Meghasandesam Serial Today December 26th: ‘మేఘసందేశం’ సీరియల్: శివ, పూరి పెళ్లికి గగన్ గ్రీన్ సిగ్నల్ - పెళ్లి ఇష్టం లేదన్న భూమి
Meghasandesam serial today episode December 26th: శివ, పూరిలు ప్రేమించుకుంటున్నారు వాళ్లిద్దరికి పెళ్లి చేద్దాం అంటాడు గగన్. ఆ పెళ్లి చేయడం తనకు ఇష్టం లేదంటుంది భూమి

Meghasandesam Serial Today Episode: భూమి కోపంగా గగన్ ఇంటికి వస్తుంది. హాల్లో శివ కూర్చుని ఉంటే ఎక్కడరా మీ బావ అని కోపంగా అడుగుతుంది. శివ అయోమయంగా చూస్తుంటాడు. ఇంతలో భూమి మరింత కోపంగా గగన్ ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది.
భూమి: పోనీలే పాపం అని నెట్టుకొస్తుంటే ఒక ఆడ పిల్లను అది పెళ్లాన్ని అని కూడా చూడకుండా నిర్దాక్ష్యిణంగా నడి రోడ్డు మీద వదిలేసి వచ్చాడు. అయిపోయాడు ఇవాళ నా చేతుల్లో అయిపోయాడు..
శివ: అక్క నేను చెప్పేది విను అక్క..
భూమి: నన్ను ఆపాలని చూడకురా..?
శివ: బావకు నిజం తెలిసిపోయింది.
భూమి: ఏ నిజం తెలిసిందిరా…
శివ: అదే అక్కా నేను నీ తమ్ముణ్ని అన్న నిజం.. బావకు తెలిసిపోయింది అక్క
భూమి: ఎలా తెలిసిపోయిందిరా..?
శివ: అక్కా నీ ఫోన్ ఎక్కడుంది అక్క..
భూమి: అయ్యో మీ బావ కారులోనే వదిలేశాను.
శివ: అది సంగతి నువ్వు ఫోన్ కారులో వదిలేశావని నాకు తెలియదు. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను. అది చెప్పాలంటే మనకు ఉన్న సంబంధం మొత్తం చెప్పాలని మొత్తం చేప్పేశాను అక్క. నువ్వు మాట్లాడకపోయే సరికి బావ ఉన్నాడు అనుకున్నాను. కానీ ఇదంతా బావే విన్నాడని ఇంటికి వచ్చాకే అర్థం అయింది.
భూమి: బావ నిన్ను కొట్టాడా..?
శివ: అవును అక్క బాగా కొట్టాడు.. అక్కా బావ వస్తున్నాడు.
భూమి: ఏంట్రా అలా వస్తున్నాడు.. చూస్తుంటేనే నాకు భయంగా ఉందిరా..? నన్ను చంపేస్తాడు.
శివ: చచ బావ స్మశానం వరకు తీసుకెళ్లడు అక్క. జస్ట్ ఐసీయూ వరకు తీసుకెళ్లి వదిలేస్తాడు.
భూమి: నోరు మూయరా..? అసలే టెన్షన్ పడుతుంటే.. ఇంకా భయపెడతావేంటి..? అవును అత్తయ్యా ఏది..?
శివ: అబ్బా ఇప్పుడు అత్తయ్య గురించి ఎందుకు అక్క.. అత్తయ్య ఉంటే అడ్డుకుంటుంది. కనీసం కొన్ని దెబ్బలైనా తప్పించుకోవచ్చు.
శివ: ఏమో బావను చూస్తుంటే.. ఇవాళ హాస్పిటల్ బిల్లు కాయం అనిపిస్తుంది.
ఇంతలో గగన్ దగ్గరకు వస్తాడు. భూమి ఏదేదో చెప్పబోతుంటే.. గగన్ కోపంగా చూస్తుంటాడు.
గగన్: ఆపు నాకు అంత తెలిసిపోయింది.
భూమి: బావ అది…
గగన్: నువ్వు జీవితంలో ఏమైనా చేశావు అంటే అది మీ తమ్ముణ్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టడం.
భూమి: అంటే బావ మీకు నా మీద కోపం లేదా..?
గగన్: లేదు..
భూమి: శివ నువ్వు కొంచెం పక్కకు వెళ్లు మీ బావతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి.
అని చెప్పగానే శివ అలాగే అక్కా అంటూ వెళ్లిపోతాడు.
భూమి: బావ నిజంగా నా మీద కోపం లేదా..?
గగన్: లేదు.. అని చెప్తున్నాను కదా..?
అనగానే భూమి హ్యాపీగా గగన్‌ను కిస్ చేస్తుంది. గగన్ ఇరిటేట్ అవుతాడు. భూమిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే.. అంటే బావ ఏదైనా శుభవార్త చెబితే స్వీట్ పెడతారు కదా..? ఇప్పుడు నా దగ్గర స్వీట్ లేదు.. అందుకే ఒక స్వీట్ కిస్ పెట్టా అంటూ మళ్లీ కిస్ ఇచ్చి వెళ్లిపోతుంది భూమి. తర్వాత గగన్ భూమి దగ్గరకు వెళ్లి శివ, పూరి గురంచి మాట్లాడాలని చూస్తాడు. అది అర్థం చేసుకున్న భూమి తప్పించుకుని తిరుగుతుంది. దీంతో బలవంతంగా పట్టుకుని పూరి శివ ప్రేమించుకుంటున్నారు వాళ్లిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పగానే తనకు ఇష్టం లేదని భూమి చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















