Karthika Deepam 2 Serial October 15th: కార్తీకదీపం 2 సీరియల్: ఇంటి నుంచి వెళ్లిపోయిన దీప.. మళ్లీ కార్తీక్ కోసం పాప పరుగులు, తేడా కొడుతుందంటోన్న పారు..!
Karthika Deepam 2 Serial Episode జ్యోత్స్న బెదిరింపుతో దీప పాపని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోవడం శౌర్య పారిపోయి కార్తీక్ కారు దగ్గర పడిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప, జ్యోత్స్నలు రోడ్డు మీద గొడవ పడతారు. నా బావని నీ చుట్టూ తిప్పుకోవడం మానేయ్ అని జ్యోత్స్న అంటే దీప జ్యోత్స్నని కొడుతుంది. మాట్లాడే పద్ధతి ఇదేనా అని తిడుతుంది. నా మాటలు నిజం అని నిరూపించాలి అంటే ఏం చేయాలి అని దీప అడిగితే మా ఇంటి నుంచి వెళ్లిపో అని జ్యోత్స్న అంటుంది. నీ కూతుర్ని అడ్డు పెట్టుకొని మా బావని నీ వైపు తిప్పుకుంటున్నావ్ అని అంటుంది. నువ్వు ఉంటే మా బావ నాకు దక్కడు నువ్వు పో దీప అని అంటుంది.
జ్యోత్స్న: ఇంత జరిగినా నువ్వు మా ఇంట్లో ఉన్నావు అంటే నీ మనసులో మా బావ ఉన్నట్లే. నీకు మా బావ కావాలా చెప్పు. నాకు మాత్రం మా బావ కావాలి. నువ్వు పోతేనే మా బావ నాకు దక్కుతాడు. నీకు ఏ మాత్రం ఆత్మాభిమానం ఉన్నా నువ్వు మా ఇంట్లో నుంచి పో దీప. లేదంటే నువ్వు మా బావ మీద ఆశ పడినట్లే.
జ్యోత్స్న మాటలకు దీప ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. దీప ఆవేశంగా ఇంటికి వెళ్తుంది. ఇక దీప బట్టలు సర్దుతుంది. మనం ఊరు వెళ్తున్నాం అని శౌర్యతో చెప్తుంది. శౌర్య ఎందుకని అడుగుతుంది. వెళ్లాక చెప్తానని అంటుంది. కార్తీక్‌కి చెప్తానని శౌర్య ఫోన్ చేస్తానంటే దీప శౌర్య దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటుంది. శౌర్య దీప దగ్గర ఫోన్ లాగేసుకుంటే ఫోన్ కింద పడిపోతుంది. ఇక దీప వెళ్దామని అంటే శౌర్య రాను అని అంటుంది. దానికి శౌర్య నాకు నువ్వు కావాలి కార్తీక్ కావాలి ఇద్దరూ కావాలి అంటే ఏం చేయాలి అని అడుగుతుంది. బలవంతంగా శౌర్యని తీసుకొని వెళ్లిపోతుంది. జ్యోత్స్న, పారిజాతం దీప వెళ్లిపోవడం చూస్తారు. దీప వెళ్లడం వెనుక ఏదో తేడా కొడుతుంది అని ఆపమని అంటుంది పారిజాతం. అన్నింటికీ దీపే అడ్డు అని అందుకే పంపేశానని అంటుంది. దానికి పారిజాతం జ్యోత్స్న తొందర పడిందని ఇలాంటి టైంలో అది గడప దాటితే మనకే నష్టమని అనుకుంటుంది.
దీప శౌర్యని తీసుకొని బస్‌స్టాప్‌కి వెళ్తుంది. శౌర్య మాత్రం కార్తీక్ కావాలని అంటుంది. దానికి దీప మనసులో నువ్వు కార్తీక్‌లో నాన్నని చూసుకుంటున్నావ్ అని అంటుంది. ఇక దీప బస్సు గురించి అడగటానికి వెళ్తే శౌర్య కార్తీక్‌ని కలవడానికి పారిపోతుంది. శౌర్య కనిపించకపోవడంతో దీప చాలా కంగారు పడుతుంది. పాప గురించి అందరికీ అడుగుతుంది. కార్తీక్ దగ్గరకే వెళ్లుంటుందని దీప కార్తీక్ వాళ్ల ఇంటికి బయల్దేరుతుంది. శౌర్య పరుగులు తీస్తూ ఉంటుంది. దీపని చూసిన శౌర్య అమ్మకి కనిపించకూడదని దాక్కుంటుంది.
మరోవైపు కార్తీక్ తల్లికి కాఫీ ఇచ్చి రెస్టారెంట్‌కి వెళ్తానని చెప్తాడు. కార్తీక్ ఇంటికి వచ్చేసిన శౌర్య కార్తీక్ బయటకు వెళ్లిపోవడం చూస్తుంది. ఇక తన తల్లి ఇంటి లోపలికి వెళ్లే వరకు ఆగి తర్వాత కారు వెనక పరుగులు తీస్తుంది. దీప కాంచన దగ్గరకు వెళ్లి శౌర్య వచ్చిందా అని అడుగుతుంది. లేదు అని కాంచన చెప్పడంతో దీప వెళ్లిపోతుంది. ఇక శౌర్య కారు వెనక పరుగులు తీయడం కార్తీక్ అద్దంలో చూస్తాడు. కారు ఆపుతాడు. శౌర్య దగ్గరకు వెళ్లే సరికి శౌర్య కింద పడిపోతుంది. కార్తీక్ పాపని తీసుకొని హాస్పిటల్‌కి బయల్దేరుతాడు. మరోవైపు దీప పాప కోసం వెతుకుతూ ఉండగా కాశీ కనిపించడంతో విషయం చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్యకి గన్ గురి పెట్టిన రుద్ర.. నందినిని గదిలో లాక్ చేసి హర్షతో మైత్రి రొమాన్స్!