News
News
X

Karthika Deepam September 3 Today Episode 1448: మోనితకు వాంతులు - దీపపై రివర్సైన కార్తీక్, మళ్లీ మొదటికొచ్చిన 'కార్తీకదీపం' కథ

Karthika Deepam September 3 Today Episode: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

FOLLOW US: 

Karthika Deepam September 3 Today Episode 1448

దీపతో మాట్లాడి ఇంటికి వచ్చిన కార్తీక్..దీప మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటాడు. అయినా నాకు తన పేరు బానే గుర్తుంది. చూద్దాం రేపుకూడా గుర్తుంటుందో లేదో అని అనుకుంటాడు. రోజంతా ఆటోలో తిరిగినా అమ్మానాన్న కనిపించలేదని వారణాసితో చెప్పి బాధపడుతుంది శౌర్య. ఆ వెంటనే మోనిత... ఎందుకయ్యా దేవుడా దీన్ని మళ్ళీ బతికించి నా దగ్గరకు పంపించావనుకుంటుంది. కార్తీక్ కి ఎలాగైనా మందులు పెట్టి నా వశం చేసుకోవాలనుకుంటే దీన్ని పంపించి అంతా పెంట చేయించావు. ఇప్పుడు ఇది విశ్వ ప్రయత్నాలు చేసి కార్తీక్ కి గతం గుర్తొచ్చేలా చేస్తుంది. ఎలాగైనా దీన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపో అనే లోగా దీప ఇంట్లో అడుగుపెడుతుంది. అప్పుడు మోనిత....తీసుకెళ్లమంటే తీసుకొచ్చావేంటయ్యా దేవుడా అనుకుంటుంది. 
దీప: డాక్టర్ బాబు అని పిలుస్తుంది. కార్తీక్ అక్కడకు రాగానే...డాక్టర్ బాబు మీకోసం వంటచేసి తీసుకొచ్చానంటుంది
కార్తీక్: నన్ను డాక్టర్ బాబు అని పిలవద్దు
దీప: మిమ్మల్ని డాక్టర్ బాబు అని మొనితని డాక్టరమ్మా అని పిలవాలని ఉంది. కాదనకండి
కార్తీక్: మోనిత చిరాగ్గా వద్దన్నా సరే కార్తీక్ పోనీలే పిలవనీ అంటాడు. దీప వడ్డించిన బిర్యానీ ఆనందంగా తింటాడు కార్తీక్. ఇలాగే ప్రతి రోజూ చేయమని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దీప: మోనిత తో చూసావా ప్రతిరోజూ తెమ్మన్నారు,ఆయన మనసులో నాకంటూ ఒక చోటు ఉంది, అందుకే నేను వచ్చినప్పుడల్లా అంత ఉత్సాహంగా ఉంటున్నారు. కాకపోతే నీ మందుల వల్ల తన బుర్ర లో  లేను అది కూడా నేను తప్పకుండా తెస్తాను,ఇది ఆరంభం మాత్రమే అనేసి వెళ్లిపోతుంది..
శౌర్య-వారణాసి: అదే సమయంలో శౌర్య కూడా..వాళ్లింట్లో బిర్యానీ తింటూ దీపను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్క చేసిన బిర్యాని తినడం కాదు..అక్క చేసిన బిర్యానీనే అందర్నీ కలుపుతుంది అంటాడు వారణాసి...

Also Read: దీపని ఇంటికి ఆహ్వానించిన కార్తీక్, మోనితలో మొదలైన టెన్షన్

మరోవైపు దీప...డాక్టర్ వాళ్ళ అమ్మకి కాల్ చేసి జరిగినదంతా చెబుతుంది దీప. చాలా ఉత్సాహంగా ఉన్నావమ్మా..డాక్టర్ బాబుకి నిజంగా గతం గుర్తొస్తే గంతులేస్తావేమో అంటుంది. అవునమ్మా నేను చాలా ఆనందంగా ఉన్నాను అంటుంది దీప. అప్పుడు ఆ డాక్టర్ అన్నయ్య స్పందించి...మోనితని తన భార్యగా కార్తీక్ నమ్ముతున్నాడా అని దీపని అడిగితే నమ్ముతున్నారు అన్నయ్యా అంటుంది.అందుకే తనకు చేయికాలిందని నన్ను వంటచేయమన్నారని చెబుతుంది.తనని భార్య అని నమ్ముతున్నప్పుడు తనతో పిల్లల్ని కంటే ఏం చేస్తావని అడుగుతారు. దీప ఆలోచనలో పడిపోతుంది. 

