం రావాలన్నా ఏదో ఒకటి చేయాలి పిన్ని..
సుజాత: అవును అమ్మాయి చేయాల్సిందే..?
అపూర్వ: ఏం చేయాలి అంటావు..
సుజాత: సలహా ఇచ్చేంత చనువు ఉంది కానీ నీకు సలహా ఇచ్చేంత బుర్ర నాకు ఎక్కడుంది అమ్మాయి. అది కూడా నువ్వే ఆలోచించు
అపూర్వ: కరెక్టే.. ఏమో నిజంగా నీకు ఎగ్జామ్ ఉందా..?
బిందు: నిజగా ఉంది అత్తయ్యా.. ఒట్టు..
అపూర్వ: ఒట్టు వేయడానికి తలపై పెట్టుకున్న ఆ చేతిని ఎర్రగా కాల్చేశాను అనుకో అప్పుడు ఎగ్జామ్ రాయగలవా..?
బిందు: ప్లీజ్ అత్తయ్యా అంత పని చేయకండి నా మాట నమ్మండి..
అపూర్వ: నమ్మను.. పిన్ని.. నువ్వు వెళ్లి అట్ల కాడ స్టవ్ మీద పెట్టి ఎర్రగా కాల్చి తీసుకురా.. ఈరోజు తర్వాత మళ్లీ ఇది ఈ ఇంట్లోంచి బయటపెట్టాలంటే భయపడాలి.
అని చెప్పగానే.. సుజాత అట్లకాడ కోసం కిచెన్ లోకి వెళ్తుంది.
బిందు: వద్దు అత్తయ్యా ఫ్లీజ్ అత్తయ్యా మీకు దండం పెడతాను. నువ్వు వద్దంటే నేను ఎగ్జామ్ రాయనులే..
అపూర్వ: నువ్వు రాయకపోయినా నువ్వు పెట్టిన ఎగ్జామ్‌లో నేను పాస్ అవ్వాలి కదే..
బిందు: అత్తయ్యా వద్దు అత్తయ్యా… ఫ్లీజ్ అత్తయ్యా..
అంటూ బిందు బతిమాలుతుంది. అపూర్వ వినకుండా బిందు దగ్గరకు వెళ్తుంది. బిందు చేయి గట్టిగా పట్టుకుంటుంది. బిందు ఎంత ప్రయత్నించినా అపూర్వ వదలదు. కిచెన్‌లోకి వెళ్లిన సుజాత అట్ల కాడ స్టవ్ మీద పెట్టి కాలు త్వరగా కాలు ఎర్రగా కాలు నాకు హింసను భరించడం కష్టం కానీ దగ్గరుండి చూడటం మహా ఇష్టం సుమీ అనుకుంటూ అట్ల కాడను ఎర్రగా కాల్చుకుని తీసుకుని హాల్లోకి వెళ్లి అపూర్వకు ఇస్తుంది. అమ్మాయి ఇదిగో ఎలా కాలిందో చూడు అనగానే.. అట్ల కాడ తీసుకున్న అపూర్వ బిందు చేతి మీద కాల్చబోతుంటే కేపీ వచ్చి అడ్డు పడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















