అన్వేషించండి

Krishna Mukunda Murari November 29th Episode : గత జ్ఞాపకాల్లో మురారి ముకుందతో పెళ్లికి ఏర్పాట్లు.. ముహూర్తం ఫిక్స్‌!

Krishna Mukunda Murari Today Episode : నిద్రలో మురారికి గతం గుర్తొచ్చి కృష్ణ అని పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

krishna mukunda murari serial today Episode : ముకుంద: కొంత మంది నీకు యాక్సిడెంట్ చేసి నీ రూపం మార్చి పాపం మూటకట్టుకున్నారు మురారి. మనిద్దరం ప్రేమించుకున్నప్పుడు సరదాగా లడఖ్ వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలు మురారి ఇవి. వేణి గారికి చూపిద్దాం అని తీసుకొచ్చా.. బాగున్నాయి కదా వేణిగారు. 

మురారి: (అక్కడి నుంచి వెళ్లిపోతూ) నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయ్.

మరోవైపు మధు మందు కొడుతూ ఉంటే అక్కడికి గౌతమ్ వస్తాడు. గౌతమ్‌కి తాగమని చెప్తాడు. దానికి గౌతమ్ వద్దు అంటాడు. ఎవరికి భయపడుతున్నావ్.. నందూకా అని అడుగుతాడు. ఎవరికి భయపడాలి అని గౌతమ్ ప్రశ్నిస్తే భయపడాలి.. ఇప్పుడున్న పరిస్థితులకు భయపడాలి అంటాడు మధు.

మధు: కృష్ణ ఇప్పుడున్న పరిస్థితికి భయపడాలి. తన జీవితం ఏమైపోతుందా అని బాధపడాలి. వరసకు వదిన అయినా నాకు తను చెల్లిలాంటిది. మధు మధు అని ఎంత ఆప్యాయంగా పలకరిస్తుంది. నన్నే కాదు ఎవర్నైనా అలాగే పిలుస్తుంది. ఎవరైనా తనకు ఫిదా అయిపోవాల్సిందే. అదేంటో ఇంతమందికి నచ్చే తను మా పెద్ద పెద్దమ్మకు నచ్చడం లేదు. అంతా తన బ్యాడ్ లక్. కాదు కాదు తనని అర్థంచేసుకోలేని ఈ ఫ్యామిలీ బ్యాడ్ లక్. 

గౌతమ్: మనం ఏం చేయలేమా.. తనకు ఇలా జరుగుతుంటే నాకూ నందూకి కూడా ఏదోలా ఉంది. మనసు తొలచివేస్తుంది. ఈరోజు మేమిద్దరం హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం తనే. కానీ తనకు మేము ఏం చేయలేకపోతున్నాం. పోనీ ఒక పని చేస్తే వాళ్లిద్దరినీ ఎక్కడికైనా పంపిస్తే. 

మధు: పెద్ద పెద్దమ్మ కచ్చితంగా చంపేస్తుంది. పెద్ద పెద్దమ్మని ఒప్పించడం తప్ప మరేం చేయలేం. అదొక్కటే ఈ సమస్యకు పరిష్కారం 

మరోవైపు మురారి పడుకుని ఉంటే గతం జ్ఞాపకాలు మెదలుతాయి. దీంతో కృష్ణ అని గట్టిగా పిలిచి లేస్తాడు. లేచే సరికి ఏదో పేరు పిలిచాను అనుకుంటాడు. కానీ గుర్తురాదు. మరోవైపు ముకుంద విని మురారికి గతం గుర్తురావొద్దని వేడుకుంటుంది. పరుగున మురారి గదికి వస్తుంది. మురారి సీరియస్‌గా ఉండడం చూసి గతం గుర్తొచ్చినట్లు ఉంది అని తెగ టెన్షన్ పడుతుంది. మురారి ఏమైంది అని అడుగుతుంది. 

మురారి: నేను ఇప్పుడు ఏమని పిలిచాను. నన్ను ఎవరో సార్ అని పిలిచారు. నువ్వు విన్నావా.. నువ్వు ఇక్కడే ఉన్నావుగా

ముకుంద: ఉన్నాను విన్నాను. 

మురారి: విన్నావా.. నేను ఏం అన్నాను. మాట్లాడు.

ముకుంద: అమ్మా అని అరిచావు. అవును మురారి నువ్వు అరిస్తే ఏమైందా అని కంగారుగా వచ్చాను. ఏమైంది నీకు. ఏదో పీడకల అయ్యింటుంది.

