Karthika Deepam 2 Serial October 3rd: కార్తీకదీపం 2 సీరియల్: నన్ను బావ అని పిలవొచ్చోలేదో ఆ పెద్ద మనిషినే అడుగు.. కార్తీక్ ఎమోషనల్.. దాసు, కాశీకి ఇచ్చిపడేసిన పారు!
Karthika Deepam 2 Serial Episode కార్తీక్ మేనమామ ఇంటికి వచ్చి తన తల్లిని అనాథని చేయొద్దని చెప్పి తాత, మామని ప్రశ్నించి ఎమోషనల్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శ్రీధర్ కార్తీక్ మాటలు తలచుకొని బాధ పడుతుంటాడు. కావేరి శ్రీధర్‌కి కాఫీ ఇస్తూ జరిగిందని బాధపడుతున్నావా అని అడుగుతుంది. దానికి శ్రీధర్ ఇలా జరిగిందని నీకు ఏ బాధ లేదా అని అడుగుతాడు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మనకు ముందే తెలుసుకదా అని అంటుంది.
కావేరి: మీ కొడుకుకి ఈ విషయం ఎప్పుడో తెలిసి మిమల్ని నిలదీయకపోవడం మీ అదృష్టం. తెలిసిన రోజే నిలదీసి ఉంటే ఈ నిజం ఎప్పుడో బయటపడేది.
శ్రీధర్: అంటే నాకు ఇంత జరిగినా నీకు బాధ లేదన్నమాట.
కావేరి: మళ్లీ మొదటికి వస్తావేంటి బేబీ. నువ్వు ఏమైనా కాంచన, కార్తీక్‌లను వద్దు అన్నావా వద్దన్న వాళ్ల గురించి ఎందుకు ఆలోచించడం.
శ్రీధర్: అందరికీ దూరం అయ్యాను కదా.
కావేరి: నాకు దగ్గరయ్యావు కదా. ఇన్ని రోజులు నేను తాళి కట్టిన భార్యనే అయినా దొంగ కాపురంలా ఉండిపోయాను. ఇప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నా భర్త అని నేను నీ భార్యనని అందరికీ చెప్పుకొని తిరగొచ్చు.
శ్రీధర్: నేను నా ఫ్యామిలీకి దూరం అయ్యాను బేబీ అది నీకు అక్కర్లేదు.
కావేరి: అది ఫ్యామిలీ అయితే మరి ఇది ఏంటి.
శ్రీధర్: ఇది కూడా ఫ్యామిలీనే.
కావేరి: ఇది కూడా కాదు. ఇప్పుడు నీకు ఇదే ఫ్యామిలీ కాఫీ తాగినా టిఫెన్ చేసినా స్నానం చేసినా చివరకు మంచి నీళ్లు తాగినా ఇక్కడ తప్పితే ఇంకో ఇళ్లు లేదు పెట్టే మనిషి లేదు. ఇన్నాళ్ల కాపురంలో అక్కడ నాలుగు రోజులు ఇక్కడ మూడు రోజులు ఉండే వాడివి. ఇక నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎదురు చూడాల్సిన అవసరం ఇద్దరికీ లేదు. ఇక నీకు ఒక్కర్తే భార్య. ఏంటి అంత కోపంగా చూస్తున్నావ్..నీ బాధ ఏంటో తెలుసా బేబీ నీ పరువు నీ ఇంట్లో నీ అత్తింట్లో పోవడం అంతేనా. నీ పరువు తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిదని నీకు తెలిసు బేబీ. నాకు అయితే మంచే జరిగింది బేబీ. ఓ వైపు కూతురి పెళ్లి అయింది మరో వైపు నా భర్త నాకే సొంతం అయ్యాడు.
శ్రీధర్: ఇన్నాళ్లు కాంచనను అక్కా అక్కా అని పిలిచింది నువ్వేనా బేబీ.
కావేరి: అక్క అమాయకురాలు కాబట్టి అన్యాయం చేశారు. అందుకే అమాయకత్వం అక్కకే వదిలేసి నేను నాలా ఉన్నాను. ఇక మనం ఆలోచించాల్సింది పెళ్లి చేసుకున్న మన కూతురి గురించి. తర్వగా రెడీ అవ్వండి అమ్మాయి దగ్గరకు వెళ్లాలి.
కార్తీక్: (మేనమామ ఇంటికి వస్తాడు.) నా తండ్రి తప్పు చేస్తే నా తల్లికి శిక్ష వేశారేంటి తాతయ్య, మామయ్య. అల్లుడు తప్పు చేస్తే ఇంటి ఆడపడుచుకి పుట్టిళ్లు దూరం చేయడం ఎంత వరకు న్యాయం. మా అమ్మలో ఉంది మీ రక్తమే తాతయ్య మీరు మా అమ్మతో బంధం తెంపుకోవడానికి కొద్ది సేపు ముందే మా అమ్మ నాన్నతో బంధం తెంచుకుంది. ఇక మీదట మీతో కలిసి బతకలేను అని చెప్పి ఆ రెండో ఆవిడను పిలిచి చీరగాజులతో పాటు భర్తని కూడా ఇచ్చేసింది. ఆవిడ భర్తని వదిలేస్తే మీరు కూతురిని వదిలేశారు. రెండో ఆవిడతో మానాన్న బానే ఉన్నాడు. ఇక్కడ మీరు బాగున్నారు కానీ ఏ తప్పు చేసిందని నా తల్లి బాధ పడాలో చెప్పండి. ఎవరిని బాధ పెట్టిందని నా తల్లికి ఈ శిక్ష వేసిందో చెప్పండి. భర్త నుంచి ఏదైనా సమస్య వస్తే పుట్టిళ్లు అండగా ఉండాలి కానీ అంత సమస్య వచ్చిన మా అమ్మని మీరు కూడా వదిలేశారు. ఏ మామయ్య మా అమ్మ నీ సొంత చెల్లే కదా జరిగిన దానికి బంధం తెంపేసుకుంటున్నామని నిర్దాక్షిణ్యంగా ఎలా మాట్లాడగలిగావు మామయ్య. మా అమ్మకి పెళ్లి చేసిందే నువ్వు కదా తాతయ్య మరి మా అమ్మ ఎవరిని నిలదీయాలి మిమల్నే కదా మీరే కదా మా అమ్మకి సమాధానం చెప్పాలి. కానీ మీరు సమాధానం చెప్పకపోగా సంబంధం తెంపేశారు. నా తల్లికి ఒక కంటిలో నీరు నేను తుడిచినా మరో కంటి నీరు ఈ ఇంటి నుంచి తుడవాలని నా తల్లి ఆశపడుతుంది.. సమాధానం చెప్పండి తాతయ్య.
శివనారాయణ: తప్పు ఎవరు చేసినా శిక్ష ఒక్కటే నువ్వు అడిగిన అన్న ప్రశ్నలకు నా సమాధానం ఒక్కటే నేను ఎవరినీ క్షమించను.
కార్తక్: అయితే నా మాట కూడా విను తాతయ్య. మా అమ్మకి ఎవరు లేకపోయినా నేను ఉన్నాను. ఆ రెండో కంటిలో కన్నీళ్లు కూడా నేనే తుడుస్తాను. నేను ఉండగా మా అమ్మ ఎప్పటికీ అనాథ కాదు తాతయ్య అనాథ కానివ్వను. అని కోపంగా వెళ్లిపోతాడు.
జ్యోత్స్న: బావ.. బావ బావ అని పిలుస్తుంటే వెళ్లిపోతున్నావ్.
కార్తీక్: నన్ను అలా పిలవొచ్చో లేదో అదిగో ఆ పెద్ద మనిషిని అడుగు.
దీపకు స్వప్న కాల్ చేస్తుంది. గొడవలన్నీ మా పెళ్లి వల్లే జరిగాయని ఏడుస్తుంది. కొద్ది రోజుల్లో అంతా సర్దుకుపోతుందని దీప మాట్లాడుతుంది. అన్నయ్య గానీ, అమ్మ గానీ ఎవరూ నన్ను పట్టించుకోలేదని అత్తారింట్లో కనీసం దీపం కూడా వెలిగించలేదని నా కోసం ఎవరూ రాలేదని ఎవరూ రారు అని స్వప్న ఏడుస్తుంది. ఇలా మాట్లాడకు స్వప్న నేను వస్తానని దీప అంటుంది. దానికి స్వప్న అన్నయ్యని తీసుకురా దీప అని బతిమాలుతుంది. ఇక కార్తీక్ వెళ్లడం దీప చూసి కార్తీక్ దగ్గరకు వెళ్తుంది. దీప కార్తీక్‌తో మాట్లాడుతుంది. కార్తీక్ ఇంట్లో వాళ్లు తన తల్లిని క్షమించరని చెప్పారని అంటాడు. తన తల్లిని అందరూ అనాథ చేసినా నేనున్నానని కార్తీక్ అంటాడు. ఇక దీప కార్తీక్‌తో మిమల్ని నమ్ముకొని స్వప్న కూడా ఉందని అన్నయ్యని చూడాలని ఏడుస్తుందని అంటుంది. అందరూ వదిలేశారని బాధ పడుతుందని దీప చెప్పి కార్తీక్ వెళ్లమని అంటుంది. కానీ కార్తీక్ ఇంటికి వెళ్లాలని వెళ్లిపోతాడు.
జ్యోత్స్న, పారిజాతం గదిలో మాట్లాడుకుంటారు. కార్తీక్ బతిమాలినా ముసలోడు ఓ మెట్టుదిగుతాడు అనుకుంటే ఇలా చేశాడేంటి అని బాధ పడతారు. ఇదంతా కాశీ పెళ్లి వల్లే అయిందని అంటుంది పారు. ఇంతలో దాసు కాల్ చేస్తాడు. దాసుని దాసు బోసు అని తిట్టి ఇచ్చిపడేస్తుంది. దాసు తల్లితో నీ మనవడికి పెళ్లి అయింది మనవరాలికి నెత్తిన అక్షింతలు వేయి అని అంటే పారు కోపంతో ఎవర్రా మనవడు ఎవరురా మనవరాలు తంతే అందరూ ఏటిలో పడతారని తిడుతుంది. దాసుని కాశీని అందరినీ తిడుతుంది. పెళ్లి ఆపలేదని దాసుకి ఇచ్చిపడేస్తుంది. పెద్దల తప్పులకు పిల్లలేం చేస్తారు జ్యోత్స్న కార్తీక్‌ల పెళ్లి చేయొచ్చు కదా అని దాసు అంటే పారు కోపంతో రారా నువ్వు వచ్చి ఇదే మాట శివన్నారాయణతో చెప్పు అని అంటుంది. కాశీ మాట్లాడి నానమ్మ ముందు ఇంటికి రా అని అంటే నీకు నానమ్మ లేదు నాకు మనవడూ లేడని మరోసారి ఫోన్ చేయొద్దని వాయించేస్తుంది. ఇక దీప కార్తీక్ వచ్చి తన తల్లి గురించి మాత్రమే మాట్లాడాడు కానీ అసలు బావ మనసులో నేను ఉన్నానా లేదా అని అడుగుతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.