Krishna mukunda Murari Serial Today february 23rd: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్: ముకుంద శోభనానికి ఏర్పాట్లు చేసిన కృష్ణ, తప్పించుకునేందుకు ముకుంద కొత్త ప్లాన్
Krishna mukunda Murari Today Episode: ముకుంద శోభనానికి కృష్ణ పంతులును పిలిపించి ముహూర్తం ఫిక్స్ చేయించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Krishna mukunda Murari Serial Today Episode: మురారితో తీసుకున్న సెల్ఫీలు చూసుకుంటూ ముకుంద బయటకి వెళ్ళి ఆదర్శ్ కి నిజం చెబుదామనుకుంటే అక్కడ శోభనం ఏర్పాట్లు చేశారు. ఎవరో చేసి నేను చేశానని నామీద పెట్టారు. అసలు చేసింది ఎవరు. ఏం చేసినా ఆ టైమ్ లో ఏదో ఐడియా వచ్చి తప్పించుకున్నాను లేదంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేది. నా వల్ల కాదు మురారి ఆదర్శ్ కి అంతా చెప్పేస్తాను అనుకుంటుంది. అప్పుడే ఆదర్శ్ ముకుంద కోసం జ్యూస్ పట్టుకుని వస్తాడు.
ఆదర్శ్: సాయంత్రంలోపు తగ్గకపోతే హాస్పిటల్ కి వెళ్దాం. నీకు ఏం కావాలన్నా ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వు క్షణాల్లో నీ కాళ్ళ దగ్గర ఉంటుంది.
ముకుంద: ఒక మనిషి ప్రేమ ఇంతలా బాధ కలిగిస్తుందని జీవితంలో మొదటి సారి అనుభవంలోకి వస్తుంది.
మరోవైపు రేవతి దగ్గరకి కృష్ణ వచ్చి సరదాగా మాట్లాడుతుంది. ముకుంద పరిస్థితి ఎలా ఉందని రేవతి అడుగుతుంది. బాగానే ఉంది కానీ పెద్దత్తయ్య ఎన్నో సార్లు ఊరు వెళ్లారు మరి ఈసారి నాకు మాత్రమే ఎందుకు బాధ్యత అప్పగించారని కృష్ణ అంటుంది. ఎందుకంటే నీమీద నమ్మకం ఉందని రేవతి చెప్తుంది. ఈ ట్రిప్ కి వెళ్లకపోయి ఉంటే అసలు అనుమానం వచ్చి ఉండేది కాదు. రేపు తేలుస్తాను అసలు పెద్దత్తయ్య అనుమానం నిజమో కాదో.. అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఇంతలో ఇంటికి పంతులు వస్తాడు. కృష్ణ తనే రమ్మన్నానని చెప్తుంది. శోభనానికి మంచి ముహూర్తం పెట్టమని కృష్ణ పంతులికి చెప్తుంది. ఇంతలో ముకుంద టెన్షన్ పడుతుంది. కాలు బెణికిందని అక్కడ తప్పించుకుంటే ఇక్కడ ఇంటికి రాగానే ముహూర్తాలు పెట్టిస్తున్నారని కంగారుపడుతుంది. ముకుంద, ఆదర్శ్ దంపతుల శోభనానికి రేపు మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఆదర్శ్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎలా తప్పించుకోవాలని ముకుంద ఆలోచనలో పడుతుంది.
పంతులు: కృష్ణ, మురారి శోభనానాకి కొంత కాలం వేచి చూడక తప్పదు. ఇంకో మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు.
ముకుంద: ఇప్పుడు ఇదంతా ఏం వద్దు తర్వాత చూసుకుందాం
కృష్ణ: ఎందుకు వద్దు రాత్రి నువ్వే కదా అక్కడ ఏర్పాట్లు చేసింది. అక్కడ కాలు బెణికి క్యాన్సిల్ అయ్యింది. ఇక్కడ అవే ఏర్పాట్లు చేస్తే ఎందుకు వద్దని అంటున్నావు.
రేవతి: ఎప్పుడు ఏర్పాటు చేద్దామన్నా ఏదో ఒక ఆటంకం ఇప్పుడు అన్ని కుదిరితే నువ్వు ఎందుకు వద్దంటున్నావు.
అనగానే కాలు బెణికింది కదా ఇప్పుడు ఎందుకని ముకుంద అంటుంది. పెద్ద దెబ్బ ఏం కాదు సాయంత్రానికి సెట్ అయిపోతుందని కృష్ణ చెప్తుంది. నాకు నిజంగా దెబ్బ తగల్లేదని కృష్ణ కనిపెట్టేసిందేమోనని ముకుంద టెన్షన్ పడుతుంది. అయితే ముందు రోజే కృష్ణ పంతులు దగ్గరకు వెళ్లి రేపటి ముహూర్తం ఖాయం చేయమని.. ఒక్క జంటకి మాత్రమే శోభనం పెట్టాలని పంతుల్ని అడుగుతుంది.
పంతులు: ఎందుకమ్మా అప్పుడు కూడా ముహూర్తాలు ఉన్నాయి. కానీ భవానీ దేవి కొద్ది రోజులు వాయిదా వేయమని చెప్పారు. ఇప్పుడు మీరు ఒక జంటకి ముహూర్తం పెట్టమంటున్నారు.
కృష్ణ: మా కుటుంబం మంచి కోసమే నేను ఇలా అడుగుతుననాను.
పంతులు: మీ కుటుంబానికి మంచి జరుగుతుందంటే ఏం చేయమన్నా చేస్తాను.
కృష్ణ: అయితే ముకుంద, ఆదర్శ్ దంపతులకు మాత్రమే రేపు ముహూర్తం ఉందని చెప్పండి మాకు మాత్రం రెండు మూడు నెలల వరకు లేవని చెప్పండి.
అనగానే పంతులు సరేననమ్మా అంటాడు. ఈ విషయాన్ని కృష్ణ గుర్తు చేసుకుంటుంది. శోభనం చెడగొట్టడానికే ముకుంద ప్రయత్నిస్తుందని కృష్ణ ఆలోచిస్తుంది. ఆదర్శ్ అంటే ఇష్టం లేనట్లుంది. ఇంకా ఏసీపీ సార్ గురించే ఆలోచిస్తుందేమోనని కృష్ణ టెన్షన్ పడుతుంది. మురారి గదిలోకి వచ్చినా పట్టించుకోకుండా ఆలోచనల్లో మునిగిపోయి ఉంటుంది కృష్ణ. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ఓ రేంజ్‌లో గ్లామర్ షో - 'టిల్లు స్క్వేర్'కు అనుపమ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?