Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!
Krishna Mukunda Murari Latest Promo : నిద్రలో ఉన్న మురారి కి గతం లీలగా గుర్తుకు రావటంతో కృష్ణని పేరు పెట్టి పిలవడంతో కథలో అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. నిజంగానే మురారికి గతం గుర్తుకు వచ్చిందా?
![Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద! Krishna mukunda murari serial November 29th episode serial promo update Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/28/31ee974d276f35a75b237118f5110ba91701173650101891_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Krishna Mukunda Murari november 29th Promo : స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణ ముకుందా మురారి సీరియల్ మంచి టీఆర్పి రేటింగ్ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ముక్కోణపు ప్రేమ కథ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సీరియల్ మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుంటుంది.
ఈరోజు ఎపిసోడ్లో మా ఇల్లు ఇప్పటివరకు బృందావనంలాగా ఉండేది నువ్వు వచ్చిన తర్వాత ఇంటిని నరకం చేసేసావు. కృష్ణ అమాయకురాలు తనకు ఏమీ తెలియదు అని ముకుందతో అంటుంది రేవతి. మీ అక్క అంత అమాయకురాలు ఏమీ కాదు అయినా కొత్తపల్లి ప్రభాకర్ మా చిన్నాన్న అందుకే జైల్లో ఉన్నారు.
మురారి చనిపోయాడని డెడ్ బాడీ ఇంటికి తీసుకువచ్చింది. నేనే అంటూ ఇవన్నీ కృష్ణ చేసింది కదా ముందు వాటి గురించి మాట్లాడి అప్పుడు కృష్ణ గురించి మాట్లాడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భవాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు మురారి ఇంతలో భవాని వచ్చి నీ గతం గురించి రెండు రోజుల తర్వాత చెబుదామనుకున్నాను కానీ ఇప్పుడే చెప్పేస్తున్నాను.
నువ్వు ముకుందతో ప్రేమలో ఉన్నావు ఆమెకి నీకు తొందర్లోనే పెళ్లి అంటుంది. మీరు చెప్పేది నమ్మాలనిపించడం లేదు అంటాడు మురారి. నువ్వు ఆ వేణిని తప్ప ఎవరిని నమ్మటం లేదు అసలు ఆ స్పేస్ నీకు ఆ వేణి ఇవ్వటం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భవాని.
మరోవైపు వాళ్ళ పెళ్లి ఫోటో చూసుకొని మీకు ఎప్పుడు గతం గుర్తుకు వస్తుంది అని బాధగా అనుకుంటుంది కృష్ణ. అప్పుడే అక్కడికి వచ్చిన ముకుంద ఆ ఫోటో లాక్కొని కాల్చేయాలి అనుకుంటుంది. కృష్ణ వాళ్ళ పిన్నిని అగ్గిపెట్టి అడిగి ఫోటో కాలుస్తుంటే కృష్ణ ఆ ఫోటో లాక్కొని ఈ ఫోటో ఏసీపీ సర్ కి చూపిస్తాను. ఎవరు కాల్చారు అంటే నీ పేరే చెప్తాను అంటుంది.
ఈ ఫోటో కాల్చినంతమాత్రాన మమ్మల్ని వేరు చేయలేవు నా మనసులో ఏసీపీ సార్ ఉన్నట్టే ఆయన మనసులో కూడా నేను మాత్రమే ఉన్నాను అంటుంది. ఇదంతా ఇంకెన్నాళ్లు ఇంకొక వారం పది రోజుల్లో నాకు మురారి కి పెళ్లి అని చెప్పి మనసులో మురారి కి లడక్ లో మేము తీయించుకున్న ఫోటోలు చూపించాలి అనుకుంటుంది ముకుంద. మరోవైపు పెద్దమ్మ చెప్పింది నమ్మాలనిపించడం లేదు.
ముకుందని నేను ప్రేమించినట్లయితే ఆమెతో ఉన్నప్పుడు నాకు ఎలాంటి ప్రకంపనలు కలగడం లేదు అనుకుంటాడు మురారి. వేణి గారితో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకొని ఆమె దగ్గరికి వెళ్తాడు. మరోవైపు ఇంట్లో ఒంటరిగా అయిపోయాను తనతో పాటు ఇంట్లోకి రమ్మని కృష్ణ దగ్గరికి వచ్చి అడుగుతుంది రేవతి.
ఇప్పుడు ఎలా రాగలను అత్తయ్య, ఆయనని అమెరికా ఎలా అయితే వెళ్లనివ్వలేదో అలాగే ఈ పెళ్లి కూడా జరగనివ్వను అంటుంది కృష్ణ. మరోవైపు ఫోటోలు మురారి కి చూపించాలనుకుంటుంది ముకుంద. రూమ్లో మురారి కనిపించకపోవడంతో కృష్ణ దగ్గరే ఉంటాడు అనుకొని అక్కడికి వెళ్లి ఆ ఫోటోలు చూపిస్తుంది. ఫోటోలో ముకుందని గుర్తుపడతాడు కానీ తన ఫోటోని తాను గుర్తుపట్టలేక పోతాడు మురారి. అప్పుడు కృష్ణ అది మీరే అని చెప్తుంది. ఆ మాటలు విని షాక్ అవుతాడు మురారి.
ఇక రేపటి ప్రోమోలో...
నిద్రపోతున్న మురారికి కృష్ణతో తను ఆనందంగా గడిపిన క్షణాలు గుర్తుకు వస్తాయి. కృష్ణ అని పెద్దగా అరుస్తూ నిద్రలేస్తాడు. నేను ఎవరినో పేరు పెట్టి పిలిచాను ఎవరిని అని అనుకుంటాడు. మురారి కృష్ణని పేరు పెట్టి పిలవడం విన్న ముకుంద భయపడుతూ అక్కడికి వస్తుంది.
మురారి కృష్ణని పేరు పెట్టి పిలిచాడు అంటే గతం గుర్తుకు వచ్చేసిందేమో అని కంగారు పడిపోతుంది. నిజంగానే మురారికి గతం గుర్తుకు వచ్చిందా, ముకుంద అనుమానమే నిజమా లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)