Karthika Deepam 2 Serial Today March 3rd: కార్తీకదీపం 2 సీరియల్: చెల్లిని చావగొట్టిన దీప.. కన్నకూతురి చెంప పగలగొట్టిన సుమిత్ర.. దీప విశ్వరూపం!
Karthika Deepam 2 Serial Today Episode దీపని కిడ్నాప్ చేయించింది జ్యోత్స్న అని తెలుసుకున్న దీప జ్యోత్స్న ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ రౌడీలను చితక్కొట్టి పాపని రక్షిస్తాడు. తర్వాత శౌర్యని తీసుకొని దీప దగ్గరకు వెళ్తాడు. మరోవైపు జ్యోత్స్న దొంగ చాటుగా ఇంటికి వస్తుంది. సుమిత్ర జ్యోత్స్నకి పాలు తీసుకొని వెళ్తుంటే పారిజాతం కూడా వస్తాను అంటే సుమిత్ర వద్దని అంటుంది.
సుమిత్ర గదికి వెళ్లే సరికి జ్యోత్స్న ఎప్పటిలా పడుకొని ఉంటుంది. సుమిత్ర కూతురికి దగ్గరుండి పాలు తాగిస్తుంది. జ్యోత్స్న తల్లితో బాధగా తప్పు చేసి పూర్తిగా మారిపోయినట్లు మాట్లాడుతుంది. జ్యోత్స్న మారిపోయిందని సుమిత్ర చాలా హ్యాపీగా ఫీలవుతుంది. సుమిత్రను హగ్ చేసుకొని నీ కూతురు మనవరాలు జస్ట్‌లో తప్పించుకున్నారు ఏం జరుగుతుందో భయంగా ఉందని అనుకుంటుంది. ఇక రెస్ట్ తీసుకుంటానని చెప్పి తల్లిని పంపేస్తుంది. మరోవైపు కార్తీక్ దీప, పాపని ఇంటికి తీసుకెళ్లడంతో అందరూ షాక్ అవుతారు. నర్శింహనే ఇలా చేశాడని అనుకుంటారు. కార్తీక్ మందులు తేవడానికి వెళ్తాడు. దీప, శౌర్యని రెస్ట్ తీసుకోమని చెప్పి అనసూయ, కాంచన వెళ్లిపోతారు.
శౌర్య: అమ్మ కొందరు నీ నోరు నొక్కేశారు కదా అది నేను చూశానమ్మా. నోరు నొక్కేసింది బూచోడు కాదు జ్యో. జ్యోకి మనం ఇష్టం లేదా. తనే రుమాలుతో నీ ముఖం మూసేసింది. జ్యో మంచిది అనుకున్నా ఇలా చేసింది ఏంటమ్మా.
దీప: మనసులో జ్యోత్స్న నువ్వు నా జోలికి వస్తే ఊరుకున్నా ఇప్పుడు నా కూతురి జోలికి వచ్చావ్ నిన్ను ఇక వదలను వస్తున్నా జ్యోత్స్న. శౌర్య ఇక్కడే ఉండు నాకు చిన్న పని ఉంది.
అనసూయ: మీ అమ్మ ఏదే.
శౌర్య: బయటకు వెళ్లింది.
శివన్నారాయణ ఇంటిళ్ల పాది పెళ్లి కొడుకు వెటలో పడతారు. అందులో కలెక్టర్ కొడుకు గౌతమ్ కూడా ఉంటాడు. జ్యోత్స్న ఫ్రెండ్ అని సుమిత్ర గుర్తు చేస్తుంది. గౌతమ్ ప్రపోజ్ చేయడం గుర్తు చేసుకుంటారు. అందరూ జ్యోత్స్న, గౌతమ్‌లకు పెళ్లి చేయాలని అనుకుంటారు. మరోవైపు జ్యోత్స్న తనని దీప, శౌర్య ఎవరైనా చూశారేమో అని టెన్షన్‌తో జ్వరం పెట్టుకుంటుంది. గజగజా వణికిపోతుంది. ఇంతలో దీప రౌడీ రంగమ్మలా జ్యోత్స్న ఇంటికి వస్తుంది.
దీప: జ్యోత్స్న..
పారిజాతం: ఏయ్ అక్కడే ఉండు లోపలికి రాకు.
దీప: నేను రావడానికి గడపే అడ్డు అయితే దాన్ని బద్దలగొట్టి అయినా లోపలికి వస్తా. జ్యోత్స్న బయటకు రా.
జ్యోత్స్న: దీప వచ్చేసింది దానికి నేను దొరక కూడదు. దొరికితే చంపేస్తుంది.
సుమిత్ర: ఏమైంది దీప చేతికి కట్ట ఏంటి.
దీప: మీ ఇంటి వారసురాలు నాకు ఇచ్చిన బహుమానం. జ్యోత్స్న నువ్వు బయటకు వస్తావా నన్నే లోపలికి రమ్మంటావా. ముందు జ్యోత్స్న ఎక్కడో చెప్పండి.
పారిజాతం: సుమిత్ర గదిలో నిద్రపోతుంది.
దీప: నేను నా కూతురు చచ్చామనుకొని నిద్రపోతుంది అనుకుంటా. అందరూ దీపని ఆపడానికి ప్రయత్నిస్తారు.
కార్తీక్: అమ్మ ఏది
శౌర్య: బయటకు వెళ్లింది నాన్న. నన్ను ఎత్తుకు పోవడానికి జ్యో వచ్చింది అని చెప్పా కోపంగా వెళ్లింది. జ్యోనే అమ్మ ముఖం మీద రుమాలు పెట్టింది. జ్యో ఎందుకు అలా చేసింది నాన్న.
కార్తీక్: అయితే దీప అక్కడికే వెళ్లింది. తర్వాత మాట్లాడుకుందాం.
దీప జ్యోత్స్నని లాక్కొచ్చి అందరి ముందు కొడుతుంది. జ్యోత్స్న దశరథ్ దగ్గరకు వెళ్లి డాడీ దీప చంపేసేలా ఉంది కాపాడు అంటుంది. ఏమైందని దీపని అడిగితే జ్యోత్స్న నన్ను నా కూతురి చంపాలి అనుకుందని చెప్తుంది. దాంతో అందరూ షాక్ అయిపోతారు. దీప జ్యోత్స్నని చావకొడుతుంది. జ్యోత్స్న తల్లితో మమ్మీ ఉదయం నుంచి నీ గదిలోనే ఉన్నాను కదా దీప ఎందుకు అబద్ధం చెప్తుందో నాకు అర్థం కావడం లేదు మమ్మీ నువ్వే కాపాడు అని అంటుంది. దాంతో దీప జ్యోత్స్నని కొట్టబోతుంది. దాంతో సుమిత్ర దీప చేయి పట్టుకుంటుంది. సుమిత్ర చేయి విదిలించేసి దీపని కొడుతుంది. దాంతో సుమిత్ర దీపని కొడుతుంది. నా కూతురి మీద అరుచుకుంటూ చావ బాదుతున్నావ్ ఏంటి అని తిడుతుంది. తనకి కిడ్నాప్ చేశారని తనకు జ్యోత్స్న మత్తుపెట్టిందని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మిధున, దేవాలకు మరోసారి పెళ్లి చేసిన బస్తీవాసులు.. దేవాకి పెద్ద షాకే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

