Karthika Deepam 2 Serial Today March 10th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!
Karthika Deepam 2 Serial Today Episode కార్తీక్ ఇంటి శ్రీధర్ వచ్చి ఆస్తి పంపకాల వీలునామా కోసం చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode ఆస్తిపంపకాల విషయం తెలిసిన శ్రీధర్ భార్యని తీసుకొని కార్తీక్ ఇంటికి వస్తాడు. మీరు ఇలా మిర్చి బజ్జీల గురించి మాట్లాడుకోండి అవతల కోట్లు పోతాయని శ్రీధర్ అంటాడు. కార్తీక్ వాళ్లు ఆవేమీ పట్టించుకోకుండా కావేరికి మర్యాద చేస్తారు. కాంచన కుర్చీ వేయమంటే దీప కుర్చీ వేస్తుంది.
శ్రీధర్: మీ తాత వీలునామా రాశారంట. రేపే తెలుస్తుంది ఎవరి ఏం రాశారో. రేపు రాసింది చూసి గుండెలు బాధుకునే కంటే ఇప్పుడు నిలదీస్తే మీకు సమాన వాటా వస్తుంది. అసలే మీ నాన్న మీ మీద కోపంతో ఉన్నారు. ఇలాంటి టైంలో ఆస్తిపంపకాలు అంటే మీకు నష్టం రావడం ఖాయం. ఇప్పుడు మీరు నాతో రండి నేను నిలదీస్తా.
కాంచన: దీనికి మీకు సంబంధం ఏంటి.
శ్రీధర్: నేను నీ భర్త కోట్ల ఆస్తి పోతుంది.
కార్తీక్: ఆయన ఇచ్చినా నాకు అవసరం లేదు. వద్దు అనుకొని వచ్చేసింది నాకు వద్దు.
శ్రీధర్: ఆస్తి విషయంలో నువ్వు మీ నాన్నకి ప్రశ్నించకపోవడం నిజంగా నీ ఖర్మ.
కాంచన: ఆయన ఎవరికి పంచుతారో అది ఆయన ఇష్టం.
శ్రీధర్: అంటే ఆస్తి ఇవ్వకపోయినా నీకు ఓకేనా.
కార్తీక్: మాకేం అవసరం లేదు.
శ్రీధర్: సరే రేపు వీలునామాలో ఏం ఉందో తెలిసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం.
కాంచన: నా కొడుకు సమర్ధుడు వాడే సంపాదించుకుంటాడు.
శ్రీధర్: ఇప్పుడు మీరు మేల్కోకపోతే తలా బూజు కర్ర పట్టుకొని దులుపుకోవడమే.
కార్తీక్: చిన్నమ్మ ఈ విషయం మీకు ఎలా తెలిసింది.
కావేరి: మళ్లీ ఆయనతో అనకండి పారిజాతం అమ్మమ్మ అక్కడికి వచ్చింది.
శ్రీధర్ ఇంట్లో కుస్తీలు పడుతుంటే కావేరి వచ్చి మీ మనసులో ఏముందో నాకు అర్థమైంది అని అక్క పేరున ఆస్తి వస్తే అక్క తీసుకోదని మీరు కొట్టేయాలి అనుకుంటున్నారు కదా అంటాడు. కావేరి శ్రీధర్ మనసులో అనుకున్న ప్రతీ మాట బయటకు చెప్పేస్తే శ్రీధర్ నోరెళ్ల బెడతాడు. ఇక కావేరి ఆస్తి గురించి ఆలోచిస్తే కార్తీక్‌కి చెప్పేస్తా అంటుంది. ఇద్దరి పెళ్లాల్ని మెంటైన్ చేశా ఇదంతా నాకు జుజుబీ అని శ్రీధర్ అనుకుంటాడు. ఇక సత్యరాజ్ రెస్టారెంట్‌కి వచ్చి రెస్టారెంట్‌కు మళ్లీ పూర్వవైభవం వస్తుందని కార్తీక్, దీపలతో తన సంతోషం పంచుకుంటాడు. వంటలు, కస్టమర్లు, మ్యానేజ్ మెంట్ అన్నీ బాగున్నాయని పొగుడుతాడు. ఇక ఆయన వంటలు రుచి చూస్తానని అంటాడు. సత్యరాజ్ రెస్టారెంట్ కోసం కొత్తగా ఏమైనా చేయాలి అనుకుంటామని దీప అంటుంది. రెస్టారెంట్ డెవలప్‌మెంట్‌కి ఏం చేయాలి అనుకుంటున్నారో చేయండి అంటారు.
ఇక కార్తీక్ దీపతో నా ప్రాణదాత ఫొటో కోసం నా ఫ్యాంట్ మొత్తం వెతికావు కదా అంటాడు. లేదని దీప చెప్తుంది. ఇక కార్తీక్ దీపతో చిన్నప్పుడు నీళ్లలో నువ్వు పడిపోతే ఎవరినైనా నిన్ను కాపాడారా అని అడుగుతాడు. నాకు ఈత రాదని దీప అంటుంది. తనకు రాదని ఇద్దరం కోనేటిలో ఈత నేర్చుకుందామా అంటాడు. కార్తీక్ బాబుకి నిజం తెలిసి ఇలా అడుగుతున్నాడా అని అనుకుంటుంది. కార్తీక్ దీపతో మన ఇద్దరం ఒకరి కోసం ఒకరు బతుకుతున్నాం అని ఇక చిన్న నాటి ప్రాణ దాత దొరికిపోతే ఆవిడ కోసం తిరిగి ఏదో ఒకటి చేయాలి అని అంటాడు. అవును బాబు చేయాలి అని దీప అంటుంది. దీప వీలునామా గురించి అడిగితే శివన్నారాయణ గారు ఆయనకు నచ్చినట్లు వీలునామా రాసుకోని నాకేం సంబంధం లేదని కార్తీక్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

