(Source: ECI/ABP News/ABP Majha)
Karthika Deepam 2 Serial October 9th: కార్తీకదీపం 2 సీరియల్: మామని ఇచ్చి పడేసిన జ్యోత్స్న.. అమ్మా, అత్తల్ని కలపడానికి దీప చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా!
Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న శ్రీధర్‌ని కలిసి మీ పెళ్లి వల్ల నా జీవితం నాశనం అయిందని నాకు వేరే పెళ్లి చేయాలని తాత చూస్తున్నాడని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode ఆరు బయట బాధ పడుతున్న సుమిత్రని చూసి దీప అక్కడికి వస్తుంది. ఏమైందని అడిగితే ఇంట్లో జరిగిన విషయం చెప్తుంది. మామయ్య గారు పెద్ద నిర్ణయం తీసుకున్నారని జ్యోత్స్నకి వేరే సంబంధం చూస్తున్నారని చెప్తుంది. బలవంతంగా వేరే సంబంధం చేస్తే మీకు మీ కూతురు ఉండదని చెప్పి జ్యోత్స్న బయటకు వెళ్లిపోయిందని సుమిత్ర దీపతో చెప్తుంది. దీప షాక్ అయిపోతుంది.
సుమిత్ర: ఇప్పుడు నేనేం చేయాలి దీప. వాళ్లని నిర్ణయం మార్చుకోమని చెప్పలేను అలా అని కార్తీక్‌కి మర్చిపోమని నా కూతురికి చెప్పలేను. ఎందుకంటే నేనే ఎన్నో సార్లు నీ బావనే నీ భర్త అని దానికి చెప్పాను. నేను ఆడదాన్నే కదా దీప ఒంటి మీద బట్టలు మార్చమని చెప్పినంత సులభంగా నీ మనసుని మార్చుకో అని ఎలా చెప్పగలను. అలా అని వదిన దగ్గరకు వెళ్దామంటే ఇంకెంత గొడవ అవుతుందో. నేను వెళ్తా అంటే కాదు అనరు కానీ వదినను చూడగలనా. ఆడ పడుచు నా వియ్యపురాలు అని నేను నా వదినే నా వియ్యపురాలు అని వదిన ఎన్నో సార్లు అనుకున్నాం. వదినను తలచుకుంటేనే ఏడుపు ఆగడం లేదు. అన్నయ్య చేసిన పనికి కుటుంబం ఎన్ని ముక్కలైందో చూడు ఇంకేది గతంలా ఉండదు దీప. ఉండాలి అంటే రెండు కుటుంబాలు ఒక్కటవ్వాలి. నేను పైకి ఏడుస్తున్నా కానీ చెల్లిని తలచుకొని మా ఆయన కూతురిని తలచుకొని మామయ్య కుమిలి కుమిలి ఏడుస్తారు. ఏదో ఒకటి జరిగి అందరూ కలిసిపోతే బాగున్ను దీప.
శౌర్య: తప్పకుండా జరుగుతుంది అమ్మమ్మ. మనం ఏమైనా జరగాలి అని గట్టిగా కోరుకుంటే జరుగుతుంది.
సుమిత్ర: బాల వాక్కే బ్రహ్మవాక్కు అంటారు ఆ అమ్మవారే నా మనసులో మాట పాపతో అనిపించింది.
దీప: తప్పుకుండా అవుతుంది అమ్మ మనసులో కాంచన గారిని మిమల్ని కలిపే బాధ్యత నాది. జ్యోత్స్నకి అసలే ఆవేశం ఎక్కువ ఎక్కడికి వెళ్లిందో ఏంటో.
జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ శ్రీధర్‌ని కలుస్తారు. జ్యోత్స్న మామయ్యతో మీకు అస్సలు సిగ్గులేదని ఫైర్ అవుతుంది. మీ తప్పునకు ఇంటిళ్ల పాది మిమల్ని కొట్టాలి మామయ్య అంటుంది. నువ్వు బాగా ఆవేశంలో ఉన్నావ్ రా కోడలా కూర్చొని మాట్లాడుదామని శ్రీధర్ అంటే దానికి జ్యోత్స్న ఇంకెక్కడ కోడలు మీకు జరిగింది తెలీనట్లుందని తన పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం చెప్తుంది. మీరంతా బాగానే ఉన్నారు కానీ నా బతుకే ఇలా అయిపోయిందని నీ రెండో పెళ్లి నా పెళ్లికి అడ్డు వచ్చిందని అంటుంది. అందరినీ బతిమాలాను, ఏడ్చాను, కోప్పడ్డాను దీని ఫైనల్ రిజల్ట్ మా తాత నాకు వేరు పెళ్లి చేయాలని చూస్తున్నాడు. దీనంతటికి కారణం నువ్వే మామయ్య ఏం చేయాలో నువ్వు చెప్పు అని అంటుంది.
శ్రీధర్: చూడమ్మా నాది అప్పుడు ఒకే మాట ఇప్పుడు ఒకే మాట మేనకోడలివి అయినా కోడలివి అయినా నువ్వే. నా రెండో పెళ్లితో వడిపోయిన మన రెండు కుటుంబాలు నీ పెళ్లితో ఒకటి అవ్వాలి. నువ్వు మాత్రం కార్తీక్‌నే పెళ్లి చేసుకోవాలి నువ్వు ఏం చేయమన్నా ఈ మామయ్య నీకు సపోర్ట్‌గా ఉంటాడు.
పారిజాతం: షబాష్ అల్లుడు మనందరం కలిస్తే ఎలా అయినా ఈ పెళ్లి చేయొచ్చు. చేయాలి అవసరం వచ్చినప్పుడు ఏమైనా చేయాలి అల్లుడు.
శ్రీధర్: అందరినీ అడిగాం అని చెప్పండి అత్తయ్యగారు
పారిజాతం: ఏదో అలవాటులో పొరపాటుగా అన్నట్లు ఉన్నావ్ అల్లుడు నిన్ను కలిశాం అని తెలిస్తే మేం కూడా మీ ఇంట్లోనే ఉండిపోవాలి.
దీప శౌర్యని తీసుకొని కార్తీక్ ఇంటికి వెళ్తుంది. కాంచన, కార్తీక్ పాపతో సరదాగా గడుపుతారు. కాంచన నవ్వడంతో దీప మనసులో ఎన్నాళ్లు అయింది మీరు నవ్వి అని అంటుంది. ఇక కాంచన నాలుగు రోజులు శౌర్యని మా ఇంట్లో ఉంచుకుంటామని అంటుంది. దీపని కూడా ఉండమంటారు. దానికి దీప కుదరదని మీరే రేపు మా ఇంటికి రావాలని అంటుంది. రేపు శౌర్యని అమ్మవారిలా అలంకరిస్తున్నాని అంటుంది. అన్నీ తెలిసి ఆ ఇంటికి ఎలా రమ్మంటున్నావని కాంచన అడుగుతుంది. కాంచన రాను అంటుంది. దానికి దీప మనసులో నేను పూజ పెట్టిందే మిమల్ని కలపడానికి అని అంటుంది. సుమిత్ర కూడా బాధ పడుతుందని దీప చెప్తుంది. రెండు కుటుంబాల మధ్య గీత ఉందని ఎవరో ఒకరు గీత దాటిలి అని ఇద్దరూ రావాలని చెప్తుంది. మాకు మీరు తప్ప ఇంకెవరూ లేరని రమ్మని దీప ఒత్తిడి తెస్తుంది. దాంతో కాంచన సరే అంటుంది.
ఇక దీప సుమిత్ర దగ్గరకు వచ్చి అమ్మవారి పూజ చేస్తున్నాం మీరు రావాలని అంటుంది. జ్యోత్స్న, పారిజాతం చాటుగా వింటారు. సుమిత్ర రాను అని చెప్తుంది. పూజ మా ఇంట్లో చేద్దామని సుమిత్ర అంటే దీప ఒప్పుకోదు. ఇక పారిజాతం ఏదో చెడు జరగబోతుందని అంటుంది. ఇంతలో శౌర్య వస్తుంది. ఇక దీప శౌర్యతో పూజ ఈ ఇంట్లోనే అని పాపని తీసుకెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.