Meghasandesam Serial Today December 1st: ‘మేఘసందేశం’ సీరియల్: శరత్ చంద్ర ఇంట్లో దూరిన గగన్ – భూమి అక్రమ సంతానం అన్న అపూర్వ
Meghasandesam Today Episode: పూరి రెచ్చగొట్టడంతో అర్దరాత్రి శరత్ చంద్ర ఇంట్లోకి గోడ దూకి వెళ్తాడు గగన్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: తనతో ఫోన్ మాట్లాడిన భూమి.. గగన్‌ను ఇంకా ఏదైనా చెప్పాలా అని అడుగుతుంది. ఏం లేదని ఫోన్ కట్ చేస్తాడు గగన్. దీంతో భూమి బాధపడుతుంది. థాంక్స్ చెప్పాలి మాట్లాడిలి అన్నావు. అలా కట్ చేశావేంటి అని పూరి అడుగుతుంది. ఇంటికి రానంటుంది ఇంకా ఏం మాట్లాడాలి అంటాడు గగన్. దీంతో తను రాను అంటే నువ్వే వెళ్లాలి. ఆడవాళ్లు ఊరికే రాననరు. దాని వెనక ఎన్నో కారణాలు ఉంటాయి అని పూరి చెప్పాగానే అయినా నన్ను చంపాలనుకున్న ఆ ఇంటికి ఎలా వెళ్లాలి అంటాడు గగన్. గట్టిగా ఆలోచించు ఏదైనా దారి దొరుకుతుందని పూరి చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు అపూర్వ తెల్లచీర కట్టుకుని పాలు గ్లాసు పట్టుకుని వస్తుంది.
సుజాత: అమ్మాయి నిన్ను ఇలా చూస్తుంటే నా ఆస్థి మొత్తం రాసిచ్చేయాలి అనిపిస్తుంది. ఇంక అల్లుడు గారు ఆగుతారా..? నక్షత్ర పేరు మీద ఆస్థి ఎలా రాయిస్తావు అని అడిగితే లైవ్‌లో చూపిస్తాను అంటే ఏంటో అనుకున్నాను.
అపూర్వ: పో పిన్ని ఏదో కొంచెం రెడీ చేయమన్నాను. నువ్వు మరీ ఇలా కొత్త పెళ్లి కూతురులా చేస్తావనుకోలేదు.
సుజాత: ఇదిగో అమ్మాయి అంత ఆస్తి రావాలంటే ఈ మాత్రం ఉండాలి. మిగతాది చెప్పేంత తెలివితక్కువ దానివేం కాదులే.. అల్లుణ్ని వలపు వడిలోకి లాక్కున్న వెంటనే ఆస్థి పేపర్స్ పైన సంతకం చేయించుకో..
అపూర్వ: బావ మాట తప్పడులే పిన్ని.. మాట తీసుకుంటే సరి.. మళ్లీ సంతకం అంటే నా క్యారెక్టర్ బయటపడుతుంది.
సుజాత: అవును అమ్మాయి నా మట్టి బుర్రకు తట్టనే లేదు. టైం అవుతుంది వెళ్లు అమ్మాయి.
అపూర్వ: అబ్బా వెళ్తున్నాను ఉండు..
అంటూ అపూర్వ లోపలకి వెళ్తుంది. శరత్ చంద్రను బావ అని పిలుస్తుంది. అపూర్వను శరత్ ఆశ్చర్యంగా చూస్తుంటే పాలు ఇస్తుంది అపూర్వ.
శరత్: ఏంటి ఇంత అందంగా తయారయ్యావు.
అపూర్వ: బాగా లేనా.. బావా..
శరత్: బాగా లేకపోతే ఏంటి ఇలా తయారయ్యావు అంటాను కదా.. అపూర్వ పెళ్లి నాటి రోజుల్ని గుర్తు చేస్తున్నావు.
అపూర్వ: పో బావ నాకు సిగ్గేస్తుంది.
అని అపూర్వ అంటూనే.. కొద్ది సేపటికి బావ మీరు ఏమీ అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగనా..? అంటూ మీకు ఎప్పుడో ఎఫైర్ ఉండేదని.. ఆ ఎఫైర్‌కు పుట్టిన పాపే భూమి అని బయట అనుకుంటున్నారు అని అపూర్వ చెప్పగానే శరత్ చంద్ర షాక్ అవుతాడు. భూమిని ఇంట్లో కాకుండా ఏదైనా హాస్టల్ లో పెడదామని అపూర్వ సలహా ఇవ్వగానే వద్దని ఎందుకో తెలియదు. భూమిని ఈ ఇంటి నుంచి పంపించాలన్న ఆలోచనే నాకు నచ్చడం లేదు. ఈసారి ఎవరైనా నాకు ఎఫైర్ ఉందని అంటే సాక్ష్యం చూపించమని నేనే వాళ్లను నిలదీస్తాను అంటాడు. నువ్వెంత నిలదీసినా.. పుకార్లను లోకం నమ్ముతుంది. ఒకవేళ నువ్వు ఆస్థిని నక్షత్ర పేరు మీద రాస్తే.. భూమికి ఏమీ ఇవ్వలేదని అదంతా పుకారే అనుకుంటారు అని అపూర్వ చెప్పగానే.. ఈ ఆస్థి అంతా శోభాచంద్రది అలాంటప్పుడు నక్షత్రకు ఆస్థిని రాయలేం కదా..? అంటాడు శరత్ చంద్ర. అపూర్వ కన్వీన్స్ చేయాలని చూస్తే.. కొన్నాళ్లు చూసిన తర్వాత అలాగే చేద్దాం అని శరత్ చంద్ర పడుకుంటాడు. మరోవైపు భూమి కోసం గగన్ దొంగచాటుగా శతర్ చంద్ర ఇంటికి వస్తాడు.
గగన్: మళ్లీ నేను ఈ ఇంటికి ఇలా వస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. ( మనసులో అనుకుంటాడు)
పూరి ఫోన్ చేస్తుంది.
పూరి: అన్నయ్యా భోజనం చేయలేదు కదా..? ఫ్రూట్స్ అయినా తింటావని నీ రూంకు వచ్చాను.
గగన్: భూమి కోసం వచ్చాను..
పూరి: భూమి కోసమా…? ఈ టైంలో ఎందుకు వెళ్లావు.
గగన్: వెళ్లమని నువ్వే కదా.. చెప్పావు. ఇప్పుడేంటి టైం చూసుకోమంటున్నావు.
పూరి: వాళ్లు చూస్తే పెద్ద గొడవలు అవుతాయి. ఇంతకీ గోడ దూకి వెళ్లావా..?
గగన్: హలో దొంగలా గోడ దూకి వెళ్లాల్సిన కర్మ నాకేం పట్టింది.
పూరి: మరి ఎలా వెళ్లావు.
గగన్: ఇంకా వెళ్లలేదు.
అని గగన్ చెప్పగానే నువ్వు భూమితో మాట్లాడాలి అంటే గొడవలు జరగకూడదు అంటే పిల్లిలా గొడ దూకి వెళ్లి మాట్లాడి వచ్చేయ్ అని చెప్తుంది పూరి. నేను పులిని ఎలా వెళ్లాలో నాకు తెలుసు ఫోన్ పెట్టేయ్ అంటూ కట్ చేస్తాడు గగన్. తర్వాత గోడ దూకి లోపలికి వెళ్తాడు. గగన్ ను చూసిన సుజాత భయంతో హాల్ లోంచి వెళ్లిపోతుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!