Karthika Deepam మే 26(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్ చేసిన పనికి జ్వాల, హిమ హ్యాపీ- రగిలిపోతున్న శోభ, స్వప్న
శోభ ప్లాన్ బెడిసికొడుతుంది. ఈ స్కెచ్ సంగతి తెలియని జ్వాల, హిమ... జరుగుతున్న పరిణామాలతో హ్యాపీగా ఉంటారు.
డబ్బులు ఇలా ఎందుకు పారేసుకుంటారని... పోగొట్టుకుంటే డబ్బులైనా మనుషులైనా తిరిగి రావడం కష్టమని ఓ సలహా ఇచ్చి స్వప్న ఇంటి నుంచి వెళ్లిపోతుంది జ్వాల. వెళ్లే టైంలో శోభ, జ్వాల మధ్య చిన్న ఫైట్ నడుస్తుంది.
ప్రేమ్ తన బెడ్‌రూంలో హిమ కోసమే ఆలోచిస్తుంటాడు. హిమ మనసులో ఏముందో అని అనుకుంటాడు. నేనంటే ఇష్టమని ఎందుకు చెప్పడం లేదు... నా బుద్ది ఏమైందీ అని అనుకొని... మనసులో మాట చెప్పేద్దామనుకుంటాడు. ఇంతలో సత్యం వచ్చి ప్రేమ్ నీలో ఏదో మార్పు కనిపించిందని ప్రశ్నిస్తాడు. మునపటి ఉత్సాహం లేదని అంటాడు. ఏమైనా అమ్మపై బెంగపెట్టుకుంటే వెళ్లమని చెప్తాడు. అంత ఓపిక లేదని నేను వెళ్లనని చెప్పేస్తాడు. హిమ టాపిక్ మళ్లీ ఇద్దరి మధ్య వస్తుంది. స్వప్నకు భయపడే హిమ పెళ్లి వద్దందా అని డౌట్ రైజ్ చేస్తాడు సత్యం. ప్రేమ్‌లో కూడా అదే డౌట్ రైజ్ అవుతుంది.
నిరుపమ్‌ను తన దారిలోకి ఎలా తెచ్చుకోవాలా అని ఆలోచిస్తుంటుంది శోభ. ముందు ఆ ఆటోదానితో ఫ్రెండ్‌షిప్ కట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. హిమపై కోపంతో ఆటోదానికి దగ్గరవుతాడని... అవసరమైతే తాళి కట్టినా కడతాడని గ్రహిస్తుంది. ఈలోపే నిరుపమ్ మనసు తనవైపు మళ్లించుకోవాలని స్కెచ్ వేస్తుంది. ఎప్పుడూ నిరుపమ్‌కు దగ్గరగానే ఉండాలని అనుకుంటుంది. నిరుపమ్‌ను పెళ్లి చేసుకొని తన ఆసుపత్రి కోసం చేసిన అప్పు తీర్చాలనుకుంటుంది.
ఫుల్‌గా తాగిన తన బాబాయ్‌ను ఇంటికి తీసుకెళ్తుంది జ్వాల. ఇంతలో సౌందర్య వచ్చి జ్వాలకు సాయం చేస్తుంది. తన బాబాయ్‌ను సౌందర్యకు పరిచయం చేస్తుంది జ్వాల. బాబాయ్ ఇలా చేస్తుంటే ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తుంది. రోజూ ఇంటి వద్దే తాగేవాడని... ఇవాళే ఇలా చేస్తున్నాడని జ్వాల చెబుతుంది. ఇంత జరిగినా నీకు ఆయనపై కోపం ఎందుకు రావడం లేదెందుకు అని అడుగుతుంది సౌందర్య. నా బాబాయ్‌పై నాకెందుకు కోపమని అంటుంది. మీ అబ్బాయి తాగి వస్తే మీరు కోప్పడతారా అని ప్రశ్నిస్తుంది. అంతే సౌందర్యకు పాతన జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వెంటనే వెళ్లి జ్వాలను కౌగిలంచుకొని ముద్దు పెడుతుంది. నా కొడుకును గుర్తు చేశావు... నీకు మంచి మొగుడు వస్తాడని దీవించి జ్వాలను పంపిస్తుంది సౌందర్య.
హిమతో జరిగిన ఎపిసోడ్‌ను శోభకు వివరిస్తాడు నిరుపమ్. హిమ మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టంగా ఉందంటాడు. హిమ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్లాన్ చెబుతుంది శోభ. హిమ ముందు వేరే అమ్మాయితో చనువుగా ఉన్నట్టు యాక్ట్ చేయమని సలహా ఇస్తుంది. దాన్ని తట్టుకోలేక మనసులో మాట బయటకు చెబుతుందని వివరిస్తుంది. నిరుపమ్‌కు క్లోజ్ అంటే తానే అని తనతోనే ప్లాన్ వర్కౌట్ చేస్తాడని ఊహిస్తుంది.
ఈ డిస్కషన్ జరుగుతుండగానే జ్వాల అక్కడకు వస్తుంది. తన బాక్స్ ఇస్తే వెళ్లిపోతానంటూ చెబుతుంది. సడెన్‌గా శోభ చెప్పిన ఐడియా గుర్తుకు వస్తుంది వర్కౌట్ చేసే పనిలో పడతాడు నిరుపమ్. హిమ ముందు జ్వాలతో క్లోజ్‌గా ఉన్నట్టు నటిస్తుంటాడు నిరుపమ్. దీన్ని చూసిన శోభ షాక్ తింటుంది. నాతో క్లోజ్‌గా ఉంటాడనుకుంటే ఈమెతో ఉన్నాడేంటని కంగుతింటుంది.
విషయాన్ని స్వప్నకు చేరవేస్తుంది శోభ. జ్వాల ఊరమాస్ బ్యాచ్ అని స్వప్న చెబుతుంది. ఆ ఐడియా తానే ఇచ్చానని... కానీ జ్వాలతో వెళ్తాడని ఊహించలేదంటుంది. కాస్త టైం ఇస్తే నిరుపమ్‌ను బుట్టలో వేసుకుంటుందని చెబుతుంది శోభ. ఆలోచిస్తూ కూర్చోవద్దని... త్వరగా ఏదో ఒకటి చేయాలని స్వప్న తొందర పెడుతుంది. కచ్చితంగా చేస్తానంటుంది.
రేపటి ఎపిసోడ్
జ్వాాల, నిరుపమ్ చాలా క్లోజ్‌గా ఉంటారు. దీన్ని చూసిన హిమ లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ బయటకు మాత్రం కోపంగా ఉన్నట్టు నటిస్తుంది. తన ప్లాన్ వర్కౌట్ అయిందన్న ఫీల్‌లో నిరుపమ్ ఉంటాడు.