అన్వేషించండి

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

నిరుపమ్‌తో పెళ్లిని హిమ ఎందుకు కాదన్నదో తెలుసుకునే పనిలో ఉంది సౌందర్య. ఆమె మనసులో మాట కనిపెట్టేందుకు జ్వాలను వాడుకోవాలని చూస్తోంది.

ఇంటి నుంచి వెళ్లిపోతున్న  హిమను ఉండేలా మాట్లాడుతుంది సౌందర్య. హాలిడేస్‌లోనైనా వస్తావా రావా అని ప్రశ్నిస్తుంది. నిశ్చితార్థం క్యాన్సిల్‌ అయిన విషయాన్ని మనసులో పెట్టుకొని దెప్పి పొడుస్తుంది. వాటికి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్‌గా ఉండిపోతుంది హిమ. మేమంతా బోర్‌ కొడుతున్నామని.. మంచిగా సంపాదిస్తున్నప్పుడు మా అవసరం ఏముంటుందిలే అంటుంది. వెళ్లే ముందు పెళ్లి ఎందుకు వద్దన్నావో చెప్పి వెళ్లమని రిక్వస్ట్ చేస్తుంది. కారణం చెప్పి వెళ్లమంటుంది. పెళ్లి సెట్ చేస్తే ఆనందపడిన నువ్వు ఎందుకు వద్దన్నావో చెప్పకుండా వెళ్లిపోతే ఎలా వదిలేస్తామంటూ క్లాస్ తీసుకుంటుంది. ఏమీ అడగకుండా ఎలా ఉంటామని క్వశ్ఛన్ చేస్తుంది. సమాధానం ఉన్నప్పటికీ మాకు చెప్పడం లేదని అంటుంది సౌందర్య. సమాధానం చెప్పిన తర్వాత ఇంటి గడప దాటాలంటోంది. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని... నా నుంచి తప్పించుకోవడానికే ఇంటి నుంచి వెళ్లిపోతున్నావని అభిప్రాయపడుతుంది సౌందర్య. ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు సమాధానం చెప్పమని ఆర్డర్ వేస్తుంది సౌందర్య. ఆ మాటకు సౌందర్యను గట్టిగా హిమ కౌగిలించుకుంటుంది. 

తన ఇంట్లో ఆనందంతో డ్యాన్స్ చేస్తుంది జ్వాల. ఆమె ఆనందం చూసి పిన్ని బాబాయ్‌ చాలా సంతోష పడతారు. ఆనందంగా ఉన్నానని... ఇవాళ పార్టీ ఇస్తానని చెబుతుంది జ్వాల. అలా ఖర్చు పెట్టడం కంటే.. ఇంటిలోనే వండుకుందామని సలహా ఇస్తారు పిన్నీబాబాయ్. వాళ్లకు డబ్బులు ఇచ్చి బయటకు వెళ్లిపోతుంది జ్వాల. 

డైనింగ్ టేబుల్‌పై కూర్చొని నిశ్చితార్థం గురించే ఆలోచిస్తుంటాడు నిరుపమ్‌. అతనికి వడ్డిస్తున్న స్వప్న... క్లాస్ తీసుకుంటుంది. హిమ వద్దన్నా ఎందుకు బాధపడుతున్నావని ప్రశ్నిస్తుంది స్వప్న. అదే జీవితమని తాగుతూ బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేనంటుంది. దాన్నే తలుచుకొని బాధపడటం ఏం బాగాలేదంటుంది. ఆ నష్టజాతకురాలు ఇంటికి రాకపోవడం మంచిదే అంటుంది. దాన్ని మరిచిపోమంటుంది. రాత్రుళ్లు అలా అసహ్యంగా అలాంటి వాళ్లతో రావద్దని సజెస్ట్ చేస్తుంది స్వప్న. అమ్మ అలా మాట్లాడుతుంటే... తిన్నది ఆపేసి కడిగి వెళ్లిపోతాడు. ఏమని అడిగితే కడుపు నిండిపోయిందని సమాధానం చెప్తాడు. 

ఆటోలో వెళ్తున్న జ్వాల.. తన గురించి ఇంట్లో వాళ్లు ఏమనుకుంటున్నారో అనుకుటుంది. ఎలాగైనా నన్నమ్మ నెంబర్‌ కనుక్కొని విషయాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. అసలు నన్ను వెతుకుతున్నారో లేదో అనే అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆటో ఆపి.. నిరుపమ్‌ కోసం ఆలోచిస్తుంది. నాకు నిరుపమ్ ఉన్నాడని... లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అనుకుటుంది. ఇంతలో రాత్రి వదిలేసిన కారు గుర్తుకు వచ్చి అక్కడి వెళ్తుంది జ్వాల. 

అక్కడ ఒంటరిగా నిల్చొని నిశ్చితార్థం గురించి ఆలోచిస్తుంటాడు నిరుపమ్. ఇంతలో జ్వాల అక్కడికి వస్తుంది. రాత్రి ఏమైందని ప్రశ్నిస్తుంది జ్వాల. ఏమైనా ఎక్కువ మాట్లాడానా అని క్వశ్చన్ చేస్తాడు నిరుపమ్. కారు కోసం ఆలోచించి ఇక్కడకు వచ్చావా థాంక్స్ అంటాడు.. 

రేపటి ఎపిసోడ్ 
ఆసుపత్రిలో ఉన్న నిరుపమ్‌ను కలిసేందుకు హిమ వస్తుంది. బావా అని పిలుస్తుంది. చెప్పండి డాక్టర్ హిమ అని రిప్లై ఇస్తాడు నిరుపమ్. నాతో మాట్లాడమని రిక్వస్ట్ చేస్తుంది. ఏదో ఫైల్ చూస్తుంటే అది లాగేస్తుంది. అందులో హిమ ఫొటోలు ఉంటాయి. హిమ మాట్లాడుతుండగానే అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు నిరుపమ్.   
మరోవైపు జ్వాలను ఇంటి నుంచి లాక్కెళుతుంది సౌందర్య. కారులో ఎక్కడికో తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగితే నోరుమూసుకొని కూర్చోమని కసురుకుంటుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Federal Reserve: అమెరికా డాలర్ బలహీనపడుతుందా? యూఎస్‌ తీసుకున్న ఒక నిర్ణయంతో భారత్ సహా ఈ దేశాలకు భారీగా లాభం !
అమెరికా డాలర్ బలహీనపడుతుందా? యూఎస్‌ తీసుకున్న ఒక నిర్ణయంతో భారత్ సహా ఈ దేశాలకు భారీగా లాభం !
Andhra Pradesh Cyclone Compensation : తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
Power Restoration in AP :మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
Karthika Puranam: పాపాత్ములు అంటే ఎవరు? ధర్మం అంటే ఏంటి?  కార్తీకపురాణం DAY-9 (అక్టోబర్ 30) కథ!
పాపాత్ములు అంటే ఎవరు? ధర్మం అంటే ఏంటి? కార్తీకపురాణం DAY-9 (అక్టోబర్ 30) కథ!
Advertisement

వీడియోలు

Montha Effect | అర్థరాత్రి కుప్పకూలిన వీరబ్రహ్మేంద్రస్వామి చారిత్రక గృహం | ABP Desam
Hurricane Melissa batters Jamaica | జ‌మైకాను నాశనం చేసిన మెలిసా హరికేన్ | ABP Desam
US Airforce Records Inside Hurricane Melissa | హరికేన్ మెలిస్సా ఎంత ఉద్ధృతంగా ఉందో చూడండి | ABP Desam
Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Federal Reserve: అమెరికా డాలర్ బలహీనపడుతుందా? యూఎస్‌ తీసుకున్న ఒక నిర్ణయంతో భారత్ సహా ఈ దేశాలకు భారీగా లాభం !
అమెరికా డాలర్ బలహీనపడుతుందా? యూఎస్‌ తీసుకున్న ఒక నిర్ణయంతో భారత్ సహా ఈ దేశాలకు భారీగా లాభం !
Andhra Pradesh Cyclone Compensation : తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
తుపాను మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు పరిహరం - ప్రభుత్వం కీలక ప్రకటన
Power Restoration in AP :మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
Karthika Puranam: పాపాత్ములు అంటే ఎవరు? ధర్మం అంటే ఏంటి?  కార్తీకపురాణం DAY-9 (అక్టోబర్ 30) కథ!
పాపాత్ములు అంటే ఎవరు? ధర్మం అంటే ఏంటి? కార్తీకపురాణం DAY-9 (అక్టోబర్ 30) కథ!
Minister Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
Tamilnadu ED: క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
Liver Detox Tips : కాలేయాన్ని సహజంగా శుభ్రపరిచే ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే లివర్ క్యాన్సర్ ప్రమాదం ఎప్పటికీ రాదట
కాలేయాన్ని సహజంగా శుభ్రపరిచే ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే లివర్ క్యాన్సర్ ప్రమాదం ఎప్పటికీ రాదట
Expensive Internet Countries : ఈ ఐదు దేశాలలో ఇంటర్నెట్ బాగా ఖరీదైనదట.. ఇండియా ఆ లిస్ట్​లో ఉందా? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి?
ఈ ఐదు దేశాలలో ఇంటర్నెట్ బాగా ఖరీదైనదట.. ఇండియా ఆ లిస్ట్​లో ఉందా? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి?
Embed widget