గుండె సమస్యలు ఏ సీజన్​లో అయినా వస్తాయి. అయితే సమ్మర్​లో కొంచెం ఎక్కువగా వస్తాయి.

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల వేడికి బీపీ పెరుగుతుంది. ఇది గుండెపై నెగిటివ్​గా ప్రభావం చూపిస్తుంది.

డీహైడ్రేషన్​ వల్ల రక్తం చిక్కగా మారుతుంది. ఇది హార్ట్ అటాక్ సమస్యలను పెంచుతుంది.

ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో చేసే కొన్ని పనుల వల్ల కూడా ఈ సమస్య ఎక్కువ వచ్చే ప్రమాదముంది.

గాలి కాలుష్యం సమ్మర్​లో ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె సమస్యలను పెంచుతుంది.

ఛాతిలో అసౌకర్యం, నొప్పి, చేతులు, మెడ, దవడ భాగంలో నొప్పి వంటి లక్షణాలు కలిగి ఉంటుంది.

బ్రీత్ తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది. రెస్ట్ పొజీషన్​లో ఉన్నా కూడా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.

కళ్లు తిరగడం, అలసట, నీరసంగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలెర్ట్ అవ్వాలి.

హైడ్రేటెడ్​గా ఉంటూ.. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీడలో ఉండే పనులు చేసుకోవాలి.

రెగ్యులర్​గా రక్తపోటును చెక్ చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే వైద్య సేవలు తీసుకోవాలి.