అన్వేషించండి

Guppedantha Manasu జులై 19 ఎపిసోడ్: మనసు తెలుసుకోండి సార్ అని మళ్లీ క్లారిటీ ఇచ్చిన వసు, సాక్షికి పెద్ద షాక్ ఇచ్చిన రిషి అండ్ కో!

Guppedantha Manasu July 19 Episode 506:గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఇప్పుడు అదే ప్రేమకోసం తాపత్రయ పడుతోంది. జులై 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంతమనసు జులై  19 మంగళవారం ఎపిసోడ్ (Guppedantha Manasu  July 19 Episode 506)

రిషి రూమ్ లో డ్రెస్సుల పంచాయతీ నడుస్తుండగా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. ఈ రోజు ( మంగళవారం) ఎపిసోడ్ ఇదే సీన్ తో మొదలైంది. ఎట్టకేలకు వసుధార డ్రెస్సులు తీసుకోవడంత రిషి సంతోషిస్తాడు. థ్యాంక్యూ రిషి సార్, థ్యాంక్యూ సాక్షిగారు అనేసి ఆ డ్రెస్సులు తీసుకుని బయటకు వెళ్లిపోతుంది. 
వసు: రిషి సార్ ఈ డ్రెస్సులు ఇచ్చేటప్పుడు ఏం ఆలోచించారు..సాక్షివల్ల వీటిని తీసుకోవాల్సి వచ్చింది అనుకుంటుంది
రిషి: ఈ వసుధార ఏంటో అప్పటివరకూ వద్దని సడెన్ గా థ్యాంక్స్ చెప్పి వెళ్లింది
ఆ డ్రెస్సులు తీసుకొచ్చి జగతి-మహేంద్రకి చూపిస్తుంది వసుధార. ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు.
వసు: అసలేంటి మేడం మీ అబ్బాయి నాకు డ్రెస్సులు ఇవ్వడం ఏంటి?
జగతి: మహేంద్ర అర్థం అయిందా మనబ్బాయి..కాలేజీ ఎండీగారు కాదు మనబ్బాయి..
వసు: మేడం నేను చాలా హర్ట్ అయ్యాను..మీరు ఈజీగా తీసుకుంటున్నారు
జగతి: నేనుకూడా సీరియస్ గానే ఉన్నాను. వసు ఈ డ్రెస్సులు కొనిచ్చాడు నీకు కోపం వచ్చింది
వసు: ఓ అమ్మాయికి డ్రెస్సులు ఇస్తే ఏమన్నట్టు..అంటే నాకు డ్రెస్సులు లేవనా, బాలేవనా, నేను ఈ మాత్రం కొనుక్కోలేననా
జగతి: ఎక్కడో వర్షం పడితే ఇక్కడకు వచ్చిన గొడుగు పడితే ఎలా
వసు: బంగాళాఖాతంలో వాయుగుండం ఉంటే ఇక్కడ వర్షం పడడం లేదా
మహేంద్ర: రిషి డ్రెస్సు కొనిస్తే జగతి సమాధానం చెప్పాలా
వసు: ఈ డ్రెస్సులు వ్యవహారం ఏంటో రిషి సార్ ఎందుకిలా చేశారో
జగతి: కొందరు ఏ పని ఎందుకు చేశారో తెలియదు..అవంతే..జరుగుతాయి ఒక్కోసారి
వసు: జగతి మేడం ఏంటి..నేను రిషి సార్ మెడలో దండ వేసినదానిగురించి అనడం లేదు కదా 
మహేంద్ర: పుట్టినరోజుకి గిఫ్ట్ ఇచ్చాడంటే అర్థం ఉంటుంది..అసలేమీ లేకుండా డ్రెస్సులు ఇవ్వడం అంటే ఆలోచించాల్సిందే
జగతి: రిషి ఏం చేసినా ఏదో కారణం, అర్థం లేకుండా చేయడు. నువ్వు చెప్పినట్టుగా ఎక్కడో అల్పపీడనం ఏర్పడితే వర్షాలు కురుస్తాయి..అలాగే దీనికి లింక్ ఎక్కడో ఉందని నా అభిప్రాయం.
వసు: సాక్షి మాటలు గుర్తుచేసుకున్న వసుధార..సాక్షి మాటలకు ఈ విధంగా సమాధానం ఇచ్చారా..థ్యాంక్యూ రిషి సార్.. నా పేదరికాన్ని ఎత్తిచూపుతున్నారేమో అనిపించింది కానీ మీరు నిజంగా జెంటిల్మెన్ సార్..
జగతి: ఈ డ్రెస్సులు వద్దనుకుంటే ఇచ్చేసెయ్..రిషికి ఇచ్చేస్తాను
ఈ పంచాయితీ నడుస్తుండగా రిషి అక్కడకు వచ్చి చూస్తాడు..ఏంటీ వసుధార మేడంతో డ్రస్సుల విషయం అంటోందా..తిరిగి ఇచ్చేస్తుందా ఏంటి..డ్రెస్సు తీసుకోవడానికి తన ఆత్మాభిమానం అడ్డొస్తోందో ఏంటో అనుకుంటూ వెళ్లిపోతాడు...