మురారి: అది పీడకల కాదు. ఎవరో అమ్మాయి నన్ను ఎంతో ప్రేమగా పిలిచింది

ముకుంద: ఇప్పుడు మురారి మూడ్ మార్చాలి. లేదంటే ఆ కృష్ణని గుర్తుచేసుకుంటాడు. 

మురారి: నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు

ముకుంద: ఎవరు అర్థం చేసుకోవడం లేదు మురారి. పీడకల వస్తే ఎవరైనా అమ్మా అనే అరుస్తారు అమ్మాయి అని అరవరు. పగలు రాత్రి కంటికి రెప్పలా నిన్ను చూసుకుంటుంటే నాకు మంచి బహుమతే ఇస్తున్నావ్లే. ఇదంతా నా ఖర్మ. ఎవర్ని అని ఏం లాభం. సరే కానీ రా అలా బాల్కానీకి వెళ్దాం.

మురారి: వద్దులే ముకుంద నువ్వు వెళ్లి పడుకో.

ముకుంద: పర్వాలేదులే నేను ఇక్కడే కింద పడుకుంటా..

మురారి: ఏం అన్నావ్.. ఇప్పుడు ఏం అన్నావు.. కింద పడుకుంటా అన్నావు కదా.. ఇదే మాట నాతో ఎవరో అన్నారు.

ముకుంద: నేనే అన్నా మురారి. అప్పుడు లఢఖ్ వెళ్లినప్పుడు మనకి ఒక్క రూమే దొరకడంతో నేను కింద పడుకుంటా అన్నాను నువ్వు వద్దు అని గొడవ చేశావు. దేవుడా మన ప్రేమ నీకు గుర్తొస్తుంది అన్నమాట. ఇది చాలు.

మురారి: ఏంటీ ముకుంద ఇలా మాట్లాడుతుంది. నాకేమో కనెక్ట్ అవ్వడం లేదు.

ముకుంద: నమ్మినట్టు లేడు. సరే మురారి ఏమైనా అవసరం అయితే నన్ను లేపు.

భవాని: మురారి ఎక్కడికి నాన్న.. ఏం మాట్లాడవేంటి. ఇంత పొద్దున్న ఎక్కడికి నాన్న.

మురారి: అదే వేణి గారి దగ్గరకు 

భవాని: ఏంటి నాన్న మురారి పోయి పోయి నువ్వు వాళ్ల మాయలో పడుతున్నావు. వాళ్లు మంచి వాళ్లు కాదు అని చెప్పినా వినే పరిస్థితిలో లేవు. నువ్వు వాళ్ల ఉచ్చులో పడక ముందే ముకుందతో నీ పెళ్లి జరిపించేస్తాను.

మధు: ఏయ్ ముకుంద ఎక్కడికో వెళ్తున్నట్లు ఉన్నావ్. అప్పుడే పెళ్లి కల వచ్చేసినట్లుంది. అయ్యో ముదురు పెళ్లి కల వచ్చేసిందే.

ముకుంద: మధూ.. మీరు ఎవరెన్ని అనుకున్నా నాకు మురారికి పెళ్లి జరిగి తీరుతుంది. 

రేవతి: ఈలోగ ఏమైనా జరగొచ్చు.

మధు: ఈలోపు మురారికి గతం కూడా గుర్తొచ్చేయెచ్చు.

రేవతి: ఏంటి గతం అనగానే ఇలా అయిపోయింది. మురారి ముకుందతో గతం గురించి ఏమైనా మాట్లాడాడా. 

ముకుంద: మీతో మాట్లాడటం వేస్ట్.

మరోవైపు బాక్స్ మూత తీయలేక కృష్ణ కుస్తీలు పడుతుంది. ఇంతలో మురారి అక్కడికి వస్తాడు. బాక్స్ మూత తీస్తా అంటూ ఒకరి మీద ఒకరు పడిపోతారు. మీకు దోశలు పంపిద్దామని బాక్స్ తీశామని కృష్ణ చెప్తుంది. ఇక నేనే వచ్చేశాను కదా ఇక్కడే తినేస్తాను అంటాడు. ఇక రాత్రి తనకు గుర్తొచ్చిన విషయం గురించి చెప్తాడు. అది విని కృష్ణ సంతోష పడుతుంది. ముకుంద చాటుగా వింటుంది. మురారికి కృష్ణ గతం గుర్తుకుతెచ్చుకోమని చెప్తుంది. ఈ సారి అలా గుర్తొస్తే పేపర్ మీద రాసుకోమని చెప్తుంది. ఇక మురారికి టిఫెన్ ఇస్తుంది. మరోవైపు అమెరికా ట్రిప్ క్యాన్సిల్ అయిందని, ముకుందకు మురారికి పెళ్లి చేయాలని అనుకుంటున్నానని విజయతో భవాని ఫోన్ చేసి చెప్తుంది. ఇక ఈ విషయాలు అన్ని ముకుంద తండ్రి శ్రీనివాస్‌కి కూడా చెప్పమని రేవతి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: విద్యా దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు: మంత్రి నారా లోకేష్
విద్యా దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు: మంత్రి నారా లోకేష్
Nirmala Sitaraman: చివరి దశకు కేంద్ర బడ్జెట్ - సంప్రదాయ హల్వా వేడుకలో నిర్మల
చివరి దశకు కేంద్ర బడ్జెట్ - సంప్రదాయ హల్వా వేడుకలో నిర్మల
Nandyal Girl Case: బాలిక మృతదేహానికి రాయి కట్టి నదిలో పడేసింది ఓ బాలుడి తండ్రి - నంద్యాల ఎస్పీ సంచలన విషయాలు
బాలిక మృతదేహానికి రాయి కట్టి నదిలో పడేసింది ఓ బాలుడి తండ్రి - నంద్యాల ఎస్పీ సంచలన విషయాలు
Telangana : తెలంగాణలో రేషన్ కార్డు లేకుండానే ఆరోగ్యశ్రీ సేవలు- రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణలో రేషన్ కార్డు లేకుండానే ఆరోగ్యశ్రీ సేవలు- రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PCB Threatened BCCI Regarding 2025 Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ సస్పెన్స్‌లో కొత్త అప్‌డేట్ | ABP Desamటీ20ల్లో ఓపెనర్లుగా ఈ నలుగురిలో ఎవరికి ఛాన్స్ | ABP DesamAnant Ambani gifts 2Cr Worth Watches |పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ కి కళ్లు చెదిరే గిఫ్టులిచ్చిన అంబానీVizianagaram Fort Lesser Known Story | దేశానికి ఆఖరి కోటగా చెప్పే విజయనగరం కోటపై ఆసక్తికర విషయాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: విద్యా దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు: మంత్రి నారా లోకేష్
విద్యా దీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కీమ్ అమలు: మంత్రి నారా లోకేష్
Nirmala Sitaraman: చివరి దశకు కేంద్ర బడ్జెట్ - సంప్రదాయ హల్వా వేడుకలో నిర్మల
చివరి దశకు కేంద్ర బడ్జెట్ - సంప్రదాయ హల్వా వేడుకలో నిర్మల
Nandyal Girl Case: బాలిక మృతదేహానికి రాయి కట్టి నదిలో పడేసింది ఓ బాలుడి తండ్రి - నంద్యాల ఎస్పీ సంచలన విషయాలు
బాలిక మృతదేహానికి రాయి కట్టి నదిలో పడేసింది ఓ బాలుడి తండ్రి - నంద్యాల ఎస్పీ సంచలన విషయాలు
Telangana : తెలంగాణలో రేషన్ కార్డు లేకుండానే ఆరోగ్యశ్రీ సేవలు- రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణలో రేషన్ కార్డు లేకుండానే ఆరోగ్యశ్రీ సేవలు- రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Free Bus Service: ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన
ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన
Supreme Court : విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్‌కు  స్వల్ప ఊరట - జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం
విద్యుత్ కమిషన్‌పై కేసీఆర్‌కు స్వల్ప ఊరట - జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశం
Game Changer: మెగా ఫ్యాన్స్‌కు ‘భారతీయుడు 2’ టెన్షన్ - భయం అక్కర్లేదు, ఎందుకంటే?
మెగా ఫ్యాన్స్‌కు ‘భారతీయుడు 2’ టెన్షన్ - భయం అక్కర్లేదు, ఎందుకంటే?
Viral News: శ్రీశైలంలో అద్భుత దృశ్యం - శివలింగాన్ని చుట్టుకుని ఉన్న నాగుపాము, వీడియో వైరల్
శ్రీశైలంలో అద్భుత దృశ్యం - శివలింగాన్ని చుట్టుకుని ఉన్న నాగుపాము, వీడియో వైరల్
Embed widget