Krishna Mukunda Murari Serial Today May 4th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ట్విస్ట్ అదుర్స్! ఆదర్శ్ ప్రేమకు పడిపోయానన్న ముకుంద.. సరోగసీ మదర్ కోసం మురారి ఎంక్వైరీ!
Krishna Mukunda Murari Serial Today Episode ముకుంద, ఆదర్శ్‌లకు పెళ్లి చేద్దామని భవాని కృష్ణ అభిప్రాయం అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Today Episode ముకంద దగ్గరకు ఆదర్శ్ వస్తాడు. ఈవినింగ్ ఫ్రీగా ఉండమని షాపింగ్‌కు వెళ్దామని చెప్తాడు. దీంతో ముకుంద తనకు బట్టల సెలక్షన్ రాదు అని చెప్పి తప్పించుకోవాలి అనుకుంటుంది. దీంతో ఆదర్శ్ నవ్వుతూ బట్టలు కొనేది నాకోసం కాదు అని నీ కోసమే అని అంటాడు.
ఆదర్శ్: మీరు ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ మీకు చీరలు కొనింది. అందరూ వేసిన బట్టలు వేసుకోకుండా తిరుగుతుంటే మీరు మాత్రం అవే చీరలు మార్చి మార్చి కడుతున్నారు. నాకు అది ఇష్టం లేదు అందుకే మీ కోసం చీరలు కొంటాను. మీరు రావాల్సిందే.
ముకుంద: మనసులో మీది ఎంత మంచి మనసు ఆదర్శ్ గారు. నా కోసం ఎంత ఎక్కువ ఆలోచిస్తున్నారు. నేను ముకుందగా ఉన్నప్పుడు కూడా నా కోసం ఎవరూ ఇలా ఆలోచించలేదు. కానీ ఇదంతా వృథానే ఆదర్శ్ గారు. ఎందుకంటే ఈ జన్మకు నాకు మురారినే జోడి.
ఆదర్శ్: ముకుంద నువ్వు ఏం మాట్లాడకుండా ఏం ఆలోచించకుండా రెడీగా ఉండు మనం షాపింగ్‌కు వెళ్దాం.
ముకుంద: అలాగే ఆదర్శ్ గారు. నేను ముకుంద కాకపోయి ఉంటే. నాకు మురారి లేకపోయి ఉంటే ఎప్పుడో మీ ప్రేమకు పడిపోయేదాన్ని ఆదర్శ్ గారు బ్యాడ్ లక్. ముకుంద, ఆదర్శ్ మాట్లాడుకోవడం భవాని చూస్తుంది.
కృష్ణకి డాక్టర్ వైదేహి కాల్ చేసి సరోగసీ మదర్ దొరికిందని వెంటనే హాస్పిటల్‌కి రమ్మని చెప్తుంది. దీంతో కృష్ణ హ్యాపీగా ఫీలవుతుంది. సంతోషంలో మురారిని పిలుస్తుంది. ఇంతలో భవాని కుంకుమ పువ్వు కలిపిన పాలు తీసుకొని వస్తుంది. దగ్గరుండి కృష్ణతో తాగిస్తుంది.
భవాని: అన్నట్లు నీకు ఓ విషయం చెప్పాను కదా. ఆదర్శ్, మీరాల పెళ్లి గురించి నువ్వేం ఆలోచించావ్.
కృష్ణ: మనం ఆలోచించేది ఏముంది అత్తయ్య. ఇంతకీ వాళ్లద్దరికీ ఇష్టమేనా.
భవాని: ఇష్టమే అనిపిస్తుంది. ఇప్పుడే విన్నాను వాళ్లిద్దరూ షాపింగ్‌కు వెళ్లాలి అనుకుంటున్నారు. నువ్వు నేను ఎవరూ ముకుంద గురించి ఆలోచించలేదు. కానీ వాడు ఆలోచించాడు. మా అమ్మ ఇచ్చిన బట్టలు తప్ప వేరే బట్టలు లేవు అని కొనడానికి వెళ్తున్నాడు. ఇంత కంటే ఏం కావాలి వాడు ముకుందని ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలీడానికి. ఇక ముకుందకి కూడా ఎవరూ లేదు. మంచి పిల్ల నీలాగే మన ఇంటి కోసం ఆలోచిస్తుంది. పెళ్లి చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది.
కృష్ణ: అలాగే అత్తయ్య రేపు ఒకసారి ఏసీపీ సార్‌తో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్తున్నాం.
భవాని: హాస్పిటల్‌కా ఎందుకు.
కృష్ణ: టెస్ట్‌ల కోసం అత్తయ్య.
భవాని: సరే నేను వస్తా. ఇక నుంచి నేను దగ్గరుండి చూసుకుంటా.
కృష్ణ: మీకు ఉందుకు అత్తయ్య శ్రమ ఏసీపీ సార్ చూసుకుంటారు.
ఇంతలో మురారి వస్తే కృష్ణ సైగ చేస్తుంది. దీంతో మురారి కూడా భవానిని హాస్పిటల్‌కి రావొద్దుని అంటాడు. ఇక రేవతి వచ్చి రానివ్వండిరా అంటే మురారి కవర్ చేసి వద్దని అంటాడు. దీంతో భవాని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. ఇక అత్తల ప్రేమను పొందే అదృష్టం అర్హత నాకు లేదని కృష్ణ బాధ పడుతుంది. మురారి సర్ది చెప్తాడు. ఇక కృష్ణ, మురారి ఇద్దరూ హాస్పిటల్‌కి వెళ్తారు.
ఇక మధ్యలో మురారి కారు ఆపి కొబ్బరి బొండాలు కొనడానికి వెళ్తాడు. ఇంతలో కృష్ణ కనిపించదు. మురారి కంగారు పడి కృష్ణ కోసం తెగ వెతుకుతాడు. అయితే కృష్ణ సమీపంలో ఉన్న అనాథాశ్రమానికి వెళ్లి పిల్లలతో ఆడుకుంటుంది. మురారి వెళ్లి కృష్ణని తిడతాడు. కంగారు పడ్డానని అంటాడు. ఇక కృష్ణ పిల్లలు ముచ్చటగా ఉన్నారని ఓ పాపని దత్తత తీసుకొని పెద్దత్తయ్యకి ఇచ్చేద్దామని ఎగ్జైట్ అవుతుంది.
మురారి: కృష్ణ నీ ఆలోచన బాగానే ఉంది కానీ మీరు పిల్లల్ని కనకుండా దత్తత తీసుకున్నారని అడిగితే ఏం చెప్తామని ఆలోచించావా.
కృష్ణ: అవును కదా. ఈ మట్టి బుర్రకి ఆలోచనే తట్టలేదు. పిల్లల్ని చూడగానే అంతా మర్చిపోయా.
మురారి: నీకు అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. సరోగసీ పూర్తి అయ్యేవరకు మరేం ఆలోచించకు పద. డాక్టర్ వెయిట్ చేస్తుంటారు.
సరోగసీ ప్రాసెస్ కోసం కృష్ణ, మురారిలు సంతకాలు పెడతారు. రేపటి నుంచి ప్రాసెస్ స్టార్ చేద్దామని డాక్టర్ వైదేహి చెప్తుంది. ఇక కృష్ణ ఆ మదర్‌ని చూపించమని రిక్వెస్ట్ చేస్తుంది. డాక్టర్ చెప్పను అని అంటే కృష్ణ బాధ పడుతుంది. ఇక మురారి ఆ మదర్‌ని కనిపెట్టి నీకు చూపిస్తాను అని కృష్ణకు చెప్తాడు. ఇక మురారి పరిమళకు కాల్ చేయాలి అనుకుంటాడు. ఇక కృష్ణ సరోగసీ మదర్‌ని ఇంట్లో వాళ్లని ఎలా మ్యానేజ్ చేయాలా అని ఆలోచిస్తుంది. మరోవైపు మురారి మరో డాక్టర్ దగ్గరకి వచ్చి పరిమళ చెప్పిందని చెప్పి సరోగసీ మదర్ గురించి అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.