Jagadhatri serial Today January 5th: 'జగద్ధాత్రి' సీరియల్: కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న కేదార్, కోపంతో రగిలిపోతున్న ధాత్రి!
Jagadhatri serial Today Episode : యువరాజ్ తల పగల కొట్టడంతో హాస్పిటల్లో జాయిన్ అయిన కేదార్ కి బ్లడ్ దొరకదు దాంతో కేదార్ పరిస్థితి ఏమవుతుందో అనే క్యూరియాసిటీ కథలో ఏర్పడుతుంది.
Jagadhatri serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో ఆ కేదార్ గాడిని పైకి పంపించేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటాడు యువరాజ్.
మరోవైపు డల్ గా ఉన్న ధాత్రిని ఏం జరిగింది అని అడుగుతాడు కేదార్.
ధాత్రి : తలనొప్పిగా ఉంది
కేదార్: నొప్పితోనే పని అంతా చేసావా రెస్ట్ తీసుకోవచ్చు కదా నీ మీద నువ్వు కేర్ తీసుకోవు అదే నాకు నచ్చదు. ఉండు ఇప్పుడే టాబ్లెట్స్ తీసుకు వస్తాను నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అని ధాత్రి చెప్తున్నా వినిపించుకోకుండా బయటికి వెళ్తాడు.
యువరాజ్: రౌడీలకి ఫోన్ చేసి వాడు ఒంటరిగా బయటికి వస్తున్నాడు వాడిని ఫాలో అయ్యి ఎక్కడికి వస్తున్నాడో నేను చెప్తాను అంటాడు.
అటువైపు నుంచి రౌడీలు కేదార్ బండి నెంబరు అడగడంతో బండి నెంబర్ చూసి చెప్తాను అంటూ బయటికి వెళ్తాడు యువరాజ్. ఆ మాటలు వింటుంది రాత్రి.
ధాత్రి : యువరాజ్ ఏంటి కేదార్ బండి నెంబర్ గురించి మాట్లాడుతున్నాడు కేదార్ కి ఏదో ప్రమాదం ముంచుకొచ్చే లాగా ఉంది హెచ్చరించాలి అనుకుంటూ యువరాజ్ ని ఫాలో అవుతుంది.
యువరాజ్ కారులో వెళ్తుంటే ధాత్రి ఆటోలో ఫాలో అవుతుంది.
ధాత్రి: కేదార్ కి ఫోన్ చేసి యువరాజ్ నిన్ను ఫాలో అవుతున్నాడు నువ్వు ప్రమాదంలో ఉన్నావు జాగ్రత్త అని హెచ్చరిస్తుంది.
కేదార్: నీ మాటలు నాకు వినిపించడం లేదు టాబ్లెట్స్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
కొంత దూరం వెళ్లేసరికి రౌడీలు అడ్డగించి కేదార్ తో గొడవపడి అతనిని పక్కకి లాక్కెళ్లి అతనితో గొడవ పడతారు. కేదార్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు కానీ యువరాజ్ వెనుక నుంచి వచ్చి ఇనప రాడ్డుతో తల పగలగొడతాడు.
యువరాజ్: స్పృహలో లేని కేదార్ ని చూసి నాన్న కావాలా నాన్న.. అంటూ వెటకారంగా మాట్లాడుతూ కత్తితో పొడవబోతాడు.
అప్పుడే ఆటో దిగి కేదార్ని వెతుక్కుంటూ వచ్చిన ధాత్రి కేదార్ ని పిలవడంతో యువరాజ్ వాళ్ళు అక్కడినుంచి తప్పించుకుని వెళ్ళిపోతారు. తర్వాత ధాత్రి కేదార్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళుతుంది.
డాక్టర్: తల పగిలిన కేదార్ ని చూసి ఏం జరిగింది, గొడవ జరిగినట్లయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అంటాడు.
ధాత్రి : ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మీకు కావాలంటే నేను హోమ్ మినిస్టర్ తో అయినా ఫోన్ చేయిస్తాను అని చాలా కోపంగా అనటంతో వద్దులెండి అనుకుంటూ కేదార్ ని తీసుకొని ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తాడు డాక్టర్.
ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చిన డాక్టర్ని ఏం జరిగింది అని అడుగుతుంది రాత్రి.
డాక్టర్: బ్లడ్ చాలా పోయింది, అతనిది ఏ బి నెగిటివ్ బ్లడ్ గ్రూపు అది మన హాస్పిటల్ లో లేదు మీరు అరేంజ్ చేయండి అంటాడు.
ధాత్రి: నేను ట్రై చేస్తాను కానీ హాస్పిటల్ తరఫున ఏమి చేయటానికి లేదా అంటుంది.
డాక్టర్: బ్లడ్ డొనేటర్స్ గ్రూప్ ఒకటి ఉంది అందులో మెసేజ్ పెడతాను అంటాడు.
అప్పటికే అక్కడికి వచ్చిన యువరాజ్ అక్కడ జరుగుతున్న హడావుడి చూసి కేదార్ ఇంకా చనిపోలేనట్లుగా ఉంది అని నర్స్ ని పిలిచి ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ చేస్తున్న పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతాడు.
సిస్టర్: అతనికి రక్తం బాగా పోయింది బ్లడ్ కోసం ట్రై చేస్తున్నారు అంటుంది.
యువరాజ్: బ్లడ్ దొరకకపోతే అని అనుమానంగా అడుగుతాడు.
సిస్టర్: బ్రతకటం కష్టమే అయినా ఆయన గురించి అడుగుతున్నారు మీరు అతనికి బంధువా అని అడుగుతుంది.
యువరాజ్: లేదు క్యాజువల్గా అడుగుతున్నాను అంటాడు. అవునా అనుకుంటూ సిస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పక్కన ప్రాణం పోతుంటేనే ఈ రోజుల్లో ఎవరూ పట్టించుకోరు అలాంటిది వీడికి ఎవరు బ్లడ్ ఇస్తారు వీడి చావు కన్ఫర్మ్ అని ఆనందపడతాడు.
మరోవైపు ధాత్రి డాక్టర్ని కలిసి నేను చాలామందిని అడిగాను కానీ నాకు ఎక్కడ బ్లడ్ దొరకలేదు మీ గ్రూప్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని అడుగుతుంది.
డాక్టర్: లేదండి, ఎవరైనా వచ్చి బ్లడ్ ఇవ్వాలని కోరుకోవడం తప్పితే మనం ఏమి చేయలేము అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ధాత్రి బాధ కోపం గా మారుతుంది. దీనంతటికీ కారణం ఆ యువరాజే. ఇదంతా వాడే చేశాడని రుజువైతే మాత్రం వాడిని వదిలేది లేదు అని కసిగా అనుకుంటుంది దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: ఆ హీరో సినిమా లైఫ్ చేంజ్ చేసింది - నటి కరుణ భూషణ్