శౌర్య-వారణాసి
వారణాసి: నిజంగా నీకు అమ్మ,నాన్న లు బతికే ఉన్నారని నమ్మకం ఉందా 
శౌర్య: అమ్మానాన్నలు ఫోటోలు ఉంటే మనం ఊరంతా అతికించి వాళ్ళని కనిపెట్టడానికి ప్రయత్నించే వాళ్ళం కానీ అమ్మా నాన్న ఫోటోలు అన్నీ పోయాయి 
వారణాసి: పోని మీ తాత గారి దగ్గరికి వెళ్లి ఫోటో అడుగుదామా అంటే  వద్దు అని తిడుతుంది. నువ్వు మీ అమ్మ నాన్న బతికే ఉన్నావని నమ్ముతుంటే హిమ తో ఎందుకు మాట్లాడట్లేదు
శౌర్య: నువ్వు నన్ను వాళ్లతో కలపడానికి వచ్చావా నిజం చెప్పు నాకు అలాంటివి నచ్చవు, ఇంక ఈ విషయం ఇక్కడతో వదిలయ్, అమ్నానాన్నలు కనిపించినప్పుడో హిమపై కోపం పోతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 

Also Read: గుప్పెడంతమనసులో ఉప్పెనంత ప్రేమ, ఏడిపించేసిన రిషి - ఇక దేవయాని,సాక్షి పనైపోయినట్టేనా!

కూరగాయలు తీసుకుని ఇంట్లోకి వచ్చిన దీప..ఒకప్పుడు బతకడం కోసం వంటలు చేశాను, ఇప్పుడు నా బతుకుకోసం వంటలు చేస్తున్నాను...ఈ ప్రయత్నం వల్ల ఆయనలో కొంతైనా మార్పొస్తుంది కదా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది..

సోమవారం ఎపిసోడ్ లో
మోనిత వాంతి చేసుకుంటుంది...డాక్టర్ వచ్చి ఫుడ్ పాయిజన్ జరిగిందని చెబుతారు. కోపంతో ఊగిపోయిన కార్తీక్ దీపకు క్లాస్ పీకుతాడు..డబ్బుకోసం ఇదంతా చేస్తున్నావా, పరాయి స్త్రీ భర్తని కోరుకుంటున్నావా అని మాటలంటాడు...

Published at : 03 Sep 2022 08:42 AM (IST) Tags: Karthika Deepam Serial karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Nirupam Sobha Shetty premi archana doctor babu vantalakka monitha soundarya Karthika Deepam September 3 Today Episode 1448

సంబంధిత కథనాలు

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Guppedantha Manasu September 24th Update: రిషిధార దోబూచులాట, రిషి కోపాన్ని డామినేట్ చేసిన వసు ప్రేమ

Guppedantha Manasu September 24th Update:  రిషిధార దోబూచులాట, రిషి కోపాన్ని డామినేట్ చేసిన వసు ప్రేమ

Gruhalakshmi September 24th Update: సామ్రాట్ భార్య గురించి నీచంగా మాట్లాడిన అభి- మీడియా ముందు తులసి పరువుపోయేలా చేసిన లాస్య

Gruhalakshmi September 24th Update: సామ్రాట్ భార్య గురించి నీచంగా మాట్లాడిన అభి- మీడియా ముందు తులసి పరువుపోయేలా చేసిన లాస్య

టాప్ స్టోరీస్

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'