News
News
X

Guppedantha Manasu July 18th Update: వసుని అవమానించిన సాక్షికి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇచ్చిన రిషి, మనసులో ప్రేమను చెప్పకనే చెప్పిన వసు

Guppedantha Manasu July 18 Episode 505:గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఇప్పుడు అదే ప్రేమకోసం తాపత్రయ పడుతోంది. జులై 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంతమనసు జులై  18 సోమవారం ఎపిసోడ్ (Guppedantha Manasu  July 18 Episode 505)

జగతి దగ్గరకు వచ్చిన సాక్షికి చిన్నక్లాస్ వేస్తుంది
జగతి: నువ్వు వెళుతున్న దారి తప్పు అని చెప్పాను అయినా నువ్వు వినడం లేదు. ఏం చేసినా ఫలితం లేదని నీకు అర్థంకావడం లేదు, నిన్ను నడిపిస్తున్న అజ్ఞాత శక్తికి అర్థంకావడం లేదు అంటుంది
సాక్షి: నన్న ఎవరు నడిపిస్తున్నారు
జగతి: అది నీకు తెలుసు నాకు తెలుసు. టేక్ డైవర్షన్ అని రోడ్డుపై బోర్డు పెడితే డైవర్షన్ తీసుకోవాలి కానీ మొండిగా ముందుకెళితే టైమ్ వేస్ట్. రిషిలో మా అబ్బాయి, ఎండీని పంచుకోవాలని నువ్వు చూస్తున్నావ్. పంచుకోవడానికి తనేం వస్తువు కాదు ముందు అది గమనిస్తే మంచిది
వసు: చూడు సాక్షి..మేడం ముందు నిన్ను అనడానికి మనసు రావడం లేదు. ఇంతకు ముందు వసుని చూశావ్..ఇకపై కొత్త వసుని చూస్తావ్..
సాక్షి: రిషికి అసిస్టెంట్ గా రిషి టీమ్ లోకి వెళ్లేందుకు నేను రెడీగా ఉన్నాను..ఒక్కోసారి ఆట గెలుస్తున్నట్టే ఉంటుంది చివరి నిముషంలో ఓడిపోతాం
జగతి: జీవితాన్ని ఆటగా తీసుకోవడమే తప్పు..వెళ్లు
వీళ్లిద్దరి సంగతి చూస్తాను అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది సాక్షి...

Also Read: రౌడీ బేబీ తగ్గట్లేదు, డాక్టర్ సాబ్ మారడంలేదు - మధ్యలో ఉక్కిరి బిక్కిరవుతున్న హిమ

దేవయాని దగ్గరకు వచ్చిన ధరణిని చూసి ఏంటి నవ్వుతున్నావ్ అంటుంది
ధరణి: ఎప్పుడూ ఏడుపు ముఖం పెడితే ఏం బావుంటుంది..దేవుడు అందమైన ముఖం ఇచ్చాడు కదా నవ్వితే బావుంటుందని
దేవయాని: ఈ ధరణి కొత్తగా మాట్లాడుతోంది ఏంటి..జగతి వచ్చాక ధైర్యం పెరిగింది..దీని గురించి ఆలోచించాలి..
ధరణి: కాఫీ కావాలా
దేవయాని: అవసరం అయితే నేనే పిలుస్తాను నువ్వెళ్లు..
ఇంతలో సాక్షి కాల్ చేస్తుంది. ఏమైనా గుడ్ న్యూస్ విన్నావా...
సాక్షి: జగతి ఆంటీ చాలా ఎక్కువ చేస్తున్నారు, వసుధార కూడా ఈ మధ్య డోస్ పెంచింది. ఒకప్పుడు అణుకువగా ఏదైనా అంటే పడేది
దేవయాని: అసలు ఏం జరిగింది
సాక్షి: ఆ జగతి ఆంటీ నాకు సవాల్ విసిసింది..నన్ను చాలా లైట్ తీసుకుంటున్నారు. వీళ్లని ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదకరంగా తయారవుతారు
దేవయాని: ఎదుటివారిపై నీకెంత కోపం ఎక్కువైతే విజయానికి అంత దూరమవుతావ్. అరిస్తే ఆ క్షణం పోతుంది..ఆలోచిస్తే ఉపయోగపడుతుంది. జగతి సంగతి నేను చూసుకుంటాను, వసుధారని నువ్వు చూసుకో. ఏం చేసినా ఆలోచనతో చెయ్యి, ఆవేశంతో కాదు..
ఇంతలో రిషి రావడంతో కాల్ కట్ చేస్తుంది సాక్షి... 
అటు దేవయాని ఎదురుగా కాఫీ కప్పుతో నిలబడి ఉంటుంది ధరణి. నేను అడిగలేదు కదా అంటే నాకు ఇవ్వాలని అనిపించింది అంటుంది. పంచదార తగ్గినట్టుందన్న దేవయానితో నేనే తగ్గించాను ఆరోగ్యానికి మంచిదని రిప్లై ఇస్తుంది ( ఈవిడ సాక్షితో మాట్లాడుతోంది అంటే మళ్లీ కాలేజీలో ఏవో కుట్రలు చేస్తున్నారన్నమాట అనుకుంటుంది)

Also Read:  వసుని అవమానించిన సాక్షి, సపోర్ట్ చేసిన రిషి- సాక్షి, దేవయానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిపడేసిన జగతి

అటు కాలేజీలో తన క్యాబిన్లో కూర్చున్న రిషి..వసుని రమ్మని కబురుపెడతాడు. వసు రియాక్షన్ ఎలా ఉంటుందో, యాక్సెప్ట్ చేస్తుందా, చేయదా అనుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన సాక్షి..కాలేజీకి వచ్చి రిషి అనుక్షణం వసు జపం చేస్తున్నాడా అి మండిపడుతుంది. అటు మాస్టర్ చెప్పండి అంటూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ బోర్డుపై బొమ్మ గీస్తుంటుంది. అది నెమలి ఫించం బొమ్మ. ( గతంలో వసు బుక్ లో ఫించం కిందపడితే తీసుకొచ్చి రిషి ఇచ్చిన విషయం గుర్తుచేసుకుంటుంది). ఇంతలో రిషి నుంచి పిలుపురావడంతో వెళుతుంది. వసుధార అర్థమైనట్టు కనిపించే అర్థంకాని వ్యక్తి అని రిషి అనుకుంటుండగా క్యాబిన్ కి వస్తుంది వసు. తను కొనితీసుకోచ్చిన డ్రెస్సులు టేబుల్ పై పెడతాడు రిషి. 
రిషి: ఇవి ఎలా ఉన్నాయో చెప్పు
వసు: పర్వాలేదు సార్ బావున్నాయి
రిషి: పర్వాలేదా బావున్నాయా
వసు: ఓకే సార్
రిషి: చెప్పినప్పుడల్లా కొత్త సమాధానం ఎందుకు చెబుతున్నావ్. మన డ్రెస్ ఒక్కోసారి మన సోషల్ స్టేటస్ ని ,ఆత్మ స్థైర్యాన్ని ప్రతిబింబిస్తాయి
వసు: సడెన్ గా ఈ డ్రెస్సులు వాటి విశిష్టత గురించి ఎందుకు చెబుతున్నారు
రిషి: ఇవి నీకోసం తీసుకొచ్చాను..
వసు: నాకెందుకు..
రిషి: తీసుకో వసుధార బావున్నాయి అన్నావ్ కదా
వసు: బావున్నాయి అన్నాను కానీ నాకు బావుంటాయి అనలేదు
రిషి: ఏం చేసినా ఆలోచించే చేస్తాను..చేశాక ఆలోచించను. వసుకి ఏం చెప్పి ఒప్పించాలి..నీకు అన్నిటికీ కారణాలు కావాలా.. కొంతమంది మన ట్యాలెంట్ ని కాకుండా లుక్స్ ని జడ్జ్ చేస్తారు. ఇవి నీకోసమే తీసుకొచ్చాను..ఇది కూడా ఓ అవసరం.. డీబీఎస్టీ కాలేజీకి నువ్వొక ఎంప్లాయి వి అనే విషయం గుర్తుంచుకోవాలి
వసు: నా డ్రెస్సింగ్ బాలేదని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారా, డైరెక్ట్ గానే చెప్పారా. ఆత్మగౌరవం, సోషల్ స్టేటస్ ఇవన్నీ నాకు లేవనా
అప్పుడే ఎంట్రీ ఇచ్చిన సాక్షి..డ్రెస్సులు బావున్నాయే అంటుంది...ఇవి వసుకోసం తెప్పించానంటాడు రిషి. అంటే వసుధారని అంటే నువ్వు హర్టయ్యావా అనుకుంటూ... నువ్వు వసుధార కోసం డ్రెస్సులు తెప్పించడం ఏంటి అని అడుగుతుంది..
వసు: నేనే తెప్పించమని అడిగాను సాక్షి... ఓ డ్రెస్సు మన ఆత్మవిశ్వాసాన్ని, ఆర్థిక పరిస్థితిని అప్పుడప్పుడు ప్రభావితం చేస్తుందనేది రిషిసార్ అభిప్రాయం అంతే కదా సార్
రిషి: డీబీఎస్టీ కాలేజీలో జరిగే చదువుల పండుగ కోసం ఈ డ్రెస్సులు తెప్పించాను
సాక్షి: డ్రెస్సులు తెప్పించావు సరే..వసు యాక్సెప్ట్ చేసిందా
వసు: సాక్షి గారూ రిషి సార్ నాకోసం ఆలోచించి ప్రత్యేకంగా తెప్పించారు నేనెందుకు కాదంటాను...
సాక్షి: వసుధారా నీకు రిషి డ్రెస్సులు తీసుకోవడం గ్రేట్..
వసు: బాగా చెప్పారు సాక్షి గారూ..నాకోసం మీరు ఇంతలా ఆలోచిస్తున్నారంటే మీరెంత గొప్పవారో నాకు అర్థం అవుతోంది..
సాక్షి: నేను వసుధారని దూరం చేద్దాం అనుకుంటే మరింత దగ్గరవుతున్నావా అనుకుంటూ రిషి ఇచ్చిన డ్రెస్సులు నచ్చవేమో, వద్దంటావేమో అనుకున్నా
వసు: రిషి సార్ ఇవి డీబీఎస్టీ కాలేజీ మంచికోసం ఆలోచించి ఇచ్చారు నేనెందుకు వద్దంటాను అంటూ థ్యాంక్యూ రిషిసార్ అంటుంది.

Also Read: రిషి-వసు క్యూట్ రొమాన్స్ , దేవయాని-సాక్షి కాఫీ ప్లాన్ తిప్పికొట్టిన గౌతమ్

రేపటి( మంగళవారం) ఎపిసోడ్ లో
మీ అబ్బాయి ఏంటి సార్ నాకు డ్రెస్సులు కొనిచ్చారని జగతితో అంటుంది..దీనికి లింక్ ఇంకెక్కడో ఉందని నా అభిప్రాయం అన్న జగతి..వద్దంటే ఆ డ్రెస్సులు తిరిగిచ్చెయ్ అని చెబుతుంది. అటు మర్నాడు కాలేజీ మీటింగ్ లో కూర్చున్న రిషి వసు ఆడ్రెస్సులు తిరిగి ఇచ్చేసి ఉంటుందని ఆలోచిస్తుంటాడు..ఇంతలో కొత్త డ్రెస్ వేసుకుని వసు ఎంట్రీ ఇస్తుంది.. 

Published at : 18 Jul 2022 09:16 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu July 18 Episode 505

సంబంధిత కథనాలు

Hyper Aadi: హైపర్ ఆది ఫోటో కాల్చేసిన ఆటో రామ్ ప్రసాద్, చింపేసిన రష్మి!

Hyper Aadi: హైపర్ ఆది ఫోటో కాల్చేసిన ఆటో రామ్ ప్రసాద్, చింపేసిన రష్మి!

Wanted PanduGod: రాఘవేంద్ర రావు పాటలో ‘పుచ్చకాయ’ - విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్

Wanted PanduGod: రాఘవేంద్ర రావు పాటలో ‘పుచ్చకాయ’ - విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్

Janaki Kalaganaledu August 11th Update: బిర్యానీ తింటూ జ్ఞానంబకి దొరికిపోయిన మల్లిక- జానకిని కాలేజీలో చేర్పించిన జ్ఞానంబ

Janaki Kalaganaledu August 11th Update: బిర్యానీ తింటూ జ్ఞానంబకి దొరికిపోయిన మల్లిక- జానకిని కాలేజీలో చేర్పించిన జ్ఞానంబ

Gruhalakshmi August 11th Update: తులసిని తిరుగుబోతు చేసిన లాస్య, అనసూయకి అవమానం- మరోవైపు ఫ్లైట్ ఎక్కుతున్నందుకు తులసి సంబరం

Gruhalakshmi August 11th Update: తులసిని తిరుగుబోతు చేసిన లాస్య, అనసూయకి అవమానం- మరోవైపు ఫ్లైట్ ఎక్కుతున్నందుకు తులసి సంబరం

Guppedantha Manasu ఆగస్టు 11 ఎపిసోడ్: ఆఖరిసారి చూడాలనుందని వసు మెసేజ్ చూసి కంగారుగా వెళ్లిన రిషి, దేవయానితో జగతి సవాల్!

Guppedantha Manasu ఆగస్టు 11 ఎపిసోడ్: ఆఖరిసారి చూడాలనుందని వసు మెసేజ్ చూసి కంగారుగా వెళ్లిన రిషి, దేవయానితో జగతి సవాల్!

టాప్ స్టోరీస్

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!