అన్వేషించండి

Karthika Deepam 2 Serial October 17th: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్య కోసం దీపతో గొడవ పడిన కార్తీక్.. శౌర్యకి తండ్రిగా ఉంటాడా.. కార్తీక్ ఇంటికి బయల్దేరిన జ్యోత్స్న!

Karthika Deepam 2 Serial Episode శౌర్యని ఊరు తీసుకెళ్తానన్న దీప కార్తీక్ ఇంటికి వస్తే శౌర్యని ఎక్కడికీ పంపించనని కార్తీక్ దీపతో గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కాశీ కార్తీక్‌కి కాల్ చేసి శౌర్య కనిపించడం లేదని నేను దీపక్క రోడ్డు మీద వెతుకుతున్నాం అని చెప్తాడు. దానికి కార్తీక్ మీరు ఎక్కడా వెతకాల్సిన పని లేదు శౌర్య నా దగ్గర ఉందని అని అంటాడు. ఇక దీప కార్తీక్‌తో మాట్లాడి పాప మీ దగ్గర ఉంది అని చెప్పాలి కదా బాబు అంటుంది. దానికి కార్తీక్ నీ ఫొన్ స్విఛ్ ఆఫ్ వస్తుంది మరి ఎవరికి చెప్పాలి అంటాడు. ఇక దీప ఇంటి వస్తున్నాను అని అంటుంది. 

దీప: మనసులో.. పాప కార్తీక్ బాబు దగ్గర ఉంది అంటే నేను ప్రమాదంలో ఉన్నట్లు. 
కాశీ: అక్క నువ్వు ఊరు అయితే వెళ్లకు. నీకు అక్కడ బంధువులు ఎవరు ఉన్నారో తెలీదు కానీ నీకు మేం ఉన్నాం. నీకు ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే మన ఇంటికి వచ్చేయ్ అక్క అందరం కలిసే ఉందాం.
దీప: ముందు నువ్వు ఇంటికి వెళ్లు కాశీ మనం తర్వాత మాట్లాడుకుందాం. 
శౌర్య: కార్తీక్ నన్ను అమ్మ ఊరు తీసుకెళ్లిపోతుంది. నాకు అమ్మా కావాలి నువ్వు కావాలి. ఇద్దరూ నాతో ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పు. నువ్వు నాకు నాన్నగా ఉంటే అప్పుడు నాతోనే ఉంటావు కదా. రౌడీ నీ కోసం ఏమైనా చేస్తా అంటావు కదా నాన్నగా ఉండలేవా కార్తీక్. చెప్పు కార్తీక్ ఈ ఫ్రెండ్‌కి నాన్నగా ఉండలేవా. నేను హ్యాపీగా ఉండటం నీకు ఇష్టం లేదా. 
శివనారాయణ: దశరథ నేను ఆ ఇంటికి వెళ్లలేనురా నువ్వు సుమిత్ర వెళ్లి కాంచనను తీసుకురండి.
జ్యోత్స్న: నేను వెళ్తా అమ్మ మీరు వెళ్లొద్దులే. బావకి కాల్ చేస్తా అని చేస్తే కార్తీక్ కాల్ లిఫ్ట్ చేయడు. ఇక జ్యోత్స్న నేనే వెళ్లి అత్తకి సర్‌ఫ్రైజ్ ఇస్తానని జ్యోత్స్న ఒక్కర్తే వెళ్తుంది.

నర్శింహ ఓ టీ కొట్టు దగ్గర ఉంటే అనసూయ చూసి నా మేనకోడలి జోలికి ఎందుకు వస్తున్నావ్ అని అడుగుతుంది. నువ్వు ఓ రాక్షసుడివిరా వాళ్ల జోలికి రాకు అని అంటుంది. ఇక నర్శింహ దీపని నేను చంపకపోతే నా పేరు మార్చుకుంటా అని అంటాడు. దానికి అనసూయ నీకు అంత సీన్ లేదురా పోలీసులకు కూడా పిలిచాను అని అంటుంది. పోలీసులు వస్తుంటే నర్శింహ పారిపోబోతే అనసూయ పట్టి పోలీసులకు అప్పగిస్తుంది. దాంతో కోపంతో నర్శింహ అనసూయ తల మీద  కర్రతో కొట్టేస్తాడు. షాప్ ఆయన అనసూయకు నీరు ఇచ్చి సపర్యలు చేస్తారు. అనసూయ ఆయనకు కృతజ్ఞతలు చెప్తుంది. 

