Jagadhatri November 28th Episode: 'జగద్ధాత్రి' సీరియల్: తెలివిగా తన పని కానిచ్చేసిన రామస్వామి - కౌషికికి అడ్డంగా దొరికిపోయిన ధాత్రి, కేదార్!
Jagadhatri November 28th Episode: రామస్వామి తను చెప్పాలనుకున్న విషయాన్ని యువరాజ్ కి సీక్రెట్ గా చేరవేయడంతో కథలో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి.
Jagadhatri Telugu Serial November 28th Episode: యువరాజ్ ని రామస్వామిని కలపటానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి తన ప్లాన్ అంతా ఆఫీసర్ కి చెప్తుంది ధాత్రి. ఆ ఐడియా బాగుందని దానికి తగిన ఏర్పాట్లు చేయమని మరో కింది ఆఫీసర్ కి చెప్తాడు. అప్పుడు ఆ ఆఫీసర్ రామస్వామిని తీసుకువచ్చి ఒక రూమ్ లో కూర్చోబెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
మరోవైపు కాచి కంగారుగా అటు ఇటు తిరగడాన్ని గమనించిన వైజయంతి ఎందుకలా తిరుగుతున్నావు అని అడుగుతుంది.
కాచి: నిజం తెలుసుకొని వస్తాడు అనుకున్న మనిషి ఇప్పటివరకు రాలేదు ఏం జరిగిందా అని కంగారుగా ఉంది.
వైజయంతి : అల్లుడు పులి. పులిని చూసి అందరూ భయపడాలి కానీ పులి కోసం మనం భయపడకూడదు అని కూతురికి ధైర్యం చెబుతుంది.
నిషిత కూడా కాచిని భర్త మీద ప్రేమ ఉందో లేదో అంటూ సరదాగా ఏడిపిస్తుంది. అల్లుడికి ఒకసారి ఫోన్ చెయ్యు అని వైజయంతి చెప్పడంతో కాచి అతనికి ఫోన్ చేసేలోపు అక్కడికి ఆమె భర్త వస్తాడు కానీ రూపురేఖలు మారిపోవడంతో గుర్తుపట్టలేక మళ్లీ వాళ్ల చేతిలో కూడా తన్నులు తింటాడు. ఆ తరువాత వచ్చింది తన అల్లుడని తెలుసుకుని ఏం జరిగింది అని అడుగుతుంది వైజయంతి.
కాచి భర్త: జరిగిందంతా చెప్పి వాళ్ళని పట్టుకోలేకపోయాను.. మళ్ళీ ప్లాన్ ముందు నుంచి వేద్దాం అప్పుడు కచ్చితంగా పట్టుకుంటాను అని అంటాడు.
వైజయంతి మాట్లాడుతూ.. ఇప్పటికి మీరు పట్టుకున్నది చాలు అని అనడంతో భార్య సాయంతో ఇంట్లోకి వెళ్లిపోతాడు అతను. ఇదంతా పైనుంచి చూస్తుంది కౌషికి.
కౌషికి: వీళ్ళు ఎందుకు ధాత్రి వాళ్ళని పట్టుకోవాలని చూస్తున్నారు, అసలు ధాత్రి వాళ్ళు ఎక్కడికి వెళ్లారు. వీళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏదో చేస్తున్నారు అనుకుంటుంది.
మరోవైపు ఎంక్వయిరీకి వచ్చిన యువరాజ్ కి రామస్వామి కనిపిస్తాడు. యువరాజ్ తనతో ఎక్కడ మాట్లాడేస్తాడో అని కంగారు పడతాడు రామస్వామి.
రామస్వామి: తెలివిగా తనతో మాట్లాడాలి అనుకుంటున్న యువరాజ్ తో ఏంటి బ్రదర్ నిన్ను కూడా ఎంక్వైరీకి పిలిచారా, నన్ను కూడా ఎంక్వయిరీకే పిలిచారు నేనేమీ చెప్పలేదు, ఎందుకంటే నాకు ఏమీ తెలియదు కదా అంటూ యువరాజ్ కి అర్థమయ్యేలాగా మాట్లాడుతాడు.
ఇదంతా మానిటర్ చేస్తుంటారు పోలీసులు.
రామస్వామి పాట పాడుతున్నట్లుగా పాడుతూ షర్ట్ కి రక్తం అంటించిన విషయం చెప్తాడు. విషయం యువరాజ్ కి అర్థమవుతుంది కానీ పోలీసులకి అర్థంకాక ఈ పని వర్కౌట్ అయ్యేలాగా లేదు నేను వెళ్లి ఎంక్వయిరీ చేస్తాను అని ఆఫీసర్ యువరాజ్ దగ్గరికి వస్తాడు.
ఆఫీసర్: మీనన్ తో నీకేంటి సంబంధం, అతని గురించి నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడినుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు.
యువరాజ్: నాకు ఆ గ్యాంగ్‌స్టర్ కి ఎందుకు సంబంధం ఉంటుంది. సొసైటీలో మాది చాలా పరువుగల కుటుంబం. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నన్ను ఇలా ఎంక్వయిరీకి పిలిస్తే అది మాకు ఎంత అవమానం.
ఆఫీసర్ : అయితే నీకు మీనన్ కి ఎలాంటి సంబంధం లేదా..
యువరాజ్: తెలియదు అంతేకాదు అలాంటి వాళ్ళ మొహం కూడా చూడలేదు.
ఆఫీసర్ యువరాజ్ ని వెళ్ళిపోమంటాడు. వెళ్తున్న యువరాజ్ ని ఈ వ్యక్తి తెలుసా అని రామస్వామిని చూపిస్తాడు. తెలియదు అని చెప్పి వెళ్ళిపోతాడు యువరాజ్.
ధాత్రి: యువరాజ్ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం.
కేదార్: మరి ఇప్పుడు రామస్వామిని ఏం చేద్దాం.
ధాత్రి : ఏం చేద్దామని కొత్తగా అడుగుతావేంటి ఎప్పటిలాగే రాత్రిపూట బయటకు తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసేద్దాం అని రామస్వామి వినేటట్లుగా మాట్లాడుతుంది.
ధాత్రి కళ్ళు సైగలు అర్థం చేసుకున్న ఆఫీసర్ మనకి అంతకుమించి వేరే ఆప్షన్ లేదు అలాగే చేద్దాం అంటాడు. ఆ మాటలకి భయపడిన రామస్వామి ఎలా అయినా తప్పించుకోవాలి అనుకుంటాడు.
ఆ తర్వాత తన రూములో కూర్చుని కాలికి నైల్ పాలిష్ వేసుకుంటున్న ధాత్రికి ఫోన్ రావడంతో మధ్యలోనే వదిలేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కేదార్ ఆమె కాళ్ళకి నైల్ పాలిష్ పెడుతూ ఉంటాడు.
ధాత్రి : షాక్ అవుతూ నువ్వు నా కాళ్లు పట్టుకోవడం ఏంటి.
కేదార్ : సగంలో ఆపేసావు కదా పూర్తి చేద్దాం అని అంటూ అయినా ఇందులో తప్పేముంది ఇప్పుడు నీ చేతికి కూడా వేస్తాను చూడు అంటాడు.
ధాత్రి: నువ్వు ఎప్పుడూ నా కాళ్లు పట్టుకోవడం చేయకు.
కేదార్: నేను నీ కాళ్ళు పట్టుకోవడాన్ని ఎప్పుడూ చిన్నతనంగా ఫీల్ అవ్వను. ఎందుకంటే నువ్వు నాకోసం వదులుకున్న వాటికన్నా ఇదేమీ ఎక్కువ కాదు. అయినా మన లక్ష్యం పూర్తయిన తర్వాత కూడా మనం కలిసే ఉంటాం కదా విడిపోముకదా.
ధాత్రి: ఎందుకు విడిపోతాం, మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ అనబోయి వాళ్ళ మాటలు వింటున్న కౌశికిని చూసి మనం భార్యాభర్తలం కదా ఎందుకు విడిపోతాం అంటూ భర్తకి సిగ్నల్ ఇస్తుంది.
ఆ మాటలు అన్నీ విన్న కౌషికి లోపలికి వస్తుంది అసలు మీరిద్దరూ భార్యాభర్తలేనా, ఎవరైనా భర్త భార్యకి నైల్ పాలిష్ వేస్తే మురిసిపోతుంది కానీ ఎందుకు నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు అసలు మీ ఇద్దరికీ పెళ్లి అయిందా అని అనుమానంగా అడుగుతుంది.
ధాత్రి: అలాంటిదేమీ లేదు వదిన, నాకు నెయిల్ పాలిష్ ఇష్టం లేదు తనకోసమే పెట్టుకుంటున్నాను.. అలాంటిది తను వచ్చి మొత్తం చెడగొట్టేస్తున్నాడు.
కౌషికి: అంతేనా అంటూ కీర్తి బర్త్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి అది చెప్పడానికే వచ్చాను త్వరగా రండి అని చెప్పి వెళ్ళిపోతుంది.
ఆమె వెళ్లిపోయిన తర్వాత మనం జాగ్రత్తగా లేకపోతే వదినకి దొరికిపోతాం అని కేదార్ ని హెచ్చరిస్తుంది ధాత్రి.
మరోవైపు కూతురితో ఫోటోలు తీసుకోవాలనుకుంటున్న కౌషికి కూతురు బాధగా ఉండటం చూసి ఏం జరిగింది అని అడుగుతుంది. ఆమె తండ్రి తో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఉంది అని సైగల ద్వారా చెప్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