Karthika Deepam 2 Serial Today January 15th: ‘కార్తీక దీపం 2’ సీరియల్ : దాసును కొట్టిన జ్యోత్స్న – జ్యోత్స్నను తిట్టిన పారిజాతం
Karthika Deepam 2 Today Episode: నిజం చెప్పడానికి ఇంటికి వచ్చిన దాసును కర్రతో తలపై కొడుతుది జ్యోత్స్న. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Karthika Deepam 2 Serial Today Episode: నిజం తెలిసిన పారిజాతం కంగారు పడుతుంది. చెంపదెబ్బతో సరిపెట్టారు కానీ వాళ్లు ఇంటికి వచ్చి గొడవ చేసి ఉంటే అంటూ జ్యోత్స్నను నిలదీస్తుంది. ఆస్తి అంతా మనకు దక్కే వరకు ఓపికగా ఉండమంటే ఎందుకు ఉండటం లేదని తిడుతుంది. అసలు వారసురాలు ఇక్కడే ఉందని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇంతలో దాసు వస్తాడు. నిజం చెప్పాలని వచ్చిన దాసు శివన్నారాయణ చూస్తే తనను లోపలికి రానివ్వరని.. సుమిత్ర వదినకు గానీ, దశరధి అన్నయ్యకు గానీ నిజం చెప్పాలని అనుకుంటాడు. ఇంతలో శివనారాయణ దాసును చూస్తాడు.
శివ: అగు అక్కడ ఈ టైమ్లో ఎందుకొచ్చావ్ దొంగతనానికా..?
పారిజాత: వాడు నా కోసమే వచ్చాడు.
దాసు: కాదు దశరథ్ అన్నయ్య కోసం వచ్చాను.
నిజం చెప్పేందుకే దాసు వచ్చాడని జ్యోత్స్న భయపడుతుంది. ఇంతలో దశరధి అక్కడికి వస్తాడు. కానీ శివనారాయణ కోపంగా దాసును బయటకు వెళ్లు అంటూ తిడతాడు. దాసు బయటక వెళ్తూ జ్యోత్స్నను కోపంగా చూస్తాడు. మరోవైపు ఆడుకుంటూ ఉన్న శౌర్య ఉన్నట్టుండి కింద పడిపోతుంది. దీప, కార్తీక్ కంగారుగా పరుగెత్తుకొస్తారు. గుండె సమస్య మళ్లీ రివర్స్ అయినట్టు ఉందని కార్తీక్ మనసులో అనుకుంటాడు. శౌర్యను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తాడు కార్తీక్.
డాక్టర్: కార్తీక్ పాపకు ఇక మందులతో తగ్గదు. సర్జరీ చేయాల్సిందే..? సర్జరీ చేయకపోతే పాప గుండె ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేం.
కార్తీక్: ఎప్పుడు చేయాలి డాక్టర్ ఆపరేషన్..
డాక్టర్: టైం లేదు కార్తీక్.. వీలైనంత త్వరగా చేస్తే బెటర్..
కార్తీక్: సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్..
డాక్టర్: యాభై లక్షలు అవుతుంది కార్తీక్..
కార్తీక్: యాబై లక్షలా…? సరే.. డాక్టర్..
డాక్టర్: ముందుగా లక్ష రూపాయలు కడితే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తాం.
శౌర్య: మనం ఇంకా ఇంటికి వెళ్లలేదా..?
కార్తీక్: సరే డాక్టర్ నేను మీకు ఫోన్ చేస్తాను..
అంటూ చెప్పి శౌర్యను తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు కార్తీక్. మరోవైపు ఎలాగైనా నిజం చెప్పాలని దాసు మరోసారి శివనారాయణ ఇంటికి వెళ్తాడు. అప్పుడే శివనారాయణ బయటకు వెళ్లడం చూసి లోపలికి వెళ్తాడు దాసు. దాసును చూసిన జ్యోత్స్న సుమిత్ర రూంకి లాక్ వేసి దాసు దగ్గరకు వస్తుంది జ్యోత్స్న
జ్యోత్స్న: నాన్న నువ్వు ఎప్పుడొచ్చావ్
దాసు: డోర్ ఎందుకు లాక్ చేశావు.. లోపల ఎవరున్నారని లాక్ చేశావు. రాత్రి నేను ఎందుడు వచ్చానో నీకు అర్థమైంది కదా.. అందుకే వచ్చాను.
దాసును బయటికి తీసుకెళుతుంది జ్యోత్స్న.
జ్యోత్స్న: నిజ ఎవ్వరికీ చెప్పనని మాటిచ్చావు కదా..?
దాసు: కానీ నువ్వు దీప బతుకుదెరువును తగులబెట్టావ్ కదా..
జ్యోత్స్న: అబద్ధం అంతా అబద్దం.. నేను చేయడం ఏంటి…?
దాసు: మోసం చేసింది చాలు.. దీపే ఈ ఇంటి అసలైన వారసురాలని, నువ్వు నా కూతురివని తప్పకుండా నిజం చెప్తాను.
జ్యోత్స్న: ఈ ఒక్క తప్పును క్షమించు నాన్న
అని జ్యోత్స్న ప్రాధేయపడుతుంది. ఇక్కడి నుంచి వెళ్లిపో అని కన్నీరు.
పెట్టుకుంటుంది. అయినా దాసు వినకుండా నిజం చెప్పేస్తానని లోపలికి వెళ్తుంటే.. కర్ర తీసుకుని దాసును వెనక నుంచి తల మీద గట్టిగా కొడుతుంది జ్యోత్స్న. దాసు గట్టిగా అన్నయ్యా అంటూ అరుస్తాడు. దాసు అరుపు విని ధశరథి బయటకు వస్తాడు. దాసు చూసి షాక్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