కాంచన: ఆ చంటి దానికి ఏం సమాధానం చెప్పకుండా వచ్చేశావ్ ఏంట్రా.
కార్తీక్: కార్తీక్ నాకు ఐస్ క్రీం కావాలి, చాక్లెట్ కావాలా ఇలా ఏం అడిగినా ఒక్క నిమిషం ఆలోచించకుండా ఇచ్చేసేదాన్ని కానీ అది నా జీవితం అడుగుతుంది. నాన్నగా ఉండమని అంటుంది.
కాంచన: దానికి తండ్రి ప్రేమ కావాలిరా. నువ్వు ఆ కోరిక తీర్చలేవని తెలుసు కానీ ఆ పసిదాని బాధ చూసి అయినా దేవుడు దానికి ఓ మంచి తండ్రిని ఇస్తే బాగున్నురా. కార్తీక్ పాప ఆరోగ్యం గురించి దీపకు చెప్తావా.
కార్తీక్: చెప్పనమ్మా నువ్వు చెప్పకు. దీప ఆ బ్యాగ్ ఏంటి నువ్వు ఊరు వెళ్లిపోవడం ఏంటి. దీప శౌర్యని చూడటం కాదు ముందు ఏం జరిగిందో చెప్పు. నిన్ను ఎవరు ఎమైనా అన్నారా.
దీప: ఎవరైనా ఏమైనా అంటేనే వెళ్లిపోవాలా మా ఊరు నేను వెళ్లాలి అంటే కారణాలు చెప్పాలా. నేను సుమిత్ర అమ్మ గారి ఇంటికి వచ్చింది మీ పెళ్లి చూసి వెళ్లిపోవాలి అని కానీ అది జరగదు అని అర్థమైంది కానీ ఇప్పుడు అది అయ్యేలా లేదు అందుకే వెళ్లిపోతున్నా. ఇక ఆ నర్శింహ మంటల్లో నా తాళి కాల్చేశాడు. ఇక నా జోలికి నా కూతురి జోలికి వస్తే వాడిని మంటల్లో వేస్తా. అయినా ప్రశాంతంగా బతకకుండా ఈ గొడవలు నాకు ఎందుకు నా బిడ్డను తీసుకొని నేను వెళ్లిపోతా.
కార్తీక్: ఆగు దీప మీరు ఎక్కడికి వెళ్లడం లేదు ఇక్కడే ఉంటారు.
దీప: లేదు బాబు ఇంక మమల్ని వదిలేయండి.
కార్తీక్: లేదు దీప శౌర్య ఎక్కడికి రాదు. బలవంతంగా ఊరు తీసుకెళ్లిపోతే వచ్చేసింది. ఊరు వెళ్తే రాదా.
దీప: మరోసారి ఇలా జరగదు నేను నా కూతుర్ని చూసుకుంటా. నా కూతుర్ని నన్ను తీసుకెళ్లనివ్వండి.
కార్తీక్: సారీ దీప నేను శౌర్యని ఎక్కడికీ తీసుకెళ్లనివ్వను. 
దీప: నేను తీసుకెళ్తా అన్నది నా కూతురిని బాబు.
కార్తీక్: నాకు బాధ్యత ఉంది నేను తీసుకెళ్లనివ్వను.
దీప: లేటు అయితే వెళ్లలేం మమల్ని వెళ్లనివ్వండి.
కార్తీక్: పాప రాదు అని చెప్తే అర్థం కావడం లేదా. 
దీప: కాదు అని చెప్పడానికి మీరు ఎవరు.
కార్తీక్: నేను మీ శ్రేయాభిలాషిని నేను వెళ్లనివ్వను. నర్శింహని పట్టుకొని జైలులో పెట్టిన తర్వాత మీరు ఎక్కడుండాలో నేను చెప్తా అంత వరకు శౌర్య ఎక్కడికీ రాదు. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: మీడియా ముందు మామని ఇరికించేసిన సత్య.. ఇక నో వెపన్స్.. మైత్రి, హర్షల సరసాలు చూసేసిన నందిని!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Embed widget