Karthika Deepam 2 Serial Today March 15th: కార్తీకదీపం 2 సీరియల్: మొగుడికి దగ్గరుండి మూడో పెళ్లి చేస్తానన్న్ కావేరి.. జ్యోత్స్నకి నగలు.. దీపకి గాజులు!
Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న కోసం పెద్దాయన తన మొదటి భార్య నగలు ఇవ్వడం కార్తీక్ దీప కోసం గాజులు కొనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంది అని సుమిత్ర కాంచనకు చెప్పడంతో కార్తీక్ నమ్మడానికి ఇష్టపడదు. దీపతో విషయం చెప్తే అందరూ ఏదో ఒక రోజు మారుతారని అంటుంది. నిజంగా జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకుంటే ఓకే కానీ ఈ పెళ్లి కూడా నాటకం అయితే ఏంటి అని అంటాడు. దీప జ్యోత్స్న మీద నమ్మకంగా చెప్తే ఆ మనిషి నమ్మేలాంటిది కాదని కార్తీక్ అంటాడు.
కావేరి: నేనే మిమల్ని బాగా చూసుకోలేకపోతున్నాను. మీకు మూడో పెళ్లి నేను అక్క దగ్గరకు వెళ్లిపోతాను.
శ్రీధర్: ఇప్పుడు మూడో పెళ్లి అంటే జనం నవ్వుతారే. పైగా ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు.
కావేరి: నేను ఓ పిల్లని చూశాను మీరు సరే అనండి.
శ్రీధర్: మూడో పెళ్లి అంటే ఒప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది.
కావేరి: మీకు పెళ్లి చేసి నా ఆస్తి మొత్తం మీకు రాసి నేను అక్క దగ్గరకు వెళ్తాను. మీకు కాదు అంటే నేను చచ్చిపోతా.
శ్రీధర్: కానివ్వు.. నా పెళ్లికి నా పెద్ద పెళ్లాన్ని పిలుస్తావా. బెడ్ మీద నుంచి కింద పడి ఓ ఇందంతా నా కల. అంటే నా రెండో పెళ్లాం నా మూడో పెళ్లి చేయడం లేదా. ఓరేయ్ శ్రీధర్ పట్టపగలే కలలు కంటున్నావ్రా. ఇలాంటి కల వచ్చింది అంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది. అది కనిపెట్టాలి.
లోపలికి వెళ్లి చూస్తే కావేరి కూతురితో మాట్లాడుతుంది. గుడ్ న్యూస్ అని జ్యోత్స్నకి పెళ్లి అని చెప్తుంది. నిజంగా శుభవార్తే అని కావేరి అంటుంది. నాన్నకి విషయం చెప్పు అంటే ఇలాంటి శుభవార్తలు చెప్పకూడదు అని ఇక కార్తీక్ కష్టాలుపోయావి అని కావేరి మాట శ్రీధర్ వింటాడు. శుభవార్త, కార్తీక్ కష్టాలు పోయావి అంటే పెద్దాయన ఆస్తి ఇచ్చేశాడేమో అని అనుకుంటాడు. శివన్నారాయణ తన మొదటి భార్య బంగారు నగలు అన్నీ ముందు వేసుకొని పారిజాతాన్ని పిలుస్తాడు. పారిజాతం ఆ నగలు చూసి బిత్తరపోతుంది. తనకే ఆ నగలు ఇవ్వడానికే అని పారిజాతం అనుకొని భర్త కాళ్ల మీద పడి పొగిడేస్తుంది. నగలు అన్నీ ఎగాదిగా చూసి మురిసిపోతుంది. ఏవండీ మీరే నాకు ఇవన్నీ అలంకరించండి అని అడుగుతుంది.
శివన్నారాయణ నగలన్నీ మూసేసి జ్యోత్స్న దగ్గరకు తీసుకెళ్లాలని అంటాడు. ఓరే పాపిష్టోడా ఆశ పెట్టి ఇలా చేశావేంట్రా అని తిట్టుకుంటుంది. ఇక జ్యోత్స్నని సుమిత్ర రెడీ చేస్తుంటే అక్కడికి వెళ్లి సుమిత్రతో ఇవన్నీ మీ అత్తయ్య నగలు అని బతికి ఉంటే తానే అలంకరించేదని అంటారు. ఎన్ని అయితే అన్ని జ్యోత్స్నకి అలంకరించమని అంటారు. ఇవన్నీ నీవే అని అంటారు. ఇక దీప రెడీ అవుతూ గాజులు కోసం వెతుకుతుంది. కార్తీక్‌ని గుద్దేస్తుంది కార్తీక్ పట్టుకుంటాడు. గాజులు కోసం చూసుకోకుండా తిరిగానని అంటుంది. గాజులు తన దగ్గరే ఉన్నాయని కార్తీక్ కొత్త గాజులు చూపిస్తాడు. నువ్వు నా గుండెల్లో ఉన్నావని నీ స్థానం ఎప్పటికీ అదే అని అంటాడు. ఇద్దరూ ప్రాణదాత గురించి మాట్లాడుకుంటారు. ఇక కార్తీక్ దీపకి గాజులు వేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