Also Read: వసుని అవమానించిన సాక్షికి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇచ్చిన రిషి, మనసులో ప్రేమను చెప్పకనే చెప్పిన వసు

మరుసటి రోజు కాలేజీ మీటింగ్ హాల్ లో కూర్చుని ఉంటారంతా. రిషి మాత్రం వసు ఆడ్రెస్సులు తీసుకుందో, తిరిగి ఇచ్చేసిందో అనుకుంటాడు. సాక్షి ముందు నా గౌరవం తగ్గకూడదని డ్రెస్సులు తీసుకుందా అని ఆలోచిస్తుంటాడు ఇంతలో వసుధార వస్తుంది. తనిచ్చిన డ్రెస్సు వేసుకుని వచ్చిన వసుని చూస్తూ ఉండిపోతాడు రిషి. సాక్షి షాక్ అవుతుంది..వసుని నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా అనుకుంటాడు. వసు కావాలని చేయడం కాకపోతే మీటింగ్ రోజు కొత్త డ్రెస్ వేసుకుని రావడం ఏంటి అనుకుంటుంది సాక్షి. బొకే తీసుకొచ్చి రిషి ఎదురుగా పెట్టి పక్కనే నిల్చుని మాట్లాడుతుంటుంది. రిషి మాత్రం రెప్పవేయకుండా వసుని చూస్తుంటాడు..అది గమనించిన మహేంద్ర మీటింగ్ మొదలెడదామా అంటాడు. రిషి మాత్రం వసు వైపు నుంచి చూపు తిప్పుకోలేకపోతాడు.చదువుల పండుగ గురించి, డీబీఎస్టీ కాలేజీ గురించి గలగలా మాట్లాడుతుంటుంది వసుధార. మనల్ని మనం పొగుడుకోవడం కాకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పు అంటుంది జగతి. ప్రాజెక్ట్ గురించి ప్లాన్ వివరించిన వసుధారని అంతా అభినందిస్తారు. సాక్షిమాత్రం విసుగ్గా కూర్చుంటుంది. టైమ్ మానేజ్ మెంట్ కమ్యూనికేషన్ టీమ్ కి రిషి సార్ హెడ్..అందరూ రిషి సార్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందంటుంది.

సాక్షి: ఇందులో గొప్ప తెలివితేటలు ఏమున్నాయి ఈ మాత్రం నేను కూడా చేయగలను కదా
రిషి: అనుకోవడం లేదు...చేయడం వేరు
సాక్షి: వసుని తిడుతున్నట్టే ఉంటాడు..మళ్లీ సపోర్ట్ చేస్తాడు. రిషి టీమ్ లో నేను అసిస్టెంట్ గా పనిచేస్తాను. రిషి నీకు ఓకే కదా
వసు: రిషి సార్ కి అసిస్టెంట్ గా నేను వెళ్లాలి అనుకున్నాను..సాక్షికి ఎస్ చెబుతారేమో..
రిషి: ఓకే సాక్షి..నువ్వు నాకు అసిస్టెంట్ గా ఉండు.. 
వసు: మరి నేను
రిషి: ఎవరేం చేయాలో నాకు బాగా తెలుసు వసుధారా.. ఈ మీటింగ్ ఓవర్ అనేసి వెళ్లిపోతాడు...
రిషి వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయిన వసుని జగతి పిలుస్తుంది...(రిషి సాక్షికి ఓకే చెప్పినట్టు వసు ఊహించుకుంటుంది)
సాక్షి: రిషి నేను నీకు అసిస్టెంట్ గా ఉన్నట్టే కదా
రిషి: నువ్వొక మాట చెప్పావ్..నేను ఇంకా ఏమీ డిసైడ్ చేయలేదు..ఈ మీటింగ్ తర్వాత కంటిన్యూ చేద్దాం..వసు ఆ బ్యాడ్జెస్ గురించి నువ్వు చూసుకో అంటాడు..
అంతా వెళ్లిపోతారు... సాక్షి మాత్రం రిషి దగ్గరకు వెళ్లి నీ టీమ్ లో నీకు అసిస్టెంట్ గా ఉంటానంటుంది.
రిషి: నా సమాధానం ఇందాకే చెప్పాను అందరూ వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఎందుకు అడుగుతున్నావ్. నీకు సర్వీస్ చేయడం ఇష్టం అన్నావ్ అది నాకు నచ్చింది..నీకు ఏ ప్లేస్ కరెక్టో నాకు తెలుసుకదా..ఇక నువ్వు వెళ్లొచ్చు. వసు తీసుకొచ్చిన బొకే తీసుకుని చూస్తాడు రిషి. చదువుల పండుగ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అని రాసి ఉంటుంది. 

Also Read: శౌర్య-నిరుపమ్ ని కలపబోతున్న బోనాలు పండుగ, ప్రేమ్ తన మనసులో మాట హిమకు చెబుతాడా!

ఆ తర్వాత బయటకు రాగానే వసుధార ఎదురవుతుంది. ఒకర్నొకరు చూసుకుంటూ థ్యాంక్స్ అని ఒకేసారి చెప్పుకుంటారు. డ్రెస్సులు కొనిచ్చినందుకు థ్యాంక్స్ అని వసు అంటే.. యాక్సెప్ట్ చేసినందుకే కదా థ్యాంక్స్ చెప్పారంటుంది. 
రిషి: నువ్వేదీ యాక్సెప్ట్ చేయవుకదా
వసు: సార్ ఈ డ్రెస్సులు ఎందుకు ఇవ్వాలి అనిపించింది.. నేనొకటి అనుకున్నాను అవునా కాదా అని
రిషి: నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదు..
వసు: ఏం అనుకుంటున్నానో తెలియక ముందే తప్పు అని ఎలా అనుకుంటారు
రిషి: ఎదుటివారిని అంచనా వేయడంలో నీ ఆలోచన తప్పు. ఈ డ్రెస్సులు వద్దనుకున్నావ్ కదా.నేను దూరం నుంచి చూశాను
వసు: దూరం నుంచి చూసినవి నిజం కాదు..దగ్గర నుంచి చూస్తేనే మనసు తెలుస్తుంది...
అప్పుడే ఎంట్రీ ఇస్తారు మహేంద్ర, జగతి... వెంటనే రిషి...చదువుల పండుగ గురించి టాపిక్ మార్చేస్తాడు. మనం రాగనే టాపిక్ మార్చేశారు అనుకుంటారు...

రేపటి(బుధవారం) ఎపిసోడ్ లో
రిషి నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అంటుంది సాక్షి. రిషి సరే అనడంతో నేను సక్సెస్ అయినట్టే అని సాక్షి మురిసిపోతుంది. రిషితో పాటూ జగతి, మహేంద్ర,గౌతమ్, వసుధార కూడా రావడంతో షాక్ అవుతుంది..

Also Read: రౌడీ బేబీ తగ్గట్లేదు, డాక్టర్ సాబ్ మారడంలేదు - మధ్యలో ఉక్కిరి బిక్కిరవుతున్న హిమ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget