News
News
X

Karthika Deepam July 20 Update: నిరుపమ్-శౌర్యని దగ్గర చేసేందుకు ప్రేమ్ ప్లాన్, పెళ్లి ఆపే ప్రయత్నంలో స్వప్న-శోభ

Karthika Deepam july 20 Episode 1409: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

కార్తీకదీపం జులై 20 బుధవారం ఎపిసోడ్ (Karthika Deepam july 20 Episode 1409)

బోనాలు పండుగ చేయాలని డిసైడ్ అయిన సౌందర్య ఆనందరావు...మనవరాళ్లతో పాటూ మనవళ్లు కూడా ఉంటే బావుంటుంది అంటుంది. వాళ్లని నేను పిలుస్తానని చెప్పిన హిమ..ప్రేమ్ కి కాల్ చేసి నిరుపమ్ ని కూడా తీసుకురమ్మంటుంది. నిరుపమ్ దగ్గరకు వెళ్లిన ప్రేమ్..హిమతో బోనం ఎత్తిస్తున్నారు మనం వెళదాం అని చెబుతాడు. అమ్మవారికి మనసులో మాట చెప్పుకుంటే నెరవేరుతుందని ప్రేమ్ అనడంతో హిమతో నా పెళ్లి జరగాలని కోరుకుంటాను అనుకుంటాడు నిరుపమ్. అటు షాపింగ్ కి బయలుదేరుతారు సౌందర్య ఫ్యామిలీ. శౌర్య ఆటోలో వస్తానని చెప్పడంతో డీల్ కుదుర్చుకుంటుంది సౌందర్య. బోనాలు పండుగ అయ్యేవరకూ నేను చెప్పేది విను ఆ తర్వాత నువ్వు చెప్పేది వింటానంటుంది. ఆనందరావు ముందు సీట్లో కూర్చోవడంతో వెనుక సీట్లో శౌర్య పక్కనే కూర్చుంటుంది హిమ.

ప్రేమ్-నిరుపమ్ కూడా షాపింగ్ కి బయలుదేరుతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిరుపమ్..హిమను పెళ్లిచేసుకోడు అని ప్రేమ్ తన తల్లి స్వప్నకు ఇచ్చిన మాట గుర్తుచేసుకుంటాడు. 
ప్రేమ్: నేను ఓ ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు..శౌర్యపై నీ అభిప్రాయం ఏంటి
నిరుపమ్: తనో పిచ్చిది... జ్వాల అని తెలిసినప్పుడు కఠినంగా చెప్పాను కానీ..శౌర్య అని తెలిశాక కొంచెం బాధపడ్డాను
ప్రేమ్: నాకెందుకో శౌర్య ప్రేమలో నిజాయితీ ఉంది అనిపిస్తోంది. ఎంతైనా మన శౌర్య కదరా
నిరుపమ్: మన శౌర్య అనే అభిప్రాయం ఉంది..మన శౌర్య అయినంత మాత్రాన ఏం చేయలేను కదా
ప్రేమ్: మనిషిపై కోపం ఉన్నప్పుడు తను ఏం చేసినా నచ్చదు..పాపం శౌర్య కొంచెం దూకుడుగా ఉంటుంది. మగరాయుడిలా ప్రవర్తిస్తుంది కానీ చాలా మంచిది
నిరుపమ్: తనని చూస్తే ఇంతెత్తున ఎగిరే నువ్వు..ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి. బోనాల పండుగకు హిమ బోనమెత్తితే ఎలా ఉంటుందో
ప్రేమ్: శౌర్యని నిన్ను ఎలా కలపాలా అని ఆలోచిస్తున్నాను అనుకుంటాడు

Also Read: శౌర్య-నిరుపమ్ ని కలపబోతున్న బోనాలు పండుగ, ప్రేమ్ తన మనసులో మాట హిమకు చెబుతాడా!

అటు ఇంట్లో శోభ చిరాగ్గా ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. బ్యాంకువాళ్లు ఫోన్లు చూస్తుంటే అటు హాస్పిటల్ చేజారిపోతుంది, ఇటు నిరుపమ్ చేజారిపోతాడు. స్వప్నాంటీ కూడా చేతులెత్తేసినట్టే ఇప్పుడేం చేయాలి అనుకుంటుంది. ఇంతలో అక్కడు శాంతాబాయి వచ్చి డబ్బులు కావాలని అడుగుతుంది. ఇక్కడేమైనా ప్రజాసేవ చేస్తానని బోర్డు పెట్టుకున్నాను అనుకున్నావా అని విసుక్కున్న శోభ..మళ్లీ పిలిచి డబ్బులిస్తుంది. 

షాపింగ్ కి బయలుదేరిన సౌందర్య అండ్ ఫ్యామిలీ కార్లో అంతా సైలెంట్ గా కూర్చుంటారు. అప్పట్లో మాట్లాడుకుండా కూర్చున్న దీప-కార్తీక్ ని కారు వెనుకసీట్లో కూర్చోబెట్టి కావాలని టర్నింగ్ తీసుకున్న విషయం గుర్తుచేసుకుని మనవరాళ్ల విషయంలోనూ అదే చేస్తుంది.అప్పుడు మీ అమ్మా నాన్నని కలిపేందుకు వాడిన ట్రిక్ ఇప్పుడు మీ ఇద్దర్నీ కలిపేందుకు వాడుతున్నాను అనుకుంటుంది. 
హిమ:నానమ్మా ఏంటిది నేను డ్రైవ్ చేయనా అంటుంది. 
శౌర్య: నువ్వు డ్రైవ్ చేస్తేనే కార్లో కూర్చుంటాను..ఇంకెవరు నడిపినా కారు దిగిపోతాను

స్వప్న 
హిమకు క్యాన్సర్ లేదని నిరుపమ్ కు ముందే తెలుసంటున్నాడు..అంటే పర్మినెంట్ గా అది ఇంటికోడలిగా ఉండిపోతుందన్నమాట. ఇప్పుడేం చేయాలి ఈ పెళ్లి ఎలా ఆపాలి, శోభతో నిరుపమ్ పెళ్లి ఎలా చేయాలి..ఈ సమస్యకు పరిష్కారం ఏంటి. అసలు నిరుపమ్ కి ఏం చెప్పి ఈ పెళ్లి ఆపగలను..సాధ్యమా-అసాధ్యమా? అనుకుంటుంది.

Also Read: మనసు తెలుసుకోండి సార్ అని మళ్లీ క్లారిటీ ఇచ్చిన వసు, సాక్షికి పెద్ద షాక్ ఇచ్చిన రిషి అండ్ కో!

షాపింగ్ కి వెళ్లిన వాళ్లంతా తిరిగి బయలుదేరుతారు. శౌర్యని నిరుపమ్ తో పంపించే ప్లాన్ చేయాలి అనుకున్న ప్రేమ్.. శౌర్యని తన కార్లో రమ్మని అడుగుతాడు. డ్రైవింగ్ సీట్లో నిరుపమ్ ని కూర్చోబెడితే నా ప్లాన్ వర్కౌట్ అవుతుందని ఆలోచించిన ప్రేమ్..కారు నువ్వు నడుపు అని చెబుతాడు. ఇదంతా చూసిన సౌందర్య ఏంట్రా నువ్వు అంటుంది.
ప్రేమ్: వాళ్లిద్దరూ వస్తారులే అమ్మమ్మా వెళదాం పద అంటాడు..
బావా తెలిసి చేశావో తెలియక చేశావో తెలియదు కానీ వాళ్లిద్దర్నీ బలే కలిపావ్ థ్యాంక్స్ బావా అనుకుంటుంది హిమ. 
మరోవైపు నిరుపమ్ కార్లో కూర్చున్న శౌర్య..ముందు సీట్లోంచి దిగి వెనుక కూర్చుంటుంది. అటు ప్రేమ్ మాత్రం హిమను చూసి మురిసిపోతుంటాడు. 
నిరుపమ్-శౌర్య కలసి వెళ్లేందుకు ప్లాన్ చేసిన ప్రేమ్ కి థ్యాంక్స్ చెబుతుంది హిమ
సౌందర్య: నువ్వెందుకు థ్యాంక్స్ చెప్పావో నాకు తెలుసు హిమా..పెళ్లి డేట్ ఫిక్సయ్యాక కూడా ఏంటే నువ్వు నీ మనసు మారదా అనుకుంటుంది.
ప్రేమ్: ఎలాగూ బయటకు వచ్చాం కదా ఎక్కడికైనా వెళదామా
సౌందర్య: బోనాల పండుగ ఉందని చెబితే ఎక్కడెక్కడికో వెళదాం అంటావేంటి
ఆనందరావు: మళ్లీ ఊరెళుతున్నావా - ఉంటున్నావా..ఎప్పుడూ తిరుగుతావేంటి..
ప్రేమ్: వెళ్లడం ఇష్టం లేకపోయినా వెళ్లాల్సి వస్తోంది..ఉండాలనిపించినా ఉండే పరిస్థితి ఉండడం లేదు.
నువ్వేం చెప్పావో అర్థం కాలేదంటారు సౌందర్య, ఆనందరావు, హిమ...

Also Read: రౌడీ బేబీ తగ్గట్లేదు, డాక్టర్ సాబ్ మారడంలేదు - మధ్యలో ఉక్కిరి బిక్కిరవుతున్న హిమ

కార్లో వెనుక సీట్లో కూర్చున్న శౌర్య...ఎంత దూరం పెరిగిపోయింది మా ఇద్దరి మధ్యా అనుకుంటుంది. నేను క్లారిటీగానే ఉన్నాను అనుకుంటాడు నిరుపమ్. నేను ఎవ్వర్నీ మోసం చేయలేదు..నేనెందుకు ఫీలవ్వాలి అనుకుంటుంది శౌర్య...

Published at : 20 Jul 2022 08:40 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam july 20 Episode 1409

సంబంధిత కథనాలు

Guppedantha Manasu ఆగస్టు 15 ఎపిసోడ్: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్

Guppedantha Manasu ఆగస్టు 15 ఎపిసోడ్: నిశ్చితార్థం పీటలపై వసుని పక్కన కూర్చోమన్న రిషి, సాక్షికి షాకుల మీద షాకులిచ్చిన ఈగో మాస్టర్

Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్: డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

Karthika Deepam Serial ఆగస్టు 15 ఎపిసోడ్:  డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ హాస్పిటల్ ని హోరెత్తించిన వంటలక్క, మార్చురీలో శవం కార్తీక్ దేనా!

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్: మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Guppedantha Manasu ఆగస్టు 13 ఎపిసోడ్:  మనసులో వసు, పక్కన సాక్షి - తనకి తాను పెట్టుకున్న ప్రేమ పరీక్షలో రిషి గెలుస్తాడా!

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్: ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

Karthika Deepam Serial ఆగస్టు 13 ఎపిసోడ్:  ద్యావుడా! వంటలక్క బతికే ఉంది - డాక్టర్ బాబూ అంటూ ఉలిక్కిపడి లేచికూర్చున్న దీప, నిరుపమ్ కి కాల్ చేసిన హిమ

టాప్ స్టోరీస్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Ola New Electric Scooter: ఓలా - కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోలా - ఈసారి తక్కువ ధరలోనే!

Ola New Electric Scooter: ఓలా - కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోలా - ఈసారి తక్కువ ధరలోనే!

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం